గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కుర్ర హీరోల పోటి పెరగటంతో తన ఏజ్కు, ఇమేజ్కు తగ్గ కథల కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న విక్టరీ హీరో మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ రోజు (ఆదివారం) వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ వివరాలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా రోజుల తరువాత వెంకీ సినిమా వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వెంకటేష్ తొలిసారిగా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికలో పక్కాగా ఉండాలన్న ఆలోచనతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గోపాల గోపాలా, దృశ్యం లాంటి డిఫరెంట్ మూవీస్ తరువాత మారుతి దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేష్.
అభిమానులకు బర్త్డే గిఫ్ట్
Published Sun, Dec 13 2015 2:26 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM
Advertisement
Advertisement