
రామానాయుడు.. 7 ప్రత్యేకతలు
ప్రముఖ నిర్మాత రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితులు. నిర్మాతగానే గాక రామానాయుడిని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవడానికి 7 ప్రత్యేకలున్నాయి.
1. రామానాయుడు తన కొడుకు సురేష్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు. సురేష్ ప్రొడక్షన్స్ లోగో 'ఎస్పీ'కి ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది ప్రముఖులు ఈ బ్యానర్లో నటించారు.
2. రామానాయుడు తాను నిర్మించిన చాలా చిత్రాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రల్లో ఆయన కాసేపు కనిపించేవారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, జడ్జి వంటి పాత్రలను పోషించేవారు.
3. స్టూడియోలను నెలకొల్పిన అతికొద్దిమంది ప్రముఖుల్లో రామానాయుడు ఒకరు. విశాఖపట్నంలో స్టూడియో ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి రామానాయుడే. రాష్ట్ర విభజన జరగకముందే ఆయన విశాఖలో స్టూడియోను స్థాపించారు.
4. 1991లో రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ను నెలకొల్పారు. గ్రామీణ యువతలో నైపుణ్యం పెంచేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ఇందుకోసం మెదక్ జిల్లా తునికి గ్రామంలో 33 ఎకరాలను విరాళంగా ఇచ్చారు.
5. అంజలి, షాజన్ పదంసీ, తన్వీ వ్యాస్, సంజన, మేఘన, కామ్న జెఠ్మలాని, మదాలసా శర్మ, ఆర్తీ అగర్వాల్, కత్రినా కైఫ్ (తెలుగులో), హరిత, అంజలా జవేరి, దివ్య భారతి తదితర తారలను పరిచయం చేశారు.
6. ప్రముఖ నటుడు వెంకటేష్.. రామానాయుడు కొడుకు. ప్రఖ్యాత నిర్మాత సురేష్ ఆయన పెద్ద కుమారుడు. యువ నటులు రానా, నాగ చైతన్య.. రామానాయుడి మనవళ్లు.
7. కేన్సర్ బాధితులకు రామానాయుడు ఏడాది పాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు.