Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా | TDP New Drama in Chandrababu Naidu Constituency Kuppam | Sakshi
Sakshi News home page

Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా

Published Tue, Aug 30 2022 12:51 PM | Last Updated on Tue, Aug 30 2022 1:20 PM

TDP New Drama in Chandrababu Naidu Constituency Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ మరో నాటకానికి తెరలేపింది. కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఆ పార్టీ నేతలు తాత్కాలిక టెంట్‌లో అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆ తాత్కాలిక టెంట్‌ ఓ వైపు ఒరిగిపోయింది.

కూలిపోయిన టెంట్‌తో ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దీంతో మున్సిపల్‌ సిబ్బంది కూలిపోయిన టెంట్‌ను ఉదయాన్నే తొలగించారు. దీన్ని కూడా టీడీపీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోంది. ఆ టెంపరరీ టెంట్‌ వర్షంతో కూలిపోవడంతో దాన్ని తొలగించినటు మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేశారు. 

చదవండి: (Shashi Tharoor: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి రేసులో ఎంపీ శశిథరూర్‌!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement