జగన్నాథపురంలో ప్రారంభానికి నోచని క్యాంటీన్
సాక్షి, కాకినాడ : పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే లక్ష్యంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వాటికి సంబంధించిన పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. కాకినాడ నగరంలోని పలుచోట్ల అన్న క్యాంటీన్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేసి, కంటైనర్ తరహాలో ప్రత్యేక ఇనుప బాక్సులు తయారు చేయించారు. కానీ వాటిని ఇప్పటివరకూ వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అవి తుప్పుపట్టి పాడైపోతున్నాయి. అసలే కాకినాడ సముద్రతీరాన ఉండడంతో ఉప్పుగాలికి ఇనుము మరింత వేగంగా పాడైపోతోంది. నగరంలోని వెంకట్‌నగర్, సాంబమూర్తినగర్, వీర్‌కమల్, జగన్నాథపురం, పీఆర్ కళాశాల రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్లు ఏడాది కాలంగా ఇలాగే దర్శనమిస్తున్నాయి. వీటిని ఎప్పటికి వినియోగంలోకి తెస్తారో వేచి చూడాలి.
– ఫొటోలు : సతీష్‌కుమార్ పేపకాయల, సాక్షి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment