
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో వాంతులు కావడంతో అక్కడి వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద రీలే నిరాహార దీక్షలు చేస్తోన్న ఎంపీఇవోలతో చర్చించేందుకు బుధవారం ఉదయం ఆయన అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడుతూ.. సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.