గుంటూరు: రాజకీయ స్వప్రయోజనాలకు ఏపీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ మంత్రుల మధ్యనే పొంతన లేదని దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాలకు 14 వందల కోట్లు, 30 మంది ప్రాణాలను ఖర్చు పెట్టారని మండిపడ్డారు. మతిస్థిమితం లేని వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు.