బ్రిటిష్ హైకమిషనర్ డామినిక్ యాస్క్విత్ వైఎస్ఆర్సీసీ నేతలు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను భారత్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్: వైఎస్ఆర్సీసీ నేతలు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను బ్రిటిష్ హైకమిషనర్ డామినిక్ యాస్క్విత్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటిష్ హైకమిషనర్ బృందం బుధవారం వైఎస్సార్ సీపీ నేతలను కలిసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక పరిస్థితులు, భవిష్యత్లో వ్యాపార అవకాశాలు, కొత్త రాజధాని తదితర అంశాలపై బ్రిటిష్ బృందం చర్చించింది. ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను బ్రిటిష్ బృందానికి వివరించినట్టు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.