
సాక్షి, హైదరాబాద్: పార్టీ మేనిఫెస్టోలో చేసే వాగ్దాలన్నీ నిజాయితీగా చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. మేనిఫెస్టో కమిటితో బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాగ్దానాలు చేయడంలో తమకు ఏ పార్టీతోనూ పోటీలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటామని, పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పేర్కొన్నారు.
తమ పార్టీ మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కౌలురైతులకు న్యాయం చేసేలా తమపథకాలను రూపొందిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయన పలు సూచనలు చేశారు.