
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నందుకు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోపై దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే పలు దఫాలగా చర్చలు జరిపిన కమిటీ నేడు వైఎస్ జగన్‌మోన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది. లోటస్‌పాండ్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరైయ్యారు. ఇటీవల విజయవాడలో సమావేశమైన కమిటీ ఆ వివరాలను వైఎస్ జగన్‌కు వివరించనుంది. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై అధినేతతో వారు చర్చిస్తున్నారు.
మేనిఫెస్టో రూపకల్పనకు పార్టీ అధినేత ఇప్పటికే 31మందితో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఇటీవల జిల్లా స్థాయిలో పలు దఫాలుగా భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలను నేడు నేరుగా అధినేత వైఎస్ జగన్‌తో పంచుకోనున్నారు. కమిటీ ప్రతిపాదించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment