Manifesto Committee
-
Lok Sabha elections 2024: రాజ్‌నాథ్ సారథ్యంలో మేనిఫెస్టో కమిటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పనకు గాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బీజేపీ 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పార్టీ ఎన్నికల హామీలపై ఈ కమిటీ మేధో మథనం చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది. ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్ర శేఖర్ ఉన్నారు. బీజేపీ పాలిత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు డియో సాయి కూడా కమిటీలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే వంటి సీనియర్ నేతలకు కూడా బీజేపీ అధిష్టానం స్థానం కల్పించింది. క్రైస్తవులు, ముస్లింలకు ఆంటోనీ, మన్సూర్‌లు ప్రాతినిధ్యం వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ పేర్లు కమిటీలో లేవు. -
బీజేపీ మేనిఫెస్టో కమిటీ.. లిస్ట్ రిలీజ్ చేసిన జేపీ నడ్డా
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశంలోని అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన జాబితా నెట్టింట్లో వైరల్ అవుతోంది. బీజేపీ మూడవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ జాబితాలో అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, భూపేందర్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మోహన్ యాదవ్, వసుంధర రాజే, రవిశంకర్ ప్రసాద్‌లు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने लोकसभा चुनाव-2024 के लिए चुनाव घोषणा-पत्र समिति का गठन किया है। BJP National President Shri JP Nadda has announced Election Manifesto Committee for the Lok Sabha Elections - 2024. pic.twitter.com/KMrBpqkQQF — BJP (@BJP4India) March 30, 2024 -
CWC Meeting: సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిధ్దం చేసేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం జరుగుతున్న ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇచ్చి.. ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘భాగిదారీ న్యాయ్’(భాగస్వామ్య న్యాయం), ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. ఇక.. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మేనిఫెస్టో విడుదల మాత్రం తర్వాతే ఉటుందని పార్గీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సీఈసీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలు మార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మంగళవారం మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. 19న జరిగే భేటీలో తెలంగాణలోని మిగతా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకోగా, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ మంగళవారం ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. -
బీసీల ఓట్లకు ‘కులగణన’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ‘కులగణన’అస్త్రాన్ని ప్రయోగించనుంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కులగణన కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. కులగణనకు అనుకూలంగా ఇప్పటికే రాహుల్‌గాంధీ పలు సందర్భాల్లో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ గణన ఇప్పటికే ప్రారంభించడం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చిన విషయం విదితమే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చనున్నారన్న చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పడం ద్వారా బీసీవర్గాల ఓట్లు రాబట్టుకునే అంశంపై మంగళవారం టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా చర్చ జరగడం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ అధ్యయనం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఏఐసీసీ ప్రతినిధులు వెళుతున్నా రు. అందులో భాగంగానే జాతీయ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి మంగళవారం తెలంగాణకు వచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో తయారీకి టీపీసీసీ నియమించిన కమిటీతో ఆయన గాందీభవన్‌లో భేటీ అయ్యారు. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీ, కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్‌బిన్ హందాన్, లింగంయాదవ్, రవళిరెడ్డి, కోట నీలిమ, పోట్ల నాగేశ్వరరావు, సామా రామ్మోహన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, రియాజ్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో రాష్ట్ర నేతల ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉందని, క్షేత్ర స్థాయిలోని అంశాలనూ టచ్ చేశారని అభినందించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు విస్మరించే వర్గాలను కూడా మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. ట్రాన్స్జెండర్లు, ఇళ్లలో పనిచేసే వారి గురించి అధ్యయనం చేసి, వారి సమస్యలను కూడా ప్రస్తావించామని వివరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల ముందు ఒక మేనిఫెస్టో ఉంచగలిగామని చెప్పారు. ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని, ఈ హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఒకట్రెండు ఆలోచనలు ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయి – ప్రవీణ్ చక్రవర్తి సమావేశ అనంతరం దీపాదాస్ మున్షీ, ఇతర తెలంగాణ నేతలతో కలిసి ప్రవీణ్‌చక్రవర్తి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల ఆలోచనలను తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాలకు వెళ్లి ప్రజలు, నిపుణులు, పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో ముఖ్య సాధనమని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పాటు పౌర సంఘాలు, కొందరు ప్రజలతో సమావేశమయ్యామన్నారు. ఈ చర్చల్లో వచి్చన ఫీడ్‌బ్యాక్ నుంచి ఒకట్రెండు ఆలోచనలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. -
Lok Sabha elections 2024: మేనిఫెస్టో కోసం సూచనలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజల నుంచి పొందిన సలహాలు, సూచనలకు అనుగుణంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధంచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందుకోసం వారు పంపాల్సిన ఈమెయిల్, వెబ్సైట్లను బుధవారం ఆవిష్కరించింది. awaazbharatki.in వెబ్‌సైట్‌కు ఓటర్లు తమ సూచనలను పంపొచ్చు. awaazbharatki@inc.in. మెయిల్ ఐడీకి సైతం దేశ ప్రజలు తమ సలహాలు, సూచనలను పంపొచ్చు. కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఛైర్మన్‌గా ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఇలా సామాన్య ప్రజలు, వివిధ వర్గాలు, సమూహాలు, సంస్థల నుంచి సలహాలు సూచనలను కోరుతోంది. ‘ప్రజాభీష్టానికి అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుంది’’ అని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కన్వీనర్ టీఎస్ సింగ్ దేవ్ స్పష్టంచేశారు. -
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రాసేదెవరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలకు పట్టుమని నెలరోజులు కూడా లేదు. కానీ, తెలంగాణ బీజేపీ ఇంతవరకు తన మేనిఫెస్టోను ప్రకటించలేదు. దీంతో.. మేనిఫెస్టో లేకుండానే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందా? అనే అసహనం పార్టీ కేడర్ వ్యక్తం చేస్తోంది. ఈ అనిశ్చితికి కారణాల్ని పరిశీలిస్తే.. తెలంగాణ బీజేపీలో కమిటీలు ఒక్కోక్కటిగా ఖాళీ అవుతున్నాయి. కమిటీల కన్వీనర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం.. మిగిలిన వాళ్లు కమిటీలకు దూరంగా ఉంటుండడంతో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. అక్టోబర్ 5వ తేదీన బీజేపీ మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటించింది. పార్టీలో అసంతృప్తితో ఉన్నవాళ్లకే అందులో ప్రాధాన్యత కల్పించింది. కానీ, నెల తిరగకుండానే సీన్ మారిపోయింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ గూటికి చేరారు మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్‌గా నియమించిన గడ్డం వివేక్ వెంకటస్వామి.. రాజగోపాల్ బాటలోనే సొంత గూటికి చేరిపోయారు హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ అయిన ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ పదవిని కట్టబెట్టారు నిరసనలు, ఆందోళనల కమిటీకి(అజిటేషన్ కమిటీ) చైర్మన్ విజయశాంతి మొదటి నుంచే దూరంగా ఉంటున్నారు పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్ కుమార్, ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్ మిగిలిన కమిటీ చైర్మన్లు, కో కన్వీనర్లు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇలా వీళ్లెవరరూ తమ కమిటీల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు కనబడడం లేదు. చైర్మన్లే పార్టీని వీడడం, పట్టించుకోవడం మాత్రమే కాదు.. కో-కన్వీనర్లు సైతం కమిటీల విషయంలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టో కో కన్వీనర్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ పరిస్థితి దారుణంగా ఉంది. వికారాబాద్, ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గాలకు అభ్యర్థులు కరువయ్యారు. ఆ అభ్యర్థుల్ని వెతుక్కోలేని స్థితిలో కమిటీ ఉండగా.. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జితేందర్ రెడ్డి తన పాలమూరు నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇలా.. పనివిభజన చేసుకోలేకపోతున్న కమలనాథుల తీరుపై పార్టీ కేడర్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది. -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో రేసులో వెనుకబడకుండా ఎన్నికల నిర్వహణ, మేనిఫెస్టో రూపకల్పన కోసం నాలుగు కమిటీలు నియమించింది. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ, ప్రణాళిక, వ్యూహ కమిటీల నియామకానికి శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి మహమ్మద్ అక్బర్ నేతృత్వం వహిస్తే శివకుమార్ దహారియా ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. 9 మంది తో క్రమశిక్షణ కమిటీ, 18 మందితో ప్లానింగ్ కమిటీ ఏర్పాటయ్యాయి. -
వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్‌లో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న రెండు కమిటీ సభ్యులను ప్రకటించింది. కానీ ఈ కమిటీల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే పేరు లేకపోవడం విశేషం. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో సంకల్ప్ మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యుల ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా 25 మంది సభ్యుల సంకల్ప్ కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. గత కొన్నాళ్లుగా వీరంతా రాష్ట్రంలో బీజేపీ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్నారు. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అయితే మరో అడుగు ముందుకేసి 'నహీ సహేగా రాజస్థాన్' పేరిట పేపర్ లీకేజీ, రైతు సమస్యలపై నిరసన తెలుపుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎలా చూసినా గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు, ఆరోగ్య హక్కు బిల్లు వంటి ప్రజాహితమైన పథకాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతంగా నిలవనున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఐదు గ్యారెంటీలతో రూపందించిన పథకాలు అక్కడ ఆ పార్టీ అధికారంలో రావడానికి దోహద పడ్డాయి. రాజస్థాన్‌లో కూడా అదే పాచిక పారుతుందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండగా బీజేపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు.. -
నిరుద్యోగ నిర్మూలనే నినాదం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం ఎదుర్కొనే సమస్యల్లో నిరుద్యోగమే అతిపెద్ద సమస్యని, ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదే ప్రధాన ప్రచారాస్త్రం కానుందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు శ్యామ్ పిట్రోడా అన్నారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అది కూడా ఒకటని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ తీవ్ర ప్రభావం చూపనుంద న్నారు. ‘‘నిరుద్యోగం.. నిరుద్యోగం.. నిరుద్యోగం.. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. కానీ, ఇప్పటికీ మనం కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోయాం. ఇప్పుడు కొత్త ఉద్యోగాలను ఏవిధంగా సృష్టించాలన్నదే నిజమైన సవాలు. దేశంలో ఇంత భారీగా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం నోట్ల రద్దు, జీఎస్టీనే. ఇప్పుడు గనుక మనం నిరుద్యోగంపై దృష్టి పెట్టకపోతే ఇదో పెద్ద సమస్యగా తయారై పోతుంది’’ అని హెచ్చరించారు. కచ్చితంగా నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ రూపుమాపగలదా అని ప్రశ్నించగా అందుకు సమాధానమిస్తూ...‘‘ మీరే చూస్తారుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను. వివిధ రాజకీయపార్టీల భాగస్వామ్యంతో కూటమిని ఏర్పాటు చేసి త్వరలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి సరైన పోటీదారు అని అనుకుంటున్నారా అన్న ప్రశ్నగా...‘‘ఎన్నికల్లో పోటీని ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లుగా చూడొద్దని సమాధానమిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ప్రేమకు, విద్వేషానికి మధ్య, భావజాలాలకు మధ్య జరిగే పోటీ అని ఆయన స్పష్టం చేశారు. -
వాగ్దానాలు చేయడంలో ఏపార్టీతోనూ పోటీలేదు
-
మాకు ఏ పార్టీతోనూ పోటీలేదు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మేనిఫెస్టోలో చేసే వాగ్దాలన్నీ నిజాయితీగా చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. మేనిఫెస్టో కమిటితో బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాగ్దానాలు చేయడంలో తమకు ఏ పార్టీతోనూ పోటీలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటామని, పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కౌలురైతులకు న్యాయం చేసేలా తమపథకాలను రూపొందిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయన పలు సూచనలు చేశారు. -
నేడు వైఎస్ జగన్మోన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
-
వైఎస్ జగన్‌తో మేనిఫెస్టో కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నందుకు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే పలు దఫాలగా చర్చలు జరిపిన కమిటీ నేడు వైఎస్ జగన్మోన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది. లోటస్‌పాండ్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరైయ్యారు. ఇటీవల విజయవాడలో సమావేశమైన కమిటీ ఆ వివరాలను వైఎస్ జగన్‌కు వివరించనుంది. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై అధినేతతో వారు చర్చిస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనకు పార్టీ అధినేత ఇప్పటికే 31మందితో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఇటీవల జిల్లా స్థాయిలో పలు దఫాలుగా భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలను నేడు నేరుగా అధినేత వైఎస్ జగన్‌తో పంచుకోనున్నారు. కమిటీ ప్రతిపాదించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నారు. -
సంక్షేమం, అభివృద్ధే మా ఎన్నికల అజెండా!
సాక్షి, అమరావతి : ఎన్నికల మేనిఫెస్టో అంటే తప్పుడు వాగ్దానాలతో ఓట్లు దండుకోవడం కాదని.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఐదేళ్ల కాలంలో అమలుచేయడమే మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నూటికి నూరు శాతం అమలుచేసే వాగ్దానాలనే తమ పార్టీ చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26న విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుందనే అంశాలపై ఆ సమావేశంలో ప్రణాళికను విడుదల చేయనున్నట్టు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 31 మందితో కమిటీని ప్రకటించారని, తొలి సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనలో అనుసరించాల్సిన విధానాలు, చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్రజలకు ఏ విధమైన భరోసా కల్పించాలన్న దానిపై తమ అధినేత నిర్ధిష్టమైన సూచనలు ఇచ్చారని, వాటి ప్రాతిపదికగా మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. అలాగే, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను ఇందుకు స్ఫూర్తిగా తీసుకుంటామని ఉమ్మారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో వైఎస్సార్ సమతుల్యత పాటించారని వివరించారు. జలవనరుల అభివృద్ధి, వ్యవసాయం పండుగ, అన్ని వర్గాల సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా ఆయన చేపట్టిన కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపర్చేలా చూడాలని జగన్ సూచించారన్నారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన అంశాలు నూటికి నూరుపాళ్లు అమలుచేస్తామనే భరోసా ప్రజలకు ఇచ్చేలా ఉండాలని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే ప్రకటించిన ‘నవరత్నాలు’ అమలుచేస్తామని.. వీటితో వివిధ వర్గాల సమస్యలు పరిష్కారమవుతాయని ఉమ్మారెడ్డి చెప్పారు. అలాగే, ప్రజాసంకల్ప యాత్రలో జగన్ దృష్టికి వచ్చిన సమస్యల ఆధారంగా మేనిఫెస్టో రూపకల్పన ఉంటుందని చెబుతూ మేనిఫెస్టోలో పొందుపరిచే నవరత్నాలను వివరించారు. అవి.. - నిరుపేద విద్యార్థుల బతుకులు మార్చిన ఫీజు రీయిుంబర్స్‌మెంట్, వైఎస్సార్ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ, రైతుకు అండగా నిలబడే వైఎస్సార్ రైతు భరోసా అంశాలకు అందులో ప్రాధాన్యత ఇస్తామన్నారు. - అలాగే, జలయజ్ఞం పథకం కింద రైతు సంక్షేమం కోసం వనరులన్నీ ఒడిసిపట్టి సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని వివరించారు. - గతంలో ప్రభుత్వాలు అమలుచేయలేని మద్యం నిషేధాన్ని దశల వారీగా నిషేధించేలా చూస్తామని.. మహిళల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని దీనిని ఒక ప్రధాన అంశంగా తీసుకొస్తామన్నారు. - అమ్మ ఒడి కార్యక్రమం కింద పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ ఆర్థిక సాయాన్ని అందిస్తామని.. పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివిస్తామన్నారు. - అలాగే, నిరుపేద వృద్ధులకు ఒక భరోసా కల్పించేలా వైఎస్సార్ ఆసరా పథకం ఉంటుందన్నారు. - పేదవారికి పక్కా ఇళ్లు ఉండాలి.. పూరి గుడిసె కనిపించకూడదు అనే నినాదంతో పేదలందరికీ ఇళ్లు అనే ప్రధాన అంశం తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టబోతున్నామని చెప్పారు. - ఎప్పుడో ఇచ్చిన పెన్షన్లు కాకుండా, ఆ మొత్తాన్ని పెంచడం, పెన్షన్ల అర్హత వయస్సును తగ్గించడం, చేతి వృత్తుల వారికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపడతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇచ్చే పథకం కూడా ఇందులో ఉంటుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. ప్రతి రూపాయికీ లెక్క చెబుతాం ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించడంతోపాటు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే ప్రతి పైసానూ దుబారా చేయకుండా.. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఖర్చుచేస్తామని ఆయన వివరించారు. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా తీసుకువెళ్తామని ఉమ్మారెడ్డి హామీ ఇచ్చారు. అలాగే, మేనిఫెస్టో కమిటీ ఒకటి ప్రభుత్వంలోనూ ఏర్పాటుచేస్తామన్నారు. పరిపాలన ప్రజల కోసమేగానీ నాయకుల కోసం కాదన్నారు. చంద్రబాబు పాలనలో మాదిరిగా జన్మభూమి కమిటీలు వేసి ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయకూడదన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కమిటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు 31 మంది సభ్యులతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కమిటీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, రాజన్నదొర, అంజద్ బాషా, పుష్పవాణి, ఆదిమూలపు సురేష్, దువ్వూరి కృష్ణ, సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, ఇక్బాల్, వెలంపల్లి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, నాగిరెడ్డి, సంజీవ్‌కుమార్, రంగయ్య, కిష్టప్ప, సుచరిత, నందిగం సురేష్, జంగా కృష్ణమూర్తి, తమ్మినేని సీతారాం, సజ్జల రామకృష్ణారెడ్డి మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా కొనసాగుతారని పార్టీ పేర్కొంది. ఈ కమిటీ 26వ తేదీన విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏపీ బీజేపీ మేనిపెస్టో కమిటీ ఇదే..!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి చేపట్టనున్న బస్సు యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించడానికి కన్నా లక్ష్మీనారాయణ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చైర్‌పర్సన్‌గా, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కన్వీనర్‌గా ఉన్నారు. వీరితోపాటు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీలోని సభ్యులు.. 1. డి. పురందేశ్వరి(చైర్పర్సన్) 2. ఐవైఆర్ కృష్ణారావు(కన్వీనర్) 3. పి. విజయ బాబు 4. పీవీఎన్ మాధవ్ 5. దాసరి శ్రీనివాసులు 6. షేక్ మస్తాన్ 7. పాక సత్యనారాయణ 8. కె. కపిలేశ్వరయ్య 9. పి సన్యాసి రాజు 10. సుదీష్ రాంబోట్ల 11. డీఏఆర్ సుబ్రహ్మణ్యం -
మధ్యాహ్నం టీఆర్ఎస్ మేనిఫేస్టో కమిటీ సమావేశం
-
రేపు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం
-
పేదల సమస్యలకే పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురైన పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పనకు సీపీఎం కసరత్తు చేస్తోంది. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ రెండో సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగింది. నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన అభివృద్ధి జరగాలని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు అందడానికి తీసుకోవాల్సిన చర్యలపై మేనిఫెస్టోలో నిర్దిష్టంగా చెప్పడానికి కసరత్తు జరిగింది. రైతులు, భూమి లేని కూలీలు, పేదలకు ఇళ్లు వంటివి సమకూర్చడానికి ఉన్న మార్గాలను సీపీఎం మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం అందించడంతో పాటు భూమి లేని నిరుపేదలకు భూమిని అందించడానికి ఉన్న అవకాశాలను కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొననున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాకు రెండురోజుల్లో తుదిరూపు ఇస్తామని సీపీఎం నేతలు వెల్లడించారు. -
స్ర్కీనింగ్ కమిటీ ‘చేతి’లో అభ్యర్థుల భవితవ్యం
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా, ఇప్పటివరకు 1076 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు నుంచి అభ్యర్థుల స్క్రూటినీ మొదలు పెడతామని తెలిపాయి. ప్రతి నియోజక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనున్నట్టు ముఖ్య నేతలు చెప్పారు. అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, ప్రజాబలం పరిగణలోకి తీసుకుని.. సర్వేల ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాల జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా టీడీపీ, వామపక్ష పార్టీలతో దోసీ కట్టిన కాంగ్రెస్.. ఎన్నికల పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు అనంతరమే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది. ప్రజాభిప్రాయాలతోనే మేనిఫెస్టో గాంధీభవన్‌లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ప్రజల అభిప్రాయాలే ప్రాతిపదికగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీకి అనుబంధంగా మరో 5 కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ 5 కమిటీలు రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి.. ఆయా సమావేశాల్లో వివిధ సంఘాల నుంచి వినతులను స్వీకరిస్తాయని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టే ప్రతి అంశంపై వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచతామని వెల్లడించారు. ఆర్థికపరంగా ఆమోదయోగ్యమైనవి, న్యాయపరంగా చిక్కులు లేనివి, ప్రజా బాహుళ్యం మెచ్చిన అంశాలు మేనిఫెస్టోలో చేర్చుతామని అన్నారు. -
కాంగ్రెస్ కోర్ కమిటీ అధిపతిగా ఆంటోనీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలకు చైర్మన్లు, కన్వీనర్లను శనివారం ప్రకటించారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కోర్ కమిటీకి, మరో సీనియర్ నాయకుడు పి.చిదంబరం మేనిఫెస్టో కమిటీకి, ఆనంద్ శర్మ ప్రచార కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు కోర్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఎంపీ, పార్టీ పరిశోధనా విభాగం అధిపతి రాజీవ్ గౌడ మేనిఫెస్టో కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పవన్ ఖేరా ప్రచార కమిటీకి కన్వీనర్‌గా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఈ కమిటీల అధిపతులతో సమావేశమై రాబోయే ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. -
ప్రజలు ఆమోదించేలా టీఆర్ఎస్ మేనిఫెస్టో
-
చేసింది చెబుదాం.. చేసేది చెబుదాం!
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సంపూర్ణ సాకారం.. అభివృద్ధి కొనసాగింపు ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో రూపొందనుంది. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్న టీఆర్ఎస్.. తమ మేనిఫెస్టో రూపకల్పనలోనూ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించనుంది. నాలుగేళ్ల మూడు నెలల పాలనను వివరిస్తూనే, మళ్లీ అధికారంలోకి వస్తే ఏ వర్గాలకు ఏం చేయనున్నామో వివరించేలా మేనిఫెస్టో సిద్ధమవుతోంది. కొత్తవి తక్కువే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించడమే మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉండనుంది. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి పథకాలపై వివరించే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ల మొత్తం పెంపు, నిరుద్యోగ భృతి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగ భృతి చెల్లించే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చే విషయంపై పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మేనిఫెస్టో రూపకల్పన కోసం టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలో 15 మంది పార్టీ నేతలతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలి భేటీ శనివారం జరగనుంది. ఒకే భేటీలో ముసాయిదా మేనిఫెస్టోను పూర్తి చేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. -
బీజేపీ x విపక్ష కూటమి
లండన్: భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్ని బీజేపీ, ప్రతిపక్షాల ఐక్య కూటమి మధ్య పోరుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం రాత్రి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు. బీజేపీని ఓడించడం, ప్రభుత్వ సంస్థల్లో ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష కూటమి మధ్య ముఖాముఖి పోరు తథ్యం’ అని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని చెప్పారు. సిక్కు అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర లేదు: ‘1984లో సిక్కులపై దాడులను 100శాతం ఖండిస్తున్నా. హింసలో భాగస్తులైన వారికి శిక్ష పడడాన్ని సమర్ధిస్తా. హింసా బాధితుడిగా అది ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకం. నేను ప్రేమించినవారు హత్యకు గురవడాన్ని దగ్గరనుండి చూశా. అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర ఉందన్న మీ వాదనతో నేను ఏకీభవించను’ అని అన్నారు. వారసత్వ రాజకీయాలపై స్పందిస్తూ.. ‘మా కుటుంబం రాజకీయాల్లో ఉండడం నా రాజకీయ జీవితానికి దోహదపడినా.. ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎన్నికల్లో నేను పోరాడుతున్నా’ అని సమాధానమిచ్చారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ కీలక కమిటీలు న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఈ దిశగా జోరును మరింత పెంచేందుకు మూడు కీలక కమిటీలను శనివారం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం అంశాలపై పనిచేస్తాయి. ఈ రెండు బృందాలతోపాటు కీలకమైన కోర్‌టీమ్‌కు కూడా రాహుల్ ఆమోదముద్ర పడింది. పార్టీలోని సీనియర్, పాతతరం నేతలకు కోర్ టీమ్‌లో చోటు కల్పించారు. ఈ కోర్ బృందంలో ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, పి. చిదంబరం, అశోక్ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు. ఈ బృందం సోనియాగాంధీ నేతృత్వంలో పనిచేస్తుంది. మేనిఫెస్టో కమిటీలో పి. చిదంబరం, హరియాణా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, కుమారీ సెల్జా, రణ్‌దీప్ సుర్జేవాలాతోపాటుగా 19 సభ్యులున్నారు. 13 మంది సభ్యుల ఎన్నికల పబ్లిసిటీ కమిటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో రణ్‌దీప్ సుర్జేవాలా, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, రాజీవ్ శుక్లా, భక్త చరణ్‌దాస్, ప్రవీణ్ చక్రవర్తి, మిలింద్ దేవ్రా, కుమార్ కేట్కర్, పవన్ ఖేరా, వీడీ సతీశన్, జైవీర్ షెర్గిల్, ప్రమోద్ తివారీ, పార్టీ సోషల్ మీడియా హెడ్ స్పందనలకు చోటు దక్కింది. ఈ కమిటీలను అశోక్ గెహ్లాట్ శనివారం ఢిల్లీలో ప్రకటించారు. -
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి
ప్రధాన కార్యదర్శిగా రేవూరి టీడీపీ కమిటీలో జిల్లా నేతలకు చోటు మేనిఫెస్టో కమిటీలో ముగ్గురు సాక్షి, హన్మకొండ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు కమిటీల్లో జిల్లాకు చెందిన ఐదుగురికి స్థానం లభించింది. తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి దయాకర్‌రావును నియమించారు. ఇదే కమిటీకి ప్రధాన కార్యదర్శిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. తెలుగుదేశం తెలంగాణ మేనిఫెస్టో కమిటీలో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో సోమవారం ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరి.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని ఆశించిన టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నిరాశే ఎదురైంది. కొత్త రాష్ట్రంలో పార్టీపై పట్టు కోసం ఎర్రబెల్లి చేసిన ప్రయత్నాలకు చంద్రబాబునాయుడు గండికొట్టారు. ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపుచ్చారు. తెలంగాణ ఎన్నికల కమిటీ కార్యనిర్వాహక అధ్యక్ష (వర్కింగ్ ప్రెసిడెంట్) పదవిని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కట్టబెట్టారు. రాష్ట్ర స్థాయిలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పదవి ఇచ్చినా... ఇదే స్థాయి పదవి ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి చంద్రబాబునాయుడు ఇచ్చారు.