ఎన్నికలు సమీపిస్తున్నందుకు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోపై దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే పలు దఫాలగా చర్చలు జరిపిన కమిటీ నేడు వైఎస్ జగన్‌మోన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది. లోటస్‌పాండ్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరైయ్యారు. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై అధినేతతో వారు చర్చిస్తున్నారు.