సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజల నుంచి పొందిన సలహాలు, సూచనలకు అనుగుణంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధంచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందుకోసం వారు పంపాల్సిన ఈమెయిల్, వెబ్‌సైట్‌లను బుధవారం ఆవిష్కరించింది. awaazbharatki.in వెబ్‌సైట్‌కు ఓటర్లు తమ సూచనలను పంపొచ్చు.
awaazbharatki@inc.in. మెయిల్ ఐడీకి సైతం దేశ ప్రజలు తమ సలహాలు, సూచనలను పంపొచ్చు. కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఛైర్మన్‌గా ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఇలా సామాన్య ప్రజలు, వివిధ వర్గాలు, సమూహాలు, సంస్థల నుంచి సలహాలు సూచనలను కోరుతోంది. ‘ప్రజాభీష్టానికి అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుంది’’ అని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కన్వీనర్ టీఎస్ సింగ్ దేవ్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment