27 మందితో ఏర్పాటు చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పనకు గాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బీజేపీ 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పార్టీ ఎన్నికల హామీలపై ఈ కమిటీ మేధో మథనం చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది.
ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్ర శేఖర్ ఉన్నారు. బీజేపీ పాలిత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు డియో సాయి కూడా కమిటీలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే వంటి సీనియర్ నేతలకు కూడా బీజేపీ అధిష్టానం స్థానం కల్పించింది. క్రైస్తవులు, ముస్లింలకు ఆంటోనీ, మన్సూర్‌లు ప్రాతినిధ్యం వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ పేర్లు కమిటీలో లేవు.
Comments
Please login to add a commentAdd a comment