ఇట్‌ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్‌ఖోరిలో శనివారం రాజ్‌నాథ్ ప్రారంభించారు.
హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్‌బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment