ఐఎంఎఫ్‌కు మించి ఆదుకునేవాళ్లం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ మనతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే అది ఐఎంఎఫ్‌ను కోరుతున్న సాయానికి మించిన బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. కశీ్మర్‌లోని బందిపొర జిల్లా గురెజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘జమ్మూకశీ్మర్ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2014–15లో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు రూ.90 వేల కోట్లకు చేరింది.
ఇది ఐఎంఎఫ్‌ను పాక్ కోరుతున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే ఎంతో ఎక్కువ’’ అన్నారు. ‘‘పాక్ మిత్రులారా! ఇరుగుపొరుగు దేశాలైన మన మధ్య విభేదాలెందుకు? మన మధ్య సత్సంబంధాలుంటే మీకు ఐఎంఎఫ్ కంటే ఎక్కువే ఇచ్చి ఉండే వాళ్లం’’ అని మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ‘‘అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న అప్పులను పాక్ దురి్వనియోగం చేస్తోంది. ఉగ్రవాద ఫ్యాక్టరీని నడపటానికి వాడుతోంది. వారిని మనపైకి పంపుతోంది. అందుకే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఒంటరైంది. మిత్ర దేశాలు సైతం దాన్ని దూరంగా పెట్టాయి’’ అని విమర్శించారు.
– శ్రీనగర్
Comments
Please login to add a commentAdd a comment