Jharkhand Chief Minister
-
Amit Shah: 23న హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలే
దుమ్రీ: జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అండ్ కంపెనీకి ఈ నెల 23న బీజేపీ వీడ్కోలు పలకడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జార్ఖండ్‌లోకి అక్రమ చొరబాట్లను హేమంత్ ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు. చొరబాటుదార్లు ఇక్కడి గిరిజనుల బిడ్డలను వివాహాలు చేసుకున్నారని, వారి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి చొరబాటుదార్లను బయటకు తరిమికొడతామని, భూములను వెనక్కి తీసుకొని గిరిజనులకు అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఒక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గురువారం జార్ఖండ్‌లోని దుమ్రీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దోచుకుందని మండిపడ్డారు. జనం సొమ్మును కొట్టగొట్టిన హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలు తప్పదని స్పష్టంచేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో హేమంత్ సోరెన్ జట్టుకట్టారని విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు. జమ్మూకశీ్మర్‌లో ఇండియాలో అంతర్భాగమని, ఆరి్టకల్ 370ని మళ్లీ తీసుకొచ్చేసత్తా ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అప్పగించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, రాహుల్ బాబా నా లుగో తరం కూడా ఆ పని చేయలేదని అన్నారు. చట్టంలో సవరణ తీసుకొస్తాం రాహుల్ గాందీని రాజకీయాల్లో ప్రవేశపెట్టేందుకు ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఇప్పటిదాకా 20 సార్లు ప్రయతి్నంచారని అమిత్ షా చెప్పారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాహుల్ గాంధీ విమానం ల్యాండ్ కాలేదని అన్నారు. 21వ ప్రయత్నంలో జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విమానం కుప్పకూలడం తథ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో వక్ఫ్ బోర్డు హిందూ ప్రాచీన దేవాలయాల భూములను ఆక్రమించిందని ఆరోపించారు. వ్యవసాయ భూములను కూడా కబ్జా చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి కబ్జాలను అడ్డుకోవడానికి చట్టంలో సవరణ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనుంది. -
హేమంత్ అవినీతి సీఎం: రాజ్‌నాథ్
ఇట్ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్ఖోరిలో శనివారం రాజ్‌నాథ్ ప్రారంభించారు. హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్‌బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు. -
సోనియాతో హేమంత్ సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇటీవలే సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ తన భార్య కల్పనతో పాటు 10, జనపథ్ నివాసంలో సోనియాను కలుసుకున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని అనంతరం మీడియాకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సోనియా గాంధీతో సమావేశమవలేదని, జైలు నుంచి విడుదలైనందున ఆమెతో మాట్లాడేందుకు వచ్చినట్లు వివరించారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారా అని అడగ్గా..రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. భూకుంభకోణం మనీలాండరింగ్ కేసులో జనవరి 31వ తేదీన అరెస్టయిన హేమంత్ అంతకు కొద్ది గంటల ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. జైలులో 5 నెలలపాటు ఉన్న ఆయన బెయిల్ రావడంతో జూలై 4న విడుదలయ్యారు. అనంతరం మరోసారి సీఎం పదవి చేపట్టడం తెల్సిందే. -
సోరెన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
రాంచీ: జార్ఖండ్‌లో భూకుంభకోణం, సంబంధిత మనీ లాండరింగ్ కేసులో ఆఫీసుకొచ్చి విచారణకు హాజరుకావాలని ఏడు సార్లు సమన్లు ఇచ్చినా బేఖాతరు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చివరకు ఆయన ఇంటికే వచ్చి విచారించారు. ఈడీ అధికారులు వస్తున్నారన్న వార్తతో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు రావడంతో ఈడీ అధికారుల రక్షణ కోసం భద్రతాబలగాలు భారీ ఎత్తున మొహరించారు. దీంతో ఇంటి పరిసరాలు ఖాకీవనాన్ని తలపించాయి. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీలోని ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు సోరెన్‌పై సుదీర్ఘంగా ఏడు గంటలకుపైగా ప్రశ్నలు సంధించారు. కేసుపై పలు వివరాలు అడిగారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రి జోబా మాంఝీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, రాజ్యసభ ఎంపీ మహువా మాజీ, కొందరు పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లోనే ఉన్నారు. రాష్ట్ర డీజీపీ అజయ్‌సింగ్ సైతం అక్కడే ఉన్నారు. జేఎంఎం గిరిజన కార్యకర్తలు కొందరు విల్లు, బాణాలతో సోరెన్ ఇంటిపరిసరాల్లో గుమిగూడి ఈడీ వ్యతిరేక నినాదాలిచ్చారు. ఈడీ వ్యతిరేక ర్యాలీలు జరక్కుండా రాంచీ సబ్ డివిజనల్ మేజి్రస్టేట్ ఉత్కర్‡్ష ఇంటి పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. ఈడీ చర్యపై జేఎంఎం కార్యకర్తలు, గిరిజన సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగారు. ఇప్పటికే 14 అరెస్ట్‌లు భూ హక్కులను మాఫియా అక్రమంగా చేతులు మార్చి కోట్లు కొల్లగొట్టారని ఈడీ గతంలో ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛావీ రంజన్ సహా 14 మందిని ఈడీ అరెస్ట్‌చేసింది. ఈ కేసులో బాధితుడిగా నాటకం ఆడుతూ సీఎం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎంను కేసులోకి లాగి ప్రభుత్వాన్ని కూలదోయాలని మోదీ సర్కార్ కుట్ర పన్నిందని జేఎంఎం ఆరోపిస్తోంది. నా పై కుట్ర: సోరెన్ ఏడు గంటలపాటు ఈడీ విచారణ ముగిశాక ఇంటిబయట కార్యకర్తలనుద్దేశించి సోరెన్ మాట్లాడారు. ‘‘ నా పై కుట్ర పన్నారు. కుట్రను త్వరలోనే బయటపెడతా. మనం ఎవరికీ భయపడేది లేదు. మీ విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేందుకు బుల్లెట్లనైనా ఎదుర్కొంటా. నాకు మద్దతుగా ఇక్కడికొచి్చన మీకందరికీ ధన్యవాదాలు’’ అని సోరెన్ ప్రసంగించారు. -
సోరెన్‌తో నితీశ్ భేటీ
రాంచీ: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేయడంపైనే ప్రధానంగా చర్చించామని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్‌తో భేటీ తర్వాత జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రకటించారు. బుధవారం రాంచీకి చేరుకున్న నితీశ్.. ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌తోపాటు సోరెన్‌తో చర్చలు జరిపారు. ‘ బీజేపీని ఓడించడం, విపక్షాలను ఏకతాటి మీదకు తేవడంపైనే చర్చించాం. ఈ సంప్రదింపుల ఫలితం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చరిత్రను తిరగరాయాలన్న బీజేపీ సర్కార్ కుతంత్రాలను మేం తిప్పికొడతాం. హిందూ–ముస్లిం ఐక్యతను మళ్లీ పునఃప్రతిష్టిస్తాం ’ అని నితీశ్ మీడియాతో అన్నారు. ఎన్డీఏయేతర పార్టీలను ఏకంచేసే క్రమంలో విపక్ష పార్టీల అగ్రనేతలతో వరసగా భేటీలను నితీశ్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. మంగళవారం ఒడిశాకు వెళ్లిన నితీశ్ అక్కడ బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో గంటకుపైగా మంతనాలు జరిపారు. ఇటీవల ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లనూ కలిశారు. ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేనూ నితీశ్ కలిశారు. అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆప్ అధినేత కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతోనూ భేటీ అయ్యారు. -
ఈడీ ముందుకు హేమంత్ సోరెన్
రాంచీ: అక్రమ గనుల తవ్వకం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. రాంచీ కార్యాలయంలో ఆయనను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించింది. ఈడీ కేసులో ప్రశ్నించేందుకు గతంలో ఆయనకు పలుమార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేయగా వ్యక్తిగత, అధికారిక కారణాలు చూపుతూ ఇన్నాళ్లూ గైర్హాజరైన విషయం విదితమే. గురువారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన సోరెన్.. ఈడీకి ఒక లేఖ రాశారు. నిజాలేవిటో నిర్ధారించుకోకుండా ‘సంచలన ప్రకటనలు’ చేయొద్దని లేఖలో సూచించారు. ‘ మొత్తం జార్ఖండ్‌లో గత రెండేళ్లలో గనులు, ఖనిజాల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరేమో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో అవినీతి చేయాలంటే ఒక్క సాహెబ్గంజ్లోనే 8 కోట్ల మెట్రిక్ టన్నుల రాళ్లను తవ్వాలి. చట్టబద్ధంగా తవ్విన దానికంటే ఇది ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ. ఇది సాధ్యమా?’ అంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. ‘జేఎంఎం పార్టీ నుంచి నేను గెంటేసిన రవి కేజ్రీవాల్ బీజేపీ తరఫున మాట్లాడుతూ నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. ఈ కేసును ఎలాంటి రహస్య అజెండా లేకుండా దర్యాప్తుచేయండి’ అని ఈడీని కోరారు. తనపై బీజేపీ కుట్ర పన్నుతోందని అంతకుముందు మీడియాతో అన్నారు. దర్యాప్తును ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభావితం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. -
‘ఈ నాన్చుడెందుకు.. డైరెక్ట్‌గా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్
రాంచీ: ‘నేను తప్పు చేసినట్లయితే, ఈ ప్రశ్నించటాలేంటి? నేరుగా వచ్చి అరెస్ట్ చేయండి.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. బొగ్గు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని వేధింపులకు గురిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈడీ సమన్లు జారీ చేసినట్లు ఆరోపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నాకు ఛత్తీస్‌గఢ్‌లో కార్యక్రమంలో ఉన్న క్రమంలో ఈరోజు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. నేను పెద్ద నేరం చేసినట్లు అయితే, రండి, నన్ను అరెస్ట్ చేయండి. ఈ ప్రశ్నించటాలేందుకు?. ఈడీ ఆఫీస్ వద్ద భద్రత పెంచారు. జార్ఖండ్ ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారు?. అధికార బీజేపీని వ్యతరేకిస్తున్న వారి గొంతు నొక్కేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయటమే ఇది. ఈ కుట్రకు తగిన సమాధానం లభిస్తుంది.’అని పేర్కొన్నారు సీఎం హేమంత్ సోరెన్. రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకు ముందు బీజేపీ పేరు చెప్పకుండానే ట్విటర్ వేదికగా పరోక్ష విమర్శలు చేశారు సీఎం. ‘నన్ను వేధించేందుకు జరుగుతున్న ఈ దాడుల వెనుక అసలు కుట్ర ట్రైబల్స్, వెనకబడినవారు, మైనారిటీల హక్కులను కాలరాసేందుకే. నాకు రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు ఉన్నంత వరకు వారి కుట్రల్లోనే ఏ ఒక్కటి ఫలించదు.’అని పేర్కొన్నారు. బొగ్గు మైనింగ్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రా సహా మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. జులైలో దాడులు నిర్వహించి మిశ్రా బ్యాంకు ఖాతాల్లోని రూ.11.88 కోట్లు సీజ్ చేసింది. అలాగే ఆయన ఇంట్లో రూ.5.34 కోట్ల అక్రమ నగదు లభించినట్లు వెల్లడించింది. #WATCH | I've been summoned by ED today when I already have a program in Chhattisgarh today. If I've committed a crime that big, come & arrest me. Why the questioning?... Security near ED office has increased. Why, are you scared of Jharkhandis?, says Jharkhand CM Hemant Soren pic.twitter.com/41cR92FCHM — ANI (@ANI) November 3, 2022 ఇదీ చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం -
రెండో ఆప్షన్ కోసం అన్వేషిస్తున్నా: గవర్నర్ వ్యాఖ్య
రాయ్‌పూర్: లాభదాయక పదవి కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లపై ఆ రాష్ట్ర గవర్నర్ స్పందించారు. ‘ నేనేమీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేవాడిని కాదు. ఈసీ సిఫార్సు తర్వాత తుది నిర్ణయంపై తేల్చుకునేందుకు రెండో ఆప్షన్‌కు వెళ్తున్నా. నిపుణుల సలహాలు తీసుకుంటున్నా’ అని గవర్నర్ రమేశ్ స్పష్టంచేశారు. గనుల తవ్వకం లీజును సీఎం సోరెన్ తనకు తానే మంజూరుచేసుకున్నాడనే కేసు నమోదైన విషయం తెల్సిందే. దీంతో లాభదాయక పదవి కోణంలో సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడా ? కాదా? అనేది స్పష్టంచేస్తూ ఈసీ నుంచి గవర్నర్‌కు∙లేఖ వచ్చింది. అందులో ఏముందో తెలీదు. అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసిందని వార్తలొచ్చాయి. ‘నిపుణుల సలహా తర్వాత జార్ఖండ్‌లో అణుబాంబ్ పేలొచ్చు’ అని గవర్నర్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
హేమంత్ కాకపోతే మరో ‘సోరెన్’.. సీఎం పదవిలోకి మరొకరికి నో ఛాన్స్?
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు? అనే చర్చ మొదలైంది. అయితే.. మరో సోరెన్ ముఖ్యమంత్రి అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. సోరెన్ కుటుంబం నుంచి సీఎం పీఠం మరొకరికి వెళ్లదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టే అర్హత కలిగిన మరో సోరెన్ ఎవరు? ఓసారి పరిశీలిద్దాం. సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే.. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. దీంతో ముఖ్యమంత్రి పదవి ఎవరికనే అంశం కీలకంగా మారింది. సోరెన్స్ కుటుంబం సైతం ఇతర ప్రాంతీయ పార్టీలకు అతీతం కాదు. రాజకీయ సంక్షోభం తెలత్తినప్పుడు అదే కుటుంబం నుంచి మరొకరు ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబ నేపథ్యం.. బిహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటు కోసం జార్ఖండ్ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు శిబు సోరెన్. ఆయన రెండో కుమారుడే హేమంత్ సోరెన్. సీనియర్ సోరెన్.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీఎంకు రాజకీయ గురువుగా ముందుండి దారిచూపుతున్నారు. అయితే.. జేఎంఎం స్థాపించిన తర్వాత శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ ఆయన వారసుడిగా ఎదిగారు. మరోవైపు.. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న హేమంత్ సోరెన్ దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే.. 2009లో దుర్గా సోరెన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. ఆయన తర్వాత శిబు సోరెన్ వారసురాలిగా కుమార్తె అంజలీ పేరు తెరపైకి వచ్చినా ఆమె అంతగా ఆసక్తి చూపలేదు. ఒడిశాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయారు. దీంతో హేమంత్ సోరెన్ కీలకంగా మారారు. ఆయనే.. పార్టీని చేపట్టారు. 38 ఏళ్లకే 2013లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ, ఏడాది కాలంలోనే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చారు సోరెన్. తాజాగా వచ్చిన ఆరోపణలతో మరోమారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జేఎంఎం-కాంగ్రెస్ కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సోరెన్ కుటుంబంలోని కొన్ని పేర్లు పరిశీలిద్దాం. ఇదీ చదవండి: రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్ ► శిబు సోరెన్: 78 ఏళ్ల శిబు సోరెన్.. ప్రస్తుతం జేఎంఎం అధ్యక్షుడిగా, ఎంపీగా క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టుల్లో చాలా కేసులు ఉండటం సహా.. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం వల్ల సీఎం పదవి చేపట్టేందుకు విముఖత చూపించే అవకాశాలు ఉన్నాయి. ► రూపి సోరెన్: పార్టీ అధినేత శిబు సోరెన్ భార్య రూపి సోరెన్. ఆమెకు రాజకీయాల్లో అంతగా అనుభవం లేనప్పటికీ ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తితే ఆమె పేరు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. ► కల్పనా సోరెన్: హేమంత్ సోరెన్ తన భార్య కల్పనా సోరెన్‌ను ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనిశ్చితి నెలకొంటే ఆమెను తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, ఆమె ఒడిశాకు చెందిన వ్యక్తి కావటం అడ్డంకిగా మారనుంది. ► సీతా సోరెన్: దుర్గా సోరెన్ మరణం తర్వాత శిబు సోరెన్.. తన కోడలు సీతా సోరెన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జామా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, ఆమె సైతం ఒడిశా నుంచి రావటం అడ్డంకిగానే మారనుంది. ► బసంత్ సోరెన్: శిబు సోరెన్ చిన్న కుమారుడు, హేమంత్ సోరెన్ తమ్ముడు, దుమ్కా ఎమ్మెల్యే బసంత్ సోరెన్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఆయన కూడా హేమంత్ లాగే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. అనర్హత వేటు ఎదుర్కునే అవకాశం ఉంది. ► అంజలీ సోరెన్: శిబు సోరెన్ కుమార్తె అంజలీ సోరెన్ వివాహం తర్వాత ఒడిశా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో సీఎం పదవి రేసు నుంచి ఆమె లేనట్లే. మరోవైపు.. జేఎంఎం, హేమంత్ సోరెన్.. కుటుంబేతర వ్యక్తివైపు చూస్తే.. అప్పుడు పార్టీ సీనియర్ లీడర్, సెరైకేలా ఎమ్మెల్యే చంపాయ్ సోరెన్ ముందంజలో ఉంటారు. ఇంటిపేరు ఒకే విధంగా ఉండటమే కాకుండా.. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్ -
జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం
రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం గురువారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో... టైర్ పేలింది. అయితే సీఎం రఘుబర్ దాస్తోపాటు 154 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. గోఎయిర్వేస్ విమానం ఢిల్లీ నుంచి రాంచీ విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. -
జార్ఖండ్ సీఎంగా రఘువర్‌దాస్ ప్రమాణం
మంత్రులుగా మరో నలుగురు కూడా.. పొగమంచు వల్ల హాజరుకాలేకపోయిన ప్రధాని రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రఘువర్‌దాస్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని బిర్సాముండా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రఘువర్దాస్తో పాటు మరో నలుగురితో మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణం చేయించారు. వీరిలో బీజేపీ తరఫున నీల్కాంత్సింగ్ ముండా, చంద్రేశ్వర్ప్రసాద్ సింగ్, లూయిస్ మరాండీ, మిత్రపక్షం అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్‌జేయూ) నుంచి చంద్రప్రకాశ్ చౌదరి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తదితరులు రావాల్సి ఉన్నా... ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలను నిలిపివేయడంతో హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రఘువర్దాస్కు శుభాకాంక్షలు తెలిపారు. అవినీతిరహిత అభివృద్ధి సాధిస్తాం రాంచీ: అవినీతికి తావులేని అభివృద్ధి పనులను చేపడతామని, ప్రభుత్వ సేవలను నిర్ధిష్టమైన కాలపరిమితితో అందిస్తామని జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్ చెప్పారు. జవాబుదారీతనంతో కూడిన బాధ్యతాయుతమైన అధికార యంత్రాంగానికి ఈ అభివృద్ధి పనులను అప్పగిస్తామన్నారు. ఆదివారం ప్రమాణస్వీకారం తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జార్ఖండ్‌కు ఇప్పటి వరకూ అంతమంచి పేరు లేదని, దీనిని తొలగించాలంటే అందరి సహకారం అవసరమని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీడియా కూడా దీనికి సహకరించాలని కోరారు. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న కొత్త సీఎం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన కొద్దిసేపటికే రఘువర్‌దాస్ స్వచ్ఛభారత్ అభియాన్‌లో పాలుపంచుకున్నారు. గిరిజనులు ఎక్కువగా నివసించే కరంతోలి ప్రాంతంలోని రోడ్లను ఊడ్చారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రివర్గ సభ్యుడు సీపీ సింగ్‌తో కలసి ఆయన నేరుగా కరంతోలి ప్రాంతానికి చేరుకున్నారు. సంక్షేమ పథకాల కింద వృద్ధులకు పింఛన్లు, ఇతర సదుపాయాలు అందడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఈ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించానని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశంలో వృద్ధులందరికీ పింఛన్లు, ఇతర సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.