రెండో ఆప్షన్‌ కోసం అన్వేషిస్తున్నా: గవర్నర్‌ వ్యాఖ్య | Jharkhand governor says he has sought second opinion in office-of-profit case | Sakshi
Sakshi News home page

రెండో ఆప్షన్‌ కోసం అన్వేషిస్తున్నా: గవర్నర్‌ వ్యాఖ్య

Published Fri, Oct 28 2022 5:43 AM | Last Updated on Fri, Oct 28 2022 5:43 AM

Jharkhand governor says he has sought second opinion in office-of-profit case - Sakshi

రాయ్‌పూర్‌: లాభదాయక పదవి కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లపై ఆ రాష్ట్ర గవర్నర్‌ స్పందించారు. ‘ నేనేమీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేవాడిని కాదు. ఈసీ సిఫార్సు తర్వాత తుది నిర్ణయంపై తేల్చుకునేందుకు రెండో ఆప్షన్‌కు వెళ్తున్నా. నిపుణుల సలహాలు తీసుకుంటున్నా’ అని గవర్నర్‌ రమేశ్‌ స్పష్టంచేశారు.

గనుల తవ్వకం లీజును సీఎం సోరెన్‌ తనకు తానే మంజూరుచేసుకున్నాడనే కేసు నమోదైన విషయం తెల్సిందే. దీంతో లాభదాయక పదవి కోణంలో సోరెన్‌ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడా ? కాదా? అనేది స్పష్టంచేస్తూ ఈసీ నుంచి గవర్నర్‌కు∙లేఖ వచ్చింది. అందులో ఏముందో తెలీదు. అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసిందని వార్తలొచ్చాయి. ‘నిపుణుల సలహా తర్వాత జార్ఖండ్‌లో అణుబాంబ్‌ పేలొచ్చు’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement