Mining lease
-
గనుల లీజులపై గలీజు మాటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గనుల లీజుల గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. మాట్లాడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై లేనిపోని అభాండాలు వేయడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వాళ్ల కుటుంబాన్ని ఏదో విధంగా తొక్కేయాలి.. వాళ్లను నాశనం చేయాలి.. అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని చెప్పారు. ఇసుక, గనుల పాలసీపై చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్‌పై వైఎస్ జగన్ ఫ్యాక్ట్ పేపర్ ద్వారా వాస్తవాలను శుక్రవారం మీడియాకు వివరించారు. దశాబ్దాలుగా ఈ గనులను అడ్డం పెట్టుకొని సంపాదించింది ఎవరో అందరికి తెలుసన్నారు. మైనర్, మేజర్ ఖనిజాల ద్వారా 2018–19లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.2,210 కోట్లని తెలిపారు. ఈ రోజు (2023–24) వస్తోన్న ఆదాయం రూ.4 వేల కోట్లకు పైమాటే అని స్పష్టం చేశారు. 2018–19లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏపీఎండీసీ ఆదాయం రూ.400 కోట్లు అని, ఈ రోజు దాని ఆదాయం రూ.3 వేల కోట్లు పైమాటేనని తెలిపారు. ఇలా ఆదాయం పెంచితే కరప్షన్ జరుగుతున్నట్టా? అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. ఏదైనా ఆరోపణ చేసే ముందు లాజిక్, రీజన్ ఉండాలని హితవు పలికారు. ఇప్పుడు వైట్ పేపర్ అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించాలని కోరారు. -
ఈడీ ముందుకు హేమంత్ సోరెన్
రాంచీ: అక్రమ గనుల తవ్వకం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. రాంచీ కార్యాలయంలో ఆయనను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించింది. ఈడీ కేసులో ప్రశ్నించేందుకు గతంలో ఆయనకు పలుమార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేయగా వ్యక్తిగత, అధికారిక కారణాలు చూపుతూ ఇన్నాళ్లూ గైర్హాజరైన విషయం విదితమే. గురువారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన సోరెన్.. ఈడీకి ఒక లేఖ రాశారు. నిజాలేవిటో నిర్ధారించుకోకుండా ‘సంచలన ప్రకటనలు’ చేయొద్దని లేఖలో సూచించారు. ‘ మొత్తం జార్ఖండ్‌లో గత రెండేళ్లలో గనులు, ఖనిజాల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరేమో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో అవినీతి చేయాలంటే ఒక్క సాహెబ్గంజ్లోనే 8 కోట్ల మెట్రిక్ టన్నుల రాళ్లను తవ్వాలి. చట్టబద్ధంగా తవ్విన దానికంటే ఇది ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ. ఇది సాధ్యమా?’ అంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. ‘జేఎంఎం పార్టీ నుంచి నేను గెంటేసిన రవి కేజ్రీవాల్ బీజేపీ తరఫున మాట్లాడుతూ నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. ఈ కేసును ఎలాంటి రహస్య అజెండా లేకుండా దర్యాప్తుచేయండి’ అని ఈడీని కోరారు. తనపై బీజేపీ కుట్ర పన్నుతోందని అంతకుముందు మీడియాతో అన్నారు. దర్యాప్తును ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభావితం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. -
రెండో ఆప్షన్ కోసం అన్వేషిస్తున్నా: గవర్నర్ వ్యాఖ్య
రాయ్‌పూర్: లాభదాయక పదవి కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లపై ఆ రాష్ట్ర గవర్నర్ స్పందించారు. ‘ నేనేమీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేవాడిని కాదు. ఈసీ సిఫార్సు తర్వాత తుది నిర్ణయంపై తేల్చుకునేందుకు రెండో ఆప్షన్‌కు వెళ్తున్నా. నిపుణుల సలహాలు తీసుకుంటున్నా’ అని గవర్నర్ రమేశ్ స్పష్టంచేశారు. గనుల తవ్వకం లీజును సీఎం సోరెన్ తనకు తానే మంజూరుచేసుకున్నాడనే కేసు నమోదైన విషయం తెల్సిందే. దీంతో లాభదాయక పదవి కోణంలో సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడా ? కాదా? అనేది స్పష్టంచేస్తూ ఈసీ నుంచి గవర్నర్‌కు∙లేఖ వచ్చింది. అందులో ఏముందో తెలీదు. అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసిందని వార్తలొచ్చాయి. ‘నిపుణుల సలహా తర్వాత జార్ఖండ్‌లో అణుబాంబ్ పేలొచ్చు’ అని గవర్నర్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
గలీజు మాటలేంటి బాబూ?
-
గలీజు మాటలేంటి?
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లిలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు మైనింగ్ లీజు 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ముఖ్యమంత్రి స్వార్థం ఉందంటూ విపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తాను అధికారంలో ఉండగా 30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన చంద్రబాబు ఇప్పుడు అసత్యాలతో బురద జల్లాలని ప్రయత్నించడాన్ని రాజకీయ నాయకులే కాకుండా అధికారులు, మేధావులు తప్పుబడుతున్నారు. తనకు వంతపాడే ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం పట్ల టీడీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచిన చంద్రబాబు సర్కారు.. రాంకో సిమెంట్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 160 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ చంద్రబాబు సర్కారు 2017 మే 3న జీఓఎంస్ నంబరు 59 జారీ చేసింది. – రాంకో సిమెంట్స్‌కే జగ్గయ్యపేట మండలంలో మరో 124.33 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ జీఓఎంస్ నంబరు 60 జారీ చేసింది. ఇదే సంస్థకు ఇదే మండలంలో మరో 60.72 హెక్టార్ల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ జీఓఎంస్ నంబరు 61 జారీ చేసింది. – రాంకో సిమెంట్స్‌కు జగ్గయ్యపేట మండలంలో 633.90 ఎకరాల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ 2017 మే 12న జీఓఎంఎస్ నంబరు 71 జారీ చేసింది. – కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో జైపే బాలాజీ సిమెంట్స్‌కు 629.22 హెక్టార్ల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ 2017 మే 17న జీఓఎంస్ నంబరు 73 జారీ చేసింది. – కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్‌కు 775.570 హెక్టార్ల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ చంద్రబాబు సర్కారు 2019 జనవరి 3న జీఓఎంఎస్ నంబరు 6 జారీ చేసింది. – కర్నూలు జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు 844.988 హెక్టార్లు, ఇదే జిల్లాలో మరోచోట 395.150 హెక్టార్ల మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ ఎన్నికల ముందు 2019 ఫిబ్రవరి 12న జీఓఎంఎస్ నంబరు 37, జీఓఎంఎస్ నంబరు 38 జారీ చేసింది. ఇలా చంద్రబాబు సర్కారు నాడు 30 సంస్థలకు వేలాది ఎకరాల మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ జీఓలు ఇచ్చింది. తాను తెచ్చిన చట్టమే..! ఎన్డీయే ప్రభుత్వం 2015లో ఎంఎండీఆర్ సవరణ చట్టం – 2015 తెచ్చింది. అప్పట్లో టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారంలో ఉంది. తాను భాగస్వామిగా ఉంటూ తెచ్చిన చట్టం ప్రకారమే నాడు చంద్రబాబు సర్కారు 30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. రాజకీయ కక్షతో రద్దు... – సరస్వతీ పవర్ అండ్ ఇండ్రస్టీస్‌కు 2009 మే 18వతేదీన ఉమ్మడి రాష్ట్ర హయాంలో 613 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజు మంజూరు చేస్తూ జీవో జారీ అయింది. అయితే రాజకీయ కక్షతో తెలుగుదేశం ప్రభుత్వం 2014 అక్టోబరు 9న ఈ మైనింగ్ లీజును రద్దు చేసింది. – కక్షపూరితంగా తమ లీజును రద్దు చేశారంటూ సరస్వతీ పవర్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. లీజును పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ లీజును రద్దు చేయడం అన్యాయమని, దానిని పునరుద్ధరించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ అధికారులు లీజును పునరుద్ధరిస్తూ 2019 డిసెంబరు 12న జీఓనంబరు 109 జారీ చేశారు. – 2015 ఎంఎండీఆర్ సవరణ చట్టం వచ్చేనాటికి ఉన్న మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగించాల్సిందేనని (డీమ్డ్ టు) అని సెక్షన్ 8 ఏ (3)లో ఉన్న నిబంధన మేరకు గతంలో చంద్రబాబు సర్కారు 30 సంస్థలకు ఇచ్చినట్లే సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వం లీజు పొడిగిస్తూ ఈనెల 8న జీవో ఇచ్చింది. 30 సంస్థలకు ఎలా పొడిగించారు? – సరస్వతీ ఇండస్ట్రీస్‌కు లీజు పొడిగింపు స్వార్థమంటూ ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు గతంలో ఆయన 30 సంస్థలకు ఏం ఆశించి 50 ఏళ్ల పాటు లీజు పొడిగించారో జవాబు చెప్పాలని పేర్కొంటున్నారు. – ఇసుక ద్వారా దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ వల్ల సర్కారుకు రూ.2,500 కోట్ల రాబడి నష్టం వాటిల్లిందని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడే అంగీకరించారు. ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలి?’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. – లేటరైట్ లీజుల్లో దండుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లేటరైట్ లీజు కూడా ఇవ్వలేదని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తుండటం గమనార్హం. చట్టం చెబుతున్నదేమిటంటే.. కేంద్ర ప్రభుత్వం 2015లో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ (ఎంఎండీఆర్ –2015) చట్టాన్ని తెచ్చింది. అప్పటికే మైనింగ్ లీజులు ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకుంటే లీజును 50 ఏళ్లకు కచ్చితంగా పొడిగించాలని ఈ చట్టంలోని సెక్షన్ 8 ఏ (3) స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధన ప్రకారమే గతంలో చంద్రబాబు సర్కారు 30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇదే నిబంధనలను అనుసరించి చట్ట ప్రకారం సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధికారులు 50 ఏళ్లకు మైనింగ్ లీజు పొడిగిస్తూ ఉత్తర్వులిస్తే అది తప్పన్నట్లు చంద్రబాబు బురద చల్లేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘వర్జిన్‌రాక్’ ఎలాంటి అక్రమాలూ చేయలేదు
* లోకాయుక్త తీర్పులో ఆ విషయం స్పష్టచేసింది * కన్నెధార కొండ మైనింగ్ లీజ్‌పై ధర్మాన సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని పది హెక్టార్లలో మైనింగ్‌లీజు పొందిన తమ కుటుంబానికి చెందిన వర్జిన్‌రాక్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని లోకాయుక్త తీర్పు ద్వారా వెల్లడైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ... తనపైనా, తన కుటుంబంపైనా బురద జల్లేందుకు అనేక రాజకీయ సంస్థలు ఐదేళ్లుగా ప్రయత్నించినా... అంతిమంగా ధర్మమే విజయం సాధించిందన్నారు. తాను వైఎస్సార్సీపీతో ఉన్నాననే కక్షతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా చాలా మంది వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని ప్రచారం చేశారని గుర్తుచేశారు. సీఎం ఈ విషయమై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఇక్కడి జిల్లా యంత్రాంగంపైనా ఒత్తిడి తెచ్చి న్యాయస్థానాలకు వ్యతిరేకంగా చెప్పించారని ఆరోపించారు. తాను అధికారులపై ఎలాంటి ఒత్తిడి తేలేదని, మైనింగ్ చేయలేదని, అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని చెప్పారు. వేసిన కేసుల్లో మూడుమార్లూ వర్జిన్‌రాక్ సంస్థకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని తెలిపారు. కేబినెట్ సభ్యులు ఒత్తిడి తేవడంవల్లే ప్రస్తుత కలెక్టర్ తొందరపడి ఎన్వోసీ రద్దు అని, లీజు క్యాన్సిల్ అని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఎవరు, ఎవరు పైనా ఎలాంటి ఆరోపణలు చేయకూడదని, చేసినా అది చెల్లదని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు. తానెప్పుడూ గిరిజనుల మనోభావాలకు, సంప్రదాయాలకు, స్థానికంగా ఉన్న వ్యక్తులకూ వ్యతిరేకం కాదన్నారు. ఇప్పుడు పది హెక్టార్లు తనకు అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి సూచిస్తూ కోర్టు తనకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా తాను మైనింగ్ చేపట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
‘పునరుద్ధరణ’కు మంగళం!
సాక్షి, హైదరాబాద్: చిన్నతరహా ఖనిజాల మైనింగ్ లీజులు (ఎంఎల్), గ్రానైట్ తదితర క్వారీ లీజులు (క్యూఎల్) గడువు ముగిస్తే ఇక.. ఏకంగా రద్దయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మైనింగ్ పాలసీని రూపొందించింది. ఈ పాలసీ ఈనెల ఒకటో తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం పొందాల్సి ఉంది. ఈ మేరకు ఎజెండాలోనూ చేర్చారు.అయితే, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇరకాటంలో పడటంతో సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మైనింగ్ పాలసీపై చర్చించలేదు. దీంతో ఇది వచ్చే కేబినెట్ సమావేశానికి వాయిదా పడింది. గడువు ముగిసిన మైనింగ్ లీజులను లీజుదారుల దరఖాస్తు ఆధారంగా పునరుద్ధరించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కొత్త మైనింగ్ పాలసీ ప్రకారం ఈ పద్ధతికి మంగళం పలకనున్నారు. తమ అనుయాయులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం రాజకీయ కోణంలో ఈ కొత్త్త విధానాన్ని రూపొందించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూగర్భ గనుల శాఖకు చెందిన అధికారులను పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దలు ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా తమకు అనుగుణంగా ఉండేలా మైనర్ మినరల్ పాలసీని తయారు చేయించుకున్నారు. కేపీఎంజీ అనే ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పరిశ్రమలు - వాణిజ్య శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీలు)గా పనిచేస్తున్నారు. ఈ ఓఎస్డీలు కొత్త మైనింగ్ పాలసీని రూపొందించారు. దీనినే భూగర్భ గనుల శాఖ అధికారులు కేబినెట్ ఆమోదం నిమిత్తం ప్రతిపాదించారు. -
లీజు బదిలీకి 90 రోజుల్లో అనుమతివ్వాలి
మైన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చలో మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ లీజు హోల్డర్లు తమ లీజును బదిలీ చేసేందుకు నోటీసులు ఇచ్చిన 90 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే.. అనుమతి ఇచ్చినట్టే భావించేలా బిల్లులో నిబంధనలు చేర్చాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా గిరిజన ప్రజలు వారి ప్రాంతాల్లో ఉండే ఖనిజ సంపదపై హక్కులు ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే మైనింగ్ క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నాం. అందువల్ల గిరిజనులకు లాభాల్లో తగిన వాటా, నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తే వారి అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగదు. మైనింగ్ లెసైన్స్‌దారు తన లీజును బదిలీ చేసుకునేందుకు ఈ బిల్లు అనుమతి ఇస్తోంది. అయితే సంబంధిత రాష్ట్రాలు దీనికి అనుమతి ఇవ్వాలి. రాష్ట్రాలు 90 రోజుల్లో అనుమతి ఇవ్వనిపక్షంలో అనుమతి ఇచ్చినట్టుగా భావించాలనే నిబంధనను కూడా ఈ బిల్లులో చేర్చాలి. లీజులు ఇచ్చే సందర్భంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించి జాతీయ ప్రయోజనాలను కాపాడాలి’ అని పేర్కొన్నారు. మైనింగ్ కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోండి: బుట్టా రేణుక మైనింగ్ కార్మికుల రక్షణ, సామాజిక భద్రతకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు మైన్స్ బిల్లులో నిబంధనలు పొందుపరచాలని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్రాన్ని కోరారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. -
12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజు రద్దు
ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని 12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గనులు విస్తారంగా ఉన్నాయి. గనులు, భూగర్భవనరులశాఖ నుంచి అనుమతి పొందిన ఈ లీజుదారులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించటంతో లీజులను రద్దు చేస్తున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా యజమానుల్లో స్పందన కరువవ్వటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీజుకు 25 ఏళ్ల కాలపరిమితితో గతంలో అనుమతించారు. సీఎస్ పురం మండలం చినపనాయుడుపల్లిలో 53.93 ఎకరాలకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదే మండలం మూసునూరులో యూ.మల్లికార్జున రావు కు 38.29 ఎకరాల్లో క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. పెద్దారవీడు మండలం చెట్లమిట్ట పంచాయతీ పరిధిలోని రాజంపల్లిలో కృష్ణమినరల్స్కు ఇచ్చిన 11.563 హెక్టార్లు క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం వింజావతిపాడులో పి.సుబ్బారావుకు ఇచ్చిన 9.226 హెక్టార్ల క్వార్ట్జ్లీజును రద్దు చేశారు. అదే మండలం సిద్ధవరం గ్రామంలోని ఆర్.మురళీధరరెడ్డికి ఇచ్చిన 43.769 హెక్టార్లలోని క్వార్ట్జ్లీజును రద్దు చేశారు. పామూరు మండలం సిద్ధవరం పరిధిలోని చంద్రకాంత్ మైన్స్ అండ్ మినరల్స్ 27.409 హెక్టార్లలో ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండం పరిధిలోని 21.243 హెక్టార్లను ఎస్కే నాగూర్‌వలికి ఇచ్చిన క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువులో 21.514 హెక్టార్లలో యూబీ మినరల్స్ మేనేజింగ్ పార్టనర్ పి.ఉదయభాస్కరరావుకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదేవిధంగా కొమరోలు మండలం మొట్టుపల్లి గ్రామంలోని 4.914 హెక్టార్లలో బెరైటీస్ గనుల లీజు పొందిన బి.సుధాకర్‌కు చెందిన లీజును కూడా రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. -
పారదర్శకంగా మైనింగ్ లీజులు
జంగారెడ్డిగూడెం రూరల్ : రాష్ట్రంలో మైనింగ్ లీజులను పారదర్శకంగా కేటాయిస్తామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. నవంబర్ 1 నుంచి మైనింగ్ లీజులకు అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఇసుక రీచ్‌లు ప్రారంభించనున్నామని తెలిపారు. మైనింగ్ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ వస్తుందని, దీంతో ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఇసుక రీచ్‌ల ద్వారా డ్వాక్రా మహిళలకు ఆదాయం చేకూరేలా అనుమతులు జారీ చేయనున్నట్టు తెలిపారు. జియోట్యాగింగ్, జీపీఎస్ సిస్టం ద్వారా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో వాటా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుతున్నారని, తమ రాష్ట్రానికి చెందినవన్నీ తమ రాష్ట్రానికే చెందుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మండల లక్ష్మణరావు, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎస్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. 6 గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : జిల్లాలోని ఆరు గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. రూ.95 లక్షలతో విద్యుదీకరణ పనులను చెపట్టినట్టు తెలిపారు. అన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. ఏలూరు జెడ్పీ అతిథి గృహంలో పలువురు గిరిజనులు మంత్రిని కలిసి ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఆమె మాట్లాడుతూ తొలుత 6 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో జిల్లా ప్రజలు ముందున్నారన్నారు. దాదాపు రూ. 5 కోట్ల విలువైన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, ఉత్తరాంధ్రకు పంపించారన్నారు. -
గ‘లీజు’ ఒత్తిళ్లు!
మళ్లీ తెరపైకి మైనింగ్ జోన్ వ్యవహారం యాచారం: కొంతకాలంగా సద్దుమణిగిన మైనింగ్ జోన్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక రైతుల ఆందోళనతో గత ప్రభుత్వం మైనింగ్ లీజు అంశాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా.. ప్రస్తుతం ఆ ఫైళ్ల కదలిక వేగవంతమైంది. ఏకంగా అమాత్యుల అండదండలతో ఈ గనుల లీజును సఫలీకృతం చేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీవ్రం చేశారు. ఈ క్రమంలో గత వారం కొందరు లీజుదారులు రెవెన్యూ అధికారులతో చర్చించి.. లీజుకు కేటాయించిన స్థలాలను పరిశీలించడంతో స్థానికంగా కలకలం మొదలైంది. యాచారంలోని సర్వే నంబర్లు 105, 121, 126, 132, 200లలోని దాదాపు 662 ఎకరాలను మైనింగ్ జోన్‌కు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 47 మందికి గనుల లీజును జారీ చేస్తూ ఉత్తర్వులివ్వడంపై స్థానిక రైతాంగం తీవ్ర ఆందోళన వ్య క్తం చేసింది. మైనింగ్‌జోన్ ఏర్పాటుతో పంట పొలాలు దెబ్బతినడంతో పాటు నీటి కాలుష్యం, ఇతర సమస్యలు తలెత్తుతాయని స్థానిక ప్రజల వాదన. ఈ నేపథ్యంలో మైనింగ్ జోన్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాసంఘాలు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్మానాలు చేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి తీసుకె ళ్లారు. దీంతో ఈ వ్యవహారం కాస్త చల్లబడడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. తాజాగా గనుల లీజుకోసం లీజుదారులు మళ్లీ భూముల పరిశీలన చేపట్టడడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పైస్థాయిలో ఒత్తిడి చేస్తూ.. మైనింగ్ జోన్ ఏర్పాటుతో లీజుదారులు స్థానికంగా స్టోన్ క్రషర్, క్వారీల ఏర్పాటుకు చకచకా అనుమతులు పొందారు. కానీ స్థానికంగా నెలకొన్న ఆందోళనలతో వీటి ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేకు పడింది. తాజాగా లీజుదారులు అనుమతులను అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉపముఖ్యమంత్రితో పాటు ఓ కేబినెట్ మంత్రికి సన్నిహితులుగా చెప్పుకొంటున్న కొందరు లీజుదారులు ఏకంగా మంత్రుల పేషీనుంచి ఆర్డీఓ, తహసీల్దార్లకు వరుసగా ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. తమకు లీజు కేటాయించిన భూములను వెంటనే అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో వారంరోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకరిద్దరు లీజుదారులు బుధవారం మండల రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని లీజుభూములను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఒత్తిళ్లు ఫలించి భూములు అప్పగిస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. మళ్లీ ఆందోళన తప్పదు యాచారంలో మైనింగ్‌జోన్ ఏర్పాటును స్థానికృులు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. యాచారం గ్రామం, మండల పరిషత్ కార్యాలయంలోనూ తీర్మానాలు కూడా చేశారు. మళ్లీ వ్యాపారులు అధికారులపై ఒత్తిడి చేయడం న్యాయం కాదు. స్టోన్ క్రషర్లు, క్వారీలు ఏర్పాటైతే పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే మైనింగ్‌జోన్‌ను రద్దు చేయాలి. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలి. లేదంటే ఆందోళన తప్పదు. - రమావత్ జ్యోతి నాయక్, ఎంపీపీ, యాచారం -
గనుల శాఖలో ‘ఈ- పర్మిట్’
తాండూరు, న్యూస్‌లైన్: గనుల శాఖలో కొత్తగా ఈ -పర్మిట్ విధానం అమల్లోకి రానున్నది. ఈ విధానం ద్వారా లీజుదారులు ఇకపై గనుల నుంచి ముడిసరుకు తరలించేందుకు మైన్స్ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదు. ఏడాది క్రితం గనుల లీజుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇప్పుడు పర్మిట్ల జారీకి కూడా ఆన్లైన్ విధానాన్ని అమలోకి తేనున్నారు. ప్రస్తుతం గనుల శాఖ లీజుదారులకు మ్యానువల్ పద్ధతిలో పర్మిట్లు జారీ చేస్తున్నది. ఈ పద్ధతిలో రవాణా చేయాలనుకున్న ముడిసరుకు పరిమాణం ప్రకారం లీజుదారులు స్థానిక ట్రెజరీలో చలానా చెల్లించి, గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయంలో అందజేస్తారు. అనంతరం ముడిసరుకు రవాణాకు పర్మిట్లను జారీ చేస్తారు. అయితే తరచూ అధికారులు కార్యాలయంలో లేకపోవడం, పర్మిట్లను ఓకే చేసేందుకు సిబ్బంది సతాయిస్తుండడం తదితర కారణాల వల్ల లీజుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తద్వారా ముడిసరుకు రవాణా ఆలస్యమవుతోంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి లీజుదారులకు విముక్తి కల్పిస్తూ పర్మిట్ల కోసం వారు మైన్స్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ -పర్మిట్ విధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈనెల 9వ తేదీ నుంచి ఈ కొత్త విధానం పది జిల్లాల్లో అమల్లోకి తీసుకువచ్చేందుకు గనుల శాఖ సంచాలకులు ఇప్పటికే మైన్స్ ఏడీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ -పర్మిట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లాలో గత ఏడాది మార్చిలోనే అమలు చేయగా విజయవంతమైంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ విధానం అమలుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రానైట్, సుద్ధ, కంకర, షేల్తోపాటు తదితర చిన్నాపెద్ద తరహా ఖనిజాల రవాణాకు ఇక నుంచి ఈ -పర్మిట్ విధానం ద్వారా ఆన్లైన్లో పర్మిట్లు జారీ చేస్తారు. ఈ విధానం అమలుకు గనుల శాఖ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేస్తున్నది. లీజుదారులకు గనుల శాఖ ఎస్బీహెచ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ తదితర పది బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నది. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు ముడిసరుకు రవాణాకు పర్మిట్ కోసం డబ్బులను గనుల శాఖ ప్రధాన పద్దులో జమ చేస్తారు. అయితే లీజుదారులకు గనుల శాఖ ప్రత్యేకంగా ఐడీ నంబరును కేటాయిస్తున్నది. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు పర్మిట్ డబ్బులు జమ చేయగానే మైన్స్ ఏడీ సెల్ఫోన్లో ఇందుకు సంబంధించిన సమాచారం వస్తుంది. ప్రత్యేకంగా కేటాయించిన ఐడీ ద్వారా లీజుదారుడు ఎవరు, గని సర్వేనంబర్ తదితరాలతోపాటు లీజు కాలం వంటి వివరాలూ తెలుస్తాయి. అనంతరం ఏడీలు తమ డిజిటల్ సంతకంతో కూడిన పర్మిట్లను ఆన్లైన్లో లీజుదారునికి పంపిస్తారు. ఆన్లైన్లో వచ్చిన పర్మిట్లను లీజుదారులు ప్రింట్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని, ముడిసరుకును రవాణా చేసుకుంటారు. సిమెంట్ కర్మాగారాలు ఉన్నప్రాంతాల్లో సిమెంట్ గ్రేడ్ లైమ్‌స్టోన్‌కు మాత్రమే ఈనెల 9 నుంచి ఈ -పర్మిట్ విధానం అమలు చేయడానికి గనుల శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇతర చిన్నాపెద్ద తరహా ఖనిజాల ముడిసరుకు రవాణాకు ఈ విధానం సాధ్యమైనంత తొందరగా అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయని మైన్స్ వర్గాలు చెబుతున్నాయి. -
విజి‘లెన్స్’
యాజమాన్యాలు నిబంధనల అతిక్రమణలపై దృష్టి మైనింగ్ లీజు అనుమతులు.. వినియోగంపై ఆరా కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వులు పరిశీలన ఉత్పత్తికి తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు ఉన్నాయా? ప్రభుత్వ ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తున్నారా! కోరిన సమాచారం ఇవ్వాలని ఆదేశాలు డీజీపీ ఆదేశాల మేరకు కదిలిన యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని ఐదు సిమెంటు పరిశ్రమల్లో మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులకు తగ్గట్టుగానే పనిచేస్తున్నాయా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయా అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. విజిలెన్సు శాఖ డీజీపీ ఆర్పి ఠాకూర్ జిల్లా పర్యటన ముగిసిన వెంటనే ఆ శాఖ యంత్రాంగం సిమెంటు కార్మాగారాలపై దృష్టి సారించింది. తొలివిడతగా స్వయంగా పరిశీలన చేపట్టిన యంత్రాంగం అనంతరం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు సమాచారం. విజిలెన్సు ఏఎస్పీ లక్ష్మినాయక్ నేతృత్వంలో మంగళవారం డీఎస్పీ రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, ఓబులేసు, తహశీల్దార్ శరత్‌చంద్రారెడ్డి, వ్యవసాయాధికారి శశిధర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు నరసింహారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి , ఏసీటీఓ సత్యంలు జిల్లాలోని దాల్మియా, భారతి, జువారి, ఐసీఎల్ ( రెండు ) సిమెంటు కర్మాగారాల్లో తనిఖీలు చేశారు. పరిశ్రమలు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉత్పత్తులు మొదలుకుని ఉద్యోగుల జీతాల వరకూ రికార్డులు కావాలని కోరినట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఉన్న స్టాకు, మైనింగ్ లీజులు అందులో వెలికి తీసిన ముడిఖనిజం, ప్రస్తుతం నిల్వ ఉన్న ముడి ఖనిజం వివరాలను కోరినట్లు తెలుస్తోంది. అలాగే సిమెంటు పరిశ్రమకు మంజూరు చేసిన అనుమతుల వివరాలు, లెసైన్సు మేరకు ఉత్పత్తులు చేస్తున్నారా? మైనింగ్ జోన్ పరిధిలోనే మైనింగ్ చేస్తున్నారా...కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు పరిశ్రమలు పచ్చదనాన్ని పాటిస్తున్నాయా? ఉత్పత్తులకు తగ్గట్టుగా, విక్రయాలకు అనుగుణంగా ట్యాక్స్ చెట్టింపులున్నాయా? కార్మిక చట్టం మేరకు ఉద్యోగులకు జీతాలు, భద్రతలున్నాయా అనే అంశాలపై సమగ్రంగా సమాచారం కోరినట్లు తెలుస్తోంది. -
గిరిజన ప్రాంతాల్లో లీజుల రద్దు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు మంజూరు చేసిన మైనింగ్ లీజులను పునఃసమీక్షించి వాటన్నింటినీ వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి (ఏపీటీఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గిరిజన సంక్షేమ మంత్రి పసుపులేటి బాలరాజు నేతృత్వంలో మంగళవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశానికి గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఊకె అబ్బయ్య, కుంజా సత్యవతి, ధనసరి అనసూయ, రాజన్నదొర, సత్యనారాయణరెడ్డి, మిత్రసేన, నిమ్మక సుగ్రీవులు, నగేశ్ హాజరయ్యారు. గిరిజన ప్రాంతాల్లోని బాక్సైట్, లేటరైట్ మైనింగ్ లీజు లపై వాడివేడి చర్చ జరిగింది. అధికారులు గిరిజన హక్కులను కాలరాస్తూ.. లీజుల పేరిట భూములిచ్చి బినామీలు దోచుకునేందుకు దోహదపడుతున్నారని ఎమ్మెల్యేలు సక్కు, అబ్బయ్య, రాజన్నదొర ఆరోపించారు. లీజు కింద వస్తున్న రాయల్టీ ఎవరి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. లీజులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ స్వయంగా లేఖ రాశాక కూడా లీజుకు అనుమతి ఎందుకిచ్చారని నిలదీశారు. మైనింగ్ లీజులకు 5 కిలోమీటర్ల పరిధిలో గిరిజన ఆవాసాలే లేవని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఖనిజాల తవ్వకాలకోసం బినామీలకు లీజుకివ్వకుండా స్థానిక గిరిజనులను ప్రోత్సహించి, వారితో పరిశ్రమలు పెట్టించి ఉపాధి కల్పించేలా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో గిరిజన ప్రాంతాల్లోని లీజుల న్నింటినీ రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది. సబ్‌ప్లాన్ పనుల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం.. ఎస్టీ ఉపప్రణాళిక చట్టం కాంట్రాక్టర్లకు చుట్టంగా మారిందని సభ్యులు ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పనుల ప్రతిపాదనలను పంపి వాటికి ఆమోదం తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి సబ్‌ప్లాన్ కింద చేపట్టే పనుల్లో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారి సిఫారసు మేరకే పనుల ప్రతిపాదనలు రూపొందించాలంటూ తీర్మానించారు. ఇక ‘మందుల’ కులాన్ని ఎస్టీల జాబితా లో చేర్చాలనే అధికారుల ప్రతిపాదనను సమావేశం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ముందు ఎస్టీలలో ఉన్న గిరిజనుల జీవన పరిస్థితులు చక్కదిద్దాకే, కొత్త కులాలను చే ర్చే విషయం ఆలోచిద్దామని సభ్యులు చెప్పారు. సభ్యుల అభిప్రాయాలతో మంత్రి కూడా ఏకీభవించడంతో మందుల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అంగీకరించవద్దని, మున్ముందు ఇలాంటి ప్రతిపాదనలను ప్రోత్సహించవద్దని తీర్మానించారు. ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సుమన్‌రాథోడ్, తెల్లం బాలరాజును కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా టీఏసీ సమావేశాలకు అహ్వానించాలని తీర్మానించారు. గిరిజన హక్కులు కాలరాస్తున్నారు: బాలరాజు సమావేశానంతరం మంత్రి బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల భవిష్యత్తు తరాల ప్రయోజనాలదృష్ట్యా గిరిజన ప్రాంతాల్లోని మైనింగ్ లీజుల ను రద్దు చేయాలని తీరానించినట్లు చెప్పారు. రాష్ట్రం లో గిరిజన అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని, జీసీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గు ర్తించాలని, 800 గ్రామాలను షెడ్యూలు ఏరియాలో నోటిఫై చేయాలని కూడా తీర్మానించినట్లు చెప్పారు.