కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
జార్ఖండ్ నుంచి చొరబాటుదార్లను తరిమేస్తామని హామీ
దుమ్రీ: జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అండ్ కంపెనీకి ఈ నెల 23న బీజేపీ వీడ్కోలు పలకడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జార్ఖండ్‌లోకి అక్రమ చొరబాట్లను హేమంత్ ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు. చొరబాటుదార్లు ఇక్కడి గిరిజనుల బిడ్డలను వివాహాలు చేసుకున్నారని, వారి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి చొరబాటుదార్లను బయటకు తరిమికొడతామని, భూములను వెనక్కి తీసుకొని గిరిజనులకు అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఒక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గురువారం జార్ఖండ్‌లోని దుమ్రీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దోచుకుందని మండిపడ్డారు.
జనం సొమ్మును కొట్టగొట్టిన హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలు తప్పదని స్పష్టంచేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో హేమంత్ సోరెన్ జట్టుకట్టారని విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు. జమ్మూకశీ్మర్‌లో ఇండియాలో అంతర్భాగమని, ఆరి్టకల్ 370ని మళ్లీ తీసుకొచ్చేసత్తా ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అప్పగించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, రాహుల్ బాబా నా లుగో తరం కూడా ఆ పని చేయలేదని అన్నారు.
చట్టంలో సవరణ తీసుకొస్తాం
రాహుల్ గాందీని రాజకీయాల్లో ప్రవేశపెట్టేందుకు ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఇప్పటిదాకా 20 సార్లు ప్రయతి్నంచారని అమిత్ షా చెప్పారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాహుల్ గాంధీ విమానం ల్యాండ్ కాలేదని అన్నారు. 21వ ప్రయత్నంలో జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విమానం కుప్పకూలడం తథ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో వక్ఫ్ బోర్డు హిందూ ప్రాచీన దేవాలయాల భూములను ఆక్రమించిందని ఆరోపించారు. వ్యవసాయ భూములను కూడా కబ్జా చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి కబ్జాలను అడ్డుకోవడానికి చట్టంలో సవరణ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment