బంగ్లా చొరబాటుదారుల్ని ప్రొత్సహిస్తున్నారు: సోరెన్‌ సర్కార్‌పై మోదీ విమర్శలు | PM Modi Jharkhand Rally Infiltrator Jab At Hemant Soren Govt | Sakshi
Sakshi News home page

బంగ్లా చొరబాటుదారుల్ని ప్రొత్సహిస్తున్నారు: సోరెన్‌ సర్కార్‌పై మోదీ విమర్శలు

Published Mon, Nov 4 2024 3:09 PM | Last Updated on Mon, Nov 4 2024 3:40 PM

PM Modi Jharkhand Rally Infiltrator Jab At Hemant Soren Govt

రాంచీ: జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. మరో వారం రోజుల్లో పోలింగ్‌ ఉండటంతో.. ఎన్నికల్లో గెలుపోటములపై పార్టీలు  వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికార జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుజ్జగింపులే సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వ ప్రధాన ఎంజెడా అని మండిపడ్డారు.

ఈ మేరకు రాష్ట్రంలోని గర్హ్వాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి ప్రభుత్వం బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు. సంకీర్ణ ప్రభుత్వంలో బుజ్జగింపులు తీవ్రస్థాయికి చేరాయని, ఈ పార్టీలో రాష్ట్ర సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు.

‘బంగ్లాదేశ్‌చొరబాటుదారులు జార్ఖండ్‌ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోంది. సరస్వతీ వందనను(సరస్వతి గేయం) పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోండి. పండుగల సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు, కర్ఫ్యూ విధించడం, దుర్గమ్మను ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు. చొరబాటు సమస్య కోర్టుకు వెళ్లినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. వారు మీ రోటీ, బేటీ, మాతాను తీసుకుంటున్నారని స్పష్టమైంది.

జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్‌లో ఆదివాసీ సమాజం కుంచించుకుపోతుంది. కాబట్టి, ఈ చొరబాటు కూటమిని నిర్మూలించడానికి మీ ఓటును ఉపయోగించండి, కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్‌లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.

హేమంత్‌ సోరెన్‌ లక్ష్యంగా చేసుకొని మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ లభించడంతో చంపాయ్‌ సోరెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని జేఎంఎం నిర్ణయం తీసుకుంది. ఇది ఆయనకు జరిగిన తీవ్ర అన్యాయం. ఆదివాసీ బిడ్డను వారు అవమానించారు. కుటుంబం కంటే వారికి ఏది ముఖ్యం కానప్పుడు మిమ్మల్ని (రాష్ట్ర ప్రజలను) ఎలా చూసుకుంటారు. అలాంటి స్వార్థపూరిత పార్టీలకు గుణపాఠం చెప్పడం అవసరం, నాకు కుటుంబం లేదు. మీరే నా కుటుంబం’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement