ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశంలోని అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన జాబితా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బీజేపీ మూడవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఈ జాబితాలో అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, భూపేందర్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మోహన్ యాదవ్, వసుంధర రాజే, రవిశంకర్ ప్రసాద్‌లు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने लोकसभा चुनाव-2024 के लिए चुनाव घोषणा-पत्र समिति का गठन किया है।
— BJP (@BJP4India) March 30, 2024
BJP National President Shri JP Nadda has announced Election Manifesto Committee for the Lok Sabha Elections - 2024. pic.twitter.com/KMrBpqkQQF
Comments
Please login to add a commentAdd a comment