
ఏకే ఆంటోని, పి.చిదంబరం
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలకు చైర్మన్లు, కన్వీనర్లను శనివారం ప్రకటించారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కోర్ కమిటీకి, మరో సీనియర్ నాయకుడు పి.చిదంబరం మేనిఫెస్టో కమిటీకి, ఆనంద్ శర్మ ప్రచార కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు.
కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు కోర్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఎంపీ, పార్టీ పరిశోధనా విభాగం అధిపతి రాజీవ్ గౌడ మేనిఫెస్టో కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పవన్ ఖేరా ప్రచార కమిటీకి కన్వీనర్‌గా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఈ కమిటీల అధిపతులతో సమావేశమై రాబోయే ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment