core committee
-
బీజేపీ కోర్ కమిటీతో సునీల్ బన్సల్ భేటీ
-
ఆరుగురితో విద్యుత్ ‘కోర్ కమిటీ’
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలకు కూడా పరిమితులు తొలగించి, సాధారణ స్థితిలో విద్యుత్ సరఫరా చేయడానికి కృషిచేస్తోంది. దీన్లో భాగంగా బొగ్గు కొరత కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరతను అధిగమించడానికి చైర్మన్, ఐదుగురు సభ్యులతో కోర్ మేనేజ్మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంధనశాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో జెన్కో డైరెక్టర్ (బొగ్గు), ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్), ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్), ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సభ్యులుగా ఉంటారు. ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఈ కమిటీకి కూడా మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఫ్యూయెల్ సప్లై అగ్రిమెంట్స్ (ఎఫ్ఎస్ఏ) ప్రకారం బొగ్గును సక్రమంగా సరఫరాకు సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ బొగ్గు క్షేత్రాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. కేంద్ర బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖలతో మాట్లాడి బొగ్గు రవాణా (ర్యాక్స్)లో పరిమితులను పరిష్కరించేందుకు కృషిచేస్తుంది. అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ఆర్థికశాఖకు నివేదిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలతో సమన్వయం చేస్తూ.. థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత బొగ్గు సరఫరా ఉండేలా చూస్తుంది. క్లిక్: బొండా ఉమ చిల్లర రౌడీ -
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకు రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఉత్తమ్ నివాసానికి వెళ్లి తేనీటి విందు అందుకున్నారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్నారు. తొలుత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాణిక్యం.. తర్వాత కోర్‌కమిటీ సభ్యులతో కలసి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక గురించి అభిప్రాయ సేకరణ చేశారు. – సాక్షి, హైదరాబాద్ 30 నిమిషాలు.. సింగిల్ ఎజెండా టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం 30 నిమిషాల పాటు ఒకే ఎజెండాతో సాగింది. అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలని కోర్‌కమిటీని కోరారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, కోర్‌కమిటీ సభ్యులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, వీహెచ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ఒక్కో నేత నుంచి వ్యక్తిగతంగా టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఠాగూర్ అభిప్రాయాలను సేకరించారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ విడివిడిగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి మాణిక్యం ఠాగూర్ అభిప్రాయాలు తీసుకునే సందర్భంలో అందరు నేతలూ పార్టీ భవిష్యత్ సంక్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన పార్టీ నేతల్లో ఒకరిద్దరు మినహా ఎవరూ మీడియాకు తాము చెప్పిన విషయాలను వెల్లడించడలేదు. కోర్‌కమిటీ సమావేశం ముగించుకుని వచ్చిన ఉత్తమ్‌ను మీడియా ప్రశ్నించగా, సోనియాగాంధీ నిర్ణయమే తన నిర్ణయమని చెప్పినట్లు వివరించా రు. జానారెడ్డిని అడగ్గా తన అభిప్రాయాన్ని పార్టీకి చెప్పానని, పార్టీ అంతర్గత వ్యవహారాలు వెల్లడించలేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా అదేతరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, మాజీ ఎంపీ వీహెచ్ మాత్రం బీసీలకు ఈసారి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు వెల్లడించారు. ఎప్పుడు బీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో నోట్ రూపంలో ఇన్చార్జికి అందజేసినట్టు ఆయన తెలిపారు. పొన్నాల, పొన్నం, సంపత్, కోమటిరెడ్డి.. అందరూ తమ నిర్ణయం పారీ్టకి చెప్పామని దాటవేశారు. నేనెందుకు పార్టీ మారతా: జానారెడ్డి ఈ సందర్భంగా జానారెడ్డి పార్టీ మార్పు అంశాన్ని మీడియా ప్రస్తావించింది. దీనిపై మాట్లాడుతూ తాను పార్టీ మారుతానన్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన పార్టీ మార్పు గురించి ప్రచారం చేస్తున్న మీడియా ఇందుకు సంజాయిషీ చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం అభ్యర్ధనని, తాను పార్టీ ఎందుకు మారతానని కుండబద్దలు కొట్టారు. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అన్నీ అధిగమించి అధికారంలోకి వస్తాం: మాణిక్యం ఠాగూర్ కోర్‌కమిటీ సమావేశానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలసి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్ష హోదాలో ఉత్తమ్ సమర్థంగా పనిచేశారని కితాబిచ్చారు. ఎలాంటి సందర్భంలోనూ ఆయన సహనం కోల్పోకుండా వ్యవహరించారని, కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకు ఉత్తమ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. కాంగ్రెస్ టీం ఇండియా లాంటిదని, మొదట్లో ఓడినా తర్వాత గెలుస్తుందని, అన్ని సమస్యలను అధిగమించి 2023లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై గురు, శుక్ర వారాల్లో రాష్ట్ర పార్టీకి చెందిన 100–150 మంది నేతల అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారు. ఈ అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్టానానికి ఇస్తానని, కొత్త అధ్యక్షుడిని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమిస్తారని మాణిక్యం స్పష్టం చేశారు. కాగా, గురు, శుక్రవారాల్లో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో మాణిక్యం విడివిడిగా సమావేశమవుతారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని టీపీసీసీ అధ్య క్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉత్తమ్ అధ్యక్షతన టీపీసీసీ కోర్‌కమిటీతో పాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షు లు, పీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. అనంతరం రాత్రి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్, కార్యదర్శి చిన్నారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కోర్‌కమిటీ, ఆఫీస్‌బేరర్ల సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె, చార్జీల పెంపు, డిసెంబర్ 14న ఢిల్లీలో నిర్వహించనున్న భారత్ బచావో ఆందోళనపై చర్చించినట్టు చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున కిలోమీటర్‌కు 20 పైసలు ఆర్టీసీ చార్జీలు పెంచడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మున్సిపల్ ఎన్ని కలు జనవరిలో వస్తాయని తాము అంచనా వేస్తున్నామని, ఇందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యకు ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో జరుగుతున్న విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, మద్యం అమ్మకాలను తగ్గించాలని ఆయన డిమాం డ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తో దేశ ఆరి్థక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, కేంద్రం తీరుకు నిరసనగా డిసెంబర్ 14న ఢిల్లీలో ‘భారత్ బచావో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
కోర్ కమిటీదే ఎంపిక బాధ్యత
మోర్తాడ్ (బాల్కొండ): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ అధిష్టానం మండలానికి ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుండటంతో అన్ని పార్టీల్లో అలజడి మొదలైంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడానికి క్షేత్రస్థాయిలో కమిటీ అవసరం అని అధిష్టానం భావించింది. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునితో పాటు సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. కోర్ కమిటీ సభ్యులు అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహించి ఎంపీటీసీ అభ్యర్థుల ఆశావహుల పేర్లను సేకరించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి జెడ్పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులను గెలిపించాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంది. జిల్లాలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ జిల్లా అంతటిని అజమాయిషీ చేసే బాధ్యతను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఇచ్చారు. కోర్ కమిటీ సభ్యులు ఆశావహుల జాబితాలను తయారు చేసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించాల్సి ఉంది. ఎమ్మెల్యేలే అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపనున్నారు. కోర్ కమిటీ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో వారు రెండు మూడు రోజుల్లో ఆశావహుల జాబితాలను తయారు చేయడానికి గ్రామాల వారీగా సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే కోర్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు తీవ్రంగానే ఉందని స్పష్టం అవుతుంది. -
అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ప్రారంభించింది. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ముఖ్య నేతల కోర్ కమిటీ సమావేశంలో దీనిపై ప్రాథమిక చర్చ జరిగింది. బీజేపీ నుంచి పోటీకి రిటైర్డ్ అధికారులతోపాటు కొందరు సీనియర్ ప్రభు త్వ అధికారులు కూడా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్ ఆశించి భంగపడే నేతలెవరైనా వస్తే పార్టీ నుంచి పోటీకి దింపే అవకాశాలున్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక జాబితా సిద్ధం చేసేందుకు పార్లమెంట్ ఇన్చార్జులను నియమించారు. వారు సంబంధిత నియోజకవర్గంలో పోటీకి అర్హులైన ముగ్గురేసి సభ్యులతో జాబితాలు సిద్ధం చేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ మాజీ నేత కిషన్‌రెడ్డి పోటీలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చేవెళ్ల నుంచి దత్తాత్రేయ సమీప బంధువు జనార్దనరెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు నుంచి కిషన్‌రెడ్డిని కూడా పార్టీ జాతీయ నాయకత్వం పోటీకి దింపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. మరో 3, 4 రోజుల్లో మళ్లీ భేటీ కావాలని కోర్ కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన కసరత్తులో భాగంగా సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో లక్ష్మణ్ సమావేశం కానున్నారు. కరీంనగర్ నియోజకవర్గంపై దృష్టి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుగుణాకరరావు గెలుపుకోసం కృషి చేయాల ని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడి రెబెల్‌గా రంగంలోకి దిగిన ఏబీవీపీ మాజీ నేత రణజిత్ మోహన్ పార్టీ పేరుతోపాటు ప్రధాని మోదీ ఫొటోతో ప్రచా రం నిర్వహించడాన్ని కోర్ కమిటీ తీవ్రంగా పరిగణిం చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించా రు. ఈ భేటీలో లక్ష్మణ్, దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీలో మనోళ్లకు ప్రాధాన్యం
సాక్షి, వికారాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జిల్లాకు పెద్ద పీట వేశారు. స్థానిక నేతలకు రెండు కీలక పదవులు కట్టబెట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొడంగల్ తాజా, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను టీపీసీసీ స్టాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ నియమించారు. పార్టీ మారినా.. పోస్టు మారలే.. రేవంత్‌రెడ్డికి ఎట్టకేలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభించింది. ఎంతో ఆర్భాటంగా టీడీపీ నుంచి హస్తం గూటికి చేరిన ఈయనకు ఇప్పటివరకూ ఎలాంటి పదవి ఇవ్వకుండా అధిష్టానం నానుస్తూ వచ్చింది. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే అసలైన సమయంలో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం ఆయన వర్గీయుల్లో ఆనందం నింపింది. ఎన్నికల ప్రచార పర్వంలోనూ రేవంత్ కీలకంగా మారనున్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగిన ఈయనను కాంగ్రెస్‌లోనూ ఇదే పదవి వరించింది. అనుమానాలకు తెర... జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు రేవంత్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు టీపీసీసీలో కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా ఆ పార్టీ అధిష్టానం అనేక అనుమానాలకు తెరదించినట్లయింది. ప్రసాద్‌కుమార్ కారెక్కనున్నాడనే పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఇవేవీ పట్టించుకోకుండా కీలక పోస్టు అప్పగించింది. దీంతో అధిష్టానం దృష్టిలో ప్రసాద్‌కుమార్‌కు మంచి స్థానమే ఉందని తేలిపోయింది. రేవంత్‌రెడ్డిని రాజకీయంగా బలహీనం చేసేందుకే కాంగ్రెస్ ఆయన్ను చేర్చుకుందని వచ్చి న పుకార్లకు సైతం అధిష్టాన నిర్ణయం జవాబుగా నిలిచింది. ఈ నేపథ్యంలో జిల్లాలో టీఆర్ఎస్ నేతలతో పాటు ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పక్కాగా ముందుకెళ్తోంది. -
టీపీసీసీ కమిటీల్లో మనోళు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఇద్దరు కార్య నిర్వాహక అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు ఎన్నికలకు సంబంధించి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించిన జాబితాను బుధవారం విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన తొమ్మిది కమిటీల్లో జిల్లాకు చెందిన సుమారు అరడజను మంది నేతలకు చోటు దక్కింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా వ్యవహరించే మేనిఫెస్టో కమిటీలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్తో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డికి సభ్యులుగా చోటు దక్కింది. కోర్ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ సభ్యులుగా ఉంటారు. ప్రచార కమిటీలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సమన్వయ కమిటీలో దామోదర, గీతారెడ్డి, జగ్గారెడ్డి, ప్రచా ర కమిటీలో జగ్గారెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో దామోదర, గీతారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్ సభ్యులుగా నామినేట్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన అనంతుల శ్యాం మోహన్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎల్డీఎమ్మార్సీ కమిటీ చైర్మన్‌గా ఆరేపల్లి మోహన్ కొనసాగుతారు. ఏఐసీసీ ఏర్పాటు చేసిన కమిటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు మాత్రమే చోటు కల్పించడంపై మెదక్, సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. -
కాంగ్రెస్ కోర్ కమిటీ అధిపతిగా ఆంటోనీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలకు చైర్మన్లు, కన్వీనర్లను శనివారం ప్రకటించారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కోర్ కమిటీకి, మరో సీనియర్ నాయకుడు పి.చిదంబరం మేనిఫెస్టో కమిటీకి, ఆనంద్ శర్మ ప్రచార కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు కోర్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఎంపీ, పార్టీ పరిశోధనా విభాగం అధిపతి రాజీవ్ గౌడ మేనిఫెస్టో కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పవన్ ఖేరా ప్రచార కమిటీకి కన్వీనర్‌గా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఈ కమిటీల అధిపతులతో సమావేశమై రాబోయే ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. -
తెలుగు నేతలకు రాహుల్ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీని పరిపుష్టం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2019 ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కీలక కమిటీలను కాంగ్రెస్ పార్టీ శనివారం ఏర్పాటు చేసింది. కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీలను నియమించింది. తనకు ఎంతో నమ్మకస్తులైన సూర్జివాలా రణదీప్, కేసీ వేణుగోపాల్‌లకు కోర్ కమిటీలో స్థానం కల్పించారు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తొమ్మిది మంది సభ్యుల కోర్ కమిటీలో సోనియా గాంధీ విశ్వాసపాత్రులు అశోక్ గెహ్లట్, ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, జైరామ్ రమేశ్, చిదంబరం ఉన్నారు. 19 మందితో మేనిఫెస్టో కమిటీ, 13 మంది సభ్యులతో పబ్లిసిటీ కమిటీలను ఏర్పాటు చేశారు. జైరామ్ రమేశ్, చిదంబరం.. కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీల్లోనూ ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు మేనిఫెస్టో తయారు చేయడానికి, పబ్లిసిటీ ప్రణాళిక రూపొందించే పనిలో కమిటీలు నిమగ్నమవుతాయని అశోక్ గెహ్లట్ తెలిపారు. తెలంగాణ, ఏపీ నేతలకు మొండిచేయి కాంగ్రెస్ పార్టీ కీలక కమిటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులకు స్థానం దక్కలేదు. మూడు కమిటీల్లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు మొండిచేయి చూపారు. వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు నాయకులను హైకమాండ్ పట్టించుకోకపోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. కనీసం మేనిఫెస్టో కమిటీలో కూడా తెలుగు నేతలకు చోటు కల్పించకపోవడం గమనార్హం. సూర్జివాలా రణదీప్‌ను రెండు కమిటీల్లోనూ (కోర్, పబ్లిసిటీ) తీసుకోవడం విశేషం. -
హైదరాబాద్‌లో టి.బీజేపీ కోర్‌కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కోర్‌కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. త్వరలో జరగనున్న వరంగల్ లోక సభ స్థానానికి ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, సభ్యత్వ నమోదుతోపాటు నాగం వ్యవహారంపై కూడా కోర్‌కమిటీ చర్చిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, శాసన సభలో ఆ పార్టీ నేత కె. లక్ష్మణ్ తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు ఈ కోర్ కమిటీకి హాజరయ్యారు. -
కాసేపట్లో కాంగ్రెస్ కోర్‌కమిటి సమావేశం
-
ఏదో ఒకటి తేల్చండి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను తిరిగి బీజేపీలో చేర్చుకునే విషయమై త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీ రాష్ర్ట కోర్ కమిటీ అధిష్టానాన్ని కోరింది. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకు రావడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై చర్చించారు. రాష్ట్రంలో వివిధ చోట్ల ఆయన బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయినందున కొత్త పదాధికారుల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ రాష్ట్ర శాఖను పునర్వ్యవస్థీకరించడంపై కూడా చర్చ సాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, ఆర్ఎస్ఎస్ నాయకుడు సంతోష్ పాల్గొన్నారు. అధిష్టానం కోర్టులో బంతి యడ్యూరప్పను తిరిగి బీజేపీలో చేర్చుకునే విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జోషి తెలిపారు. కోర్ కమిటీ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఆయన తిరిగి బీజేపీలోకి వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. తమ నిర్ణయమేమిటో ఇదివరకే చెప్పినందున, బంతి అధిష్టానం కోర్టులో ఉందని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి యడ్యూరప్ప మద్దతు తెలపడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. బీజేపీని వీడిన వారందరూ జాతి ప్రయోజనాల దృష్ట్యా తిరిగి వెనక్కు వస్తే మంచిదని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నర హంతకుడని అభివర్ణించడంపై మండిపడుతూ, వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
షిండే లేకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లేకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్ర ప్రారంభమైంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఆర్థికమంత్రి చిదంబరం తదితరులు దీనికి హాజరయ్యారు. రాష్ట్ర విభజన విషయమై ఆంటోనీ కమిటీ ఇప్పటికే ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలతో సమావేశం కావడం, ఆ వివరాలను కోర్ కమిటీ చర్చించాల్సి రావడం, మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించే అవకాశం ఉండటంతో కోర్ కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
కోర్‌కమిటి బ్యాచ్‌తో సిల్లీబ్రాండ్
-
తెలంగాణ కోర్ కమిటీపై చర్చ
-
T-భేటి
-
ప్రధాని నివాసంలో కోర్ భే'టీ' మొదలు