
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో రేసులో వెనుకబడకుండా ఎన్నికల నిర్వహణ, మేనిఫెస్టో రూపకల్పన కోసం నాలుగు కమిటీలు నియమించింది.
ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ, ప్రణాళిక, వ్యూహ కమిటీల నియామకానికి శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి మహమ్మద్ అక్బర్ నేతృత్వం వహిస్తే శివకుమార్ దహారియా ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. 9 మంది తో క్రమశిక్షణ కమిటీ, 18 మందితో ప్లానింగ్ కమిటీ ఏర్పాటయ్యాయి.