రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.
తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.
‘‘అయోధ్యలోని రామమందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్‌ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా.
నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ, కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment