ఏపీ బీజేపీ మేనిపెస్టో కమిటీ ఇదే..! | BJP Appointed Manifesto Committee For AP Elections | Sakshi
Sakshi News home page

మేనిపెస్టో కమిటీని నియమించిన ఏపీ బీజేపీ

Jan 16 2019 2:36 PM | Updated on Jan 16 2019 2:59 PM

BJP Appointed Manifesto Committee For AP Elections - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి చేపట్టనున్న బస్సు యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించడానికి కన్నా లక్ష్మీనారాయణ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి బీజేపీ సీనియర్‌ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చైర్‌పర్సన్‌గా, ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు కన్వీనర్‌గా ఉన్నారు. వీరితోపాటు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు.

బీజేపీ మేనిఫెస్టో కమిటీలోని సభ్యులు..
1. డి. పురందేశ్వరి(చైర్‌పర్సన్‌)
2. ఐవైఆర్‌ కృష్ణారావు(కన్వీనర్‌)
3. పి. విజయ బాబు
4. పీవీఎన్‌ మాధవ్‌
5. దాసరి శ్రీనివాసులు
6. షేక్‌ మస్తాన్‌
7. పాక సత్యనారాయణ
8. కె. కపిలేశ్వరయ్య
9. పి సన్యాసి రాజు
10. సుదీష్ రాంబోట్ల
11. డీఏఆర్‌ సుబ్రహ్మణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement