kanna lakshminarayana
-
అమ్మ చంద్రబాబూ.. అది నిజమేనట!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయపాటి సాంబశివరావు నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారా? అయినా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో వారిని నాశనం చేశారా? చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు వీరి నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారా? మామూలుగా ఇలాంటి ఆరోపణ మరెవరిమీద అయినా వచ్చి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి,తదితర ఎల్లో మీడియా ఎంత భీబత్సంగా ప్రచారం చేసి ఉండేవి! ఆంగ్ల మీడియా సైతం ఎంత ప్రాధాన్యం ఇచ్చి ఉండేవి. కాని ఆశ్చర్యం ఏమిటంటే సాక్షి తప్ప ఇతర మీడియా ఏది పెద్దగా ప్రాచుర్యం ఇవ్వలేదు. చివరికి ఆంగ్ల మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారో గుర్తు చేసుకోండి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకున్నారని ఆయన ఆయా సభలలో అన్నారు. కాని దానిపై తదుపరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంతేకాదు. 2019 లో టిడిపి ఓటమి తర్వాత చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటి శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు సిబిటిడి ప్రకటించింది. అయినా చంద్రబాబుకు ఏమీ కాలేదు. ఐదేళ్లు గడిచిపోయినా మోడీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే టైమ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల అవినీతి జరిగిందో లేదు తెలియదు కాని నెలల తరబడి ఢిల్లీ ఆప్ మంత్రులు జైలులో గడపవలసి వస్తోంది. మన దేశ వ్యవస్థలలో ఎందుకు ఇంత తేడా వస్తోంది? ఒకే తరహా కేసుల్లో ఒకరికేమో ఆయా వ్యవస్థలలో పూర్తి సానుకూల నిర్ణయాలు వస్తుంటాయి. ✍️కొందరికేమో బెయిల్ రావడమే గగనం అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే చంద్రబాబునాయుడుపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలా పెద్దవాటి కింద లెక్క. నిజంగానే చంద్రబాబుకు అవినీతితో సంబంధం లేకుంటే కేంద్రం కాని, ప్రధాన మంత్రి మోదీ కాని ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం తప్పు అవుతుంది. వాటిలో నిజం ఉంటే అలా వదలివేయడం సరైనదేనా అన్న చర్చ వస్తుంది. అంటే పలుకుబడి, మేనేజ్ మెంట్ నైపుణ్యాన్ని బట్టి కేసుల నుంచి తేలికగా బయటపడవచ్చన్న అభిప్రాయం కలగదా! బీజేపీ నేతలు అవినీతికి వ్యతిరేకంగా గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. కాని చంద్రబాబు వంటి కొంతమందిపై వచ్చిన ఆరోపణల గురించి మాత్రం నోరు విప్పరు. ఇంకో సంగతి చెప్పాలి. న్యాయ వ్యవస్థ సైతం ఆయన పట్ల ఉదారంగా వ్యవహరిస్తుందా అన్న భావన ప్రజలలో కలుగుతుంది. ✍️ఎందుకంటే ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సైతం ఏళ్ల తరబడి విచారణకే రాలేదంటే అది చంద్రబాబు నైపుణ్యం అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కదా! చంద్రబాబు నాయుడు తనపై ఏ కేసు వచ్చినా స్టే తెచ్చుకోవడం ఆయన స్పెషాలిటీగా అంతా భావిస్తారు.ఒక సందర్భంలో ఆయనే ఒక మాట అన్నారు. తాను ఏ విషయంలోను టెక్నికల్ గా, లీగల్ గా దొరకనని చెప్పారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోవడంతో అది వాస్తవం అనిపిస్తుంది. అలాంటిది ఎపి సిఐడికి స్కిల్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చిక్కి ఏభై మూడు రోజులు జైలులో ఉండవలసి వచ్చింది. ✍️ఆయనకు కింది కోర్టులో బెయిల్ నిరాకరణ జరిగినా హైకోర్టులో మాత్రం పొందగలిగారు. విశేషం ఏమిటంటే బెయిల్ కోసం ఆయన తనకు నానా రకాల జబ్బులు ఉన్నాయని ఒక ప్రైవేటు ఆస్పత్రివారు ఇచ్చిన సర్టిఫికెట్ ను గౌరవ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం. సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చే రిపోర్టును చూస్తారు. మరి చంద్రబాబు విషయంలో బిన్నంగా జరిగిందంటే అది ఆయన లాయర్ల గొప్పదనం అనుకోవాలి. సు నుంచి బయటకు వచ్చాక మాత్రం చంద్రబాబు డాక్టర్ లు ఇచ్చిన రిపోర్టులన్నీ అబద్దాలే అన్నట్లుగా ఆయన టూర్లు చేస్తున్నారు. మంచి జోష్ గా అరుపులు,పెడబొబ్బలు పెడుతూ ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగా అంత తీవ్రమైన గుండె జబ్జు ఉన్న వ్యక్తి అలా చేయగలుగుతారా? న్యాయ వ్యవస్థ ఆ విషయాలను పరిశీలించదా అంటే ఏమి చెబుదాం. ✍️స్కిల్ కేసులో ఆయన మాజీ పిఎస్ శ్రీనివాస్ అమెరికా పారిపోయినా ఏమీ కాలేదు. ఈడి అధికారులు నలుగురిని అరెస్టు చేసినా, అసలు కేసే లేదని చంద్రబాబు తరపున వాదించగలుగుతున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసులు పెట్టడం తప్పు అంటూ ఆయన సుప్రింకోర్టుకు వెళ్లారు.దానిపై కూడా గౌరవ కోర్టువారు నెలల తరబడి తీర్పు ఇవ్వకపోవడం కూడా గమనించదగ్గ అంశమే. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయనకు కోటి రూపాయలు ఇచ్చానని హర్షద్ మెహతా అని స్టాక్ బ్రోకర్ చేసిన ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోని మీడియా అంతా దానిపై చిలవలు, పలవలుగా కదనాలు ఇచ్చేవి. ✍️చివరికి కోర్టుకు కూడా పివి వెళ్లవలసి వచ్చింది. కాని చంద్రబాబును మాత్రం మూడు దశాబ్దాలలో ఎవరూ కదల్చలేకపోయారు. ఎన్ని అవినీతి అభియోగాలు వచ్చినా సేఫ్ గా బయటపడుతుంటారు. ఆయనకు ఉన్న పట్టు అటువంటిదని అంతా నమ్ముతుంటారు. ఈ నేపద్యంలో తాజాగా గుంటూరు మాజీ ఎమ్.పి.రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు చేసిన ఆరోపణ ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నది చర్చనీయాంశం. ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఈ ఆరోపణలకు సంబంధించి కుక్కిన పేల మాదిరి నోరు మూసుకుని కూర్చున్నాయి. అయినా సోషల్ మీడియా ఉంది కనుక జనానికి విషయం తెలిసింది. చంద్రబాబు, లోకేష్ లు తమ కుటుంబాన్ని నాశనం చేశారని అంటూ చంద్రబాబు ఫోటోను రంగారావు నేలకేసి పగలకొట్టిన వీడియో వైరల్ గా మారింది. రాయపాటికి కాంగ్రెస్ టైమ్ లో పోలవరం టెండర్ దక్కింది. దానిని ఆయన కొంతమేర ఎక్జిక్యూట్ చేశారు. ✍️ఈలోగా శాసనసభ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో ఆ పార్టీ ప్రముఖులంతా టీడీపీ లేదా వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. రాయపాటి కూడా టీడీపీలో చేరి నరసరావుపేట టిక్కెట్ పొందారు. టీడీపీలో చేరినా పోలవరం కాంట్రాక్టును రాయపాటి నుంచి తప్పించి నవయుగ సంస్థకు చంద్రబాబు అప్పగించారు. ఎంపీ గా మరోసారి గెలిచారన్న భావన తప్పితే రాయపాటి ఆర్దికంగా బాగా దెబ్బతిన్నారని చెబుతారు.గత ఎన్నికల సమయంలో రూ. 150 కోట్లు ఇచ్చామని, చంద్రబాబు,లోకేష్ లు ఒకరికి తెలియకుండా డబ్బు వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం అంతా బోగస్ అని ఆయన లోగుట్టు విప్పేశారు.టిడిపి రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యాపార సంస్థ అని కూడా రాయపాటి సూత్రీకరించారు. ✍️దీనికి తోడు సత్తెనపల్లి సీటును తమ ప్రత్యర్ధి అయిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడం కూడా రాయపాటి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయినా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చి, ఎన్నికల సమయంలో బయటపడ్డారు. కట్టలు తెగిన ఆవేశంతో ఆయన మాట్లాడిన తీరు, పార్టీకి గుడ్ బై చెప్పిన వైనం అందరిని ఆశ్చర్యపరచింది. ఎంతగా నష్టపోయి ఉండకపోతే ఆయన ఇంతలా ఆవేదన చెందుతారా అన్నభావన కలుగుతుంది.దీనికి చంద్రబాబుకాని, ఆయన పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కాని స్పందించలేక పోయారు. ఇక మరో కీలక నేత ,విజయవాడ ఎమ్.పి కేశినేని నాని పార్టీని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిపోవడం కాదు. ✍️ఆ పార్టీ తరపున పోటీచేయబోతున్నారు. చంద్రబాబు ,లోకేష్ లు ఎలా తన పట్ల అనుచితంగా వ్యవహరించింది ఆయన తెలియచెప్పారు. చంద్రబాబు పెద్ద మోసగాడని కూడా నిర్మొహమాటంగా పేర్కొన్నారు.తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆయన ఆరోపించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలలో సామాజికపరంగా కూడా బలమైన నేతలుగా ఉన్న ఇద్దరు ప్రముఖులు పార్టీని వీడడమే కాకుండా, సంచలనాత్మకమైన ఆరోపణలు చేయడం సహజంగానే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో రంగారావు వేసిన మరో ప్రశ్న కూడా ఆసక్తికరంగా ఉంది. లోకేష్ రాయలసీమలో కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు.. ఈసారి కూడా గెలవనివ్వబోమని ఆయన అంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరైనా టీడీపీలో చేరితే అదేదో వైఎస్సార్సీపీకి తీవ్రమైన నష్టం కలిగినట్లు టీడీపీ నేతలు, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటారు.మరి ఇప్పుడు కమ్మ సామాజికవర్గం నేతలే పలువురు టీడీపీకి రాం రాం చెప్పడమే కాకుండా సంచలన విషయాలు బయటపెడుతుండడం పై మాత్రం కిమ్మనడం లేదు.దీనిని బట్టే అర్దం కావడం లేదూ తెలుగుదేశం ఎంత ఆత్మరక్షణలో పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ -
‘కన్నా పోటీచేస్తాడో.. పారిపోతాడో తెలియదు’
సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇష్టంమొచ్చినట్లు కన్నా మాట్లాడితే వైఎస్సార్సీపీ సహించదన్నారు. ‘కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్ఝ్ మాత్రమే. కన్నా పోటీ చేస్తాడో.. పారిపోతాడో తెలియదు. ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నాది. కన్నా సంగతి అమిత్ షాను అడిగితే బాగా చెబుతారు. మాజీ మంత్రి కన్నా పార్టీలు మారిన వ్యక్తి. చంద్రబాబును తిట్టి వారి బొమ్మలకే పాలాభిషేకం చేస్తున్నాడు కన్నా. కన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కన్నా సంగతి గుంటూరు కంటే వారి తోటలో ప్రజలు చెబుతారు.. ఆయన ఇంటిముందు ఫ్లెక్సీలు చెబుతాయి’ అని అంబటి మండిపడ్డారు. -
నువ్వేంటో.. నీ బతుకేంటో.. గుంటూరు ప్రజలందరికీ తెలుసు..
కొరిటెపాడు(గుంటూరు): మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాలు మాట్లాడితే.. తాను నిజాలు చెబుతానని, ఆయన జీవితమంతా అవినీతి మయమేనని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పేర్కొన్నారు. బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట్లో సున్నాగా ఉన్న కన్నా.. 45 గజాల స్థలం నుంచి వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది కుంభకోణాలు, అవినీతితోనే అన్న సంగతి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అందరికీ తెలుసు అని అన్నారు. కన్నా స్కాముల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సహకారశాఖ మంత్రిగా తన తండ్రి దినానికి విజయవాడలోని విజయకృష్ణ కో–ఆపరేటివ్ సూపర్ బజారు నుంచి లారీల కొద్దీ సరుకులు తెప్పించుకున్న నీచమైన చరిత్ర కన్నాదని.. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినన్నారు. కన్నా పాపాల చిట్టా అంతా తనకు తెలుసని.. దాని గురించి మాట్లాడుకుందామా..? నువ్వేంటో.. నీ బతుకేంటో.. గుంటూరు ప్రజలందరికీ తెలుసు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రాము ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం సిగ్గుచేటు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీబీఐకి లేఖ రాయడంపై ఆ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము భగ్గుమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు పట్టుకుని మీడియా ముందు కనీస పరిజ్ఞానం లేకుండా కన్నా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని, చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టాడో ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా గుర్తుందన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం తన రాజకీయ స్వలాభం కోసం టీడీపీలో చేరిన కన్నాకు, ఆయన్ను చేర్చుకున్న చంద్రబాబుకు సిగ్గులేదన్నారు. నిరూపించకలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా..? తమ బ్యాంక్ పరిధిలో నకిలీ పాసు పుస్తకాలతో రూ.13 కోట్ల సొమ్ము స్వాహా జరిగిన మాట నిజమేనని.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే కాక తమ హయాంలో జరిగిన వాటిపైనా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తమ బ్యాంకులో జరిగిన అవినీతి గుట్టును తామే స్వయంగా వెలికి తీసి అందుకు బాధ్యులైన వారిపై నిజాయితీగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం మాది అని ఆయన సగర్వంగా ప్రకటించారు. అందరికీ తెలిసిన ఈ వాస్తవాలు తాజాగా చంద్రబాబు చంకలో దూరిన కన్నాకు తెలియకపోవడం శోచనీయమన్నారు. అవినీతి అంతమే పంతంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేసే నిబద్ధత కలిగినవారిగా, కన్నా డిమాండ్ చేసిన సీబీఐ విచారణకు స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. తాము కూడా కన్నా అవినీతి, అక్రమ సంపాదనపై సీబీఐ విచారణ కోరతామని తెలిపారు. కన్నాకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కూడా దాన్ని స్వాగతించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని కన్నా లక్ష్మీనారాయణ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. ఒక వేళ నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం స్వీకరించాలని కన్నాకు బహిరంగ సవాల్ విసిరారు. ఈ విషయంపై బహిరంగంగా చర్చకు సైతం తాను సిద్ధమని.. కన్నాపై పరువు నష్టం దావా కూడా వేస్తామని ఆయన తేల్చి చెప్పారు. నిజంగా తాను చేసిన ఆరోపణలకు కన్నా కట్టుబడి ఉంటే కనీసం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని.. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోమారు తమ బ్యాంకు గురించి కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గురించి కానీ అవాకులు, చెవాకులు పేలితే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. -
ఆ అక్రమాలన్నీ బాబు హయాంలోనే ‘కన్నా’..
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు ఆస్కారంలేని రీతిలో సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ స్పష్టంచేశారు. సహకార రంగంలో రూ.5వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ ఇటీవలే టీడీపీ పంచన చేరిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడంలో వాస్తవంలేదన్నారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో సవాల్ చేశారు. అందులో ఝాన్సీ ఏం పేర్కొన్నారంటే... ♦ చంద్రబాబు ప్రాపకం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదు. కాకినాడ డీసీసీబీ పరిధిలోని గండేపల్లి సొసైటీలో రైతుల పేరిటే రూ.22 కోట్ల బినామీ రుణాలు తీసుకుని దారిమళ్లించారు. ఇదంతా 2017–18, 2018–19లలో అప్పటి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి చేశారు. ఈ అక్రమాలు వెలికితీసింది మా ప్రభుత్వ హయాంలోనే. సొసైటీలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణతో పాటు బాధ్యులైన బ్యాంకు సిబ్బందిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడమేకాక అప్పటి గండేపల్లి మేనేజర్ ఎ.గణపతి, ఆర్.శ్యామలను సస్పెండ్ చేశాం. ♦ కృష్ణా డీసీసీబీ పరిధిలోని పెడన సొసైటీలో ఒక మహిళ 1.80 ఎకరాల వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాల భూమిగా చూపి 2018–19లో రుణం తీసుకోగా, వడ్డీతో సహా రుణ మొత్తాన్ని రాబట్టేందుకు లీగల్‌గా అన్ని చర్యలు తీసుకున్నాం. ♦ విశాఖపట్నం డీసీసీబీకి చెందిన రూ.4 కోట్లు సిక్కిం బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఆ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3 కోట్లు రాబట్టాం. మిగిలిన మొత్తం కోసం బ్యాంకు హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది. ♦ ఇక గుంటూరు డీసీసీబీలో రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందంటూ మాజీమంత్రి ‘కన్నా’ చేసిన ఆరోపణలో పసలేదు. ఈ బ్యాంకులో డ్వాక్రా సంఘాలకు ఇచి్చన రూ.600 కోట్ల రుణాలలో రూ.470 కోట్లు ఔట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. అలాంటప్పుడు రూ.500 కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలి. ♦ వినుకొండ బ్రాంచిలో డ్వాక్రా రుణాలు రూ.1.40 కోట్లు దుర్వినియోగం కాగా.. యానిమేటర్‌గా ఉన్న తన తల్లి, మేనమామతో కలిసి బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించాం. పక్కదారి పట్టిన రూ.1.40 కోట్లు తిరిగి బ్యాంకుకి కట్టించడమే కాక విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న మేనేజర్ని సస్పెండ్ చేశాం. ♦ ఏలూరు డీసీసీబీ పరిధిలో టీ.నరసాపురం, చింతలపూడి, కామవరపుకోట, రంగాపురం, సరిపల్లి సొసైటీల్లో నిధులు మళ్లినట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఇప్పటికే చింతలపూడి సొసైటీ సెక్రటరీతో పాటు సొసైటీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేశాం. ♦ వైఎస్సార్ జిల్లా డీసీసీబీలో ఎలాంటిæ అవినీతి జరగలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.20 కోట్ల వరకు పేరుకుపోయిన నష్టాలు (ఎక్యుమలేటెడ్ లాసెస్) ఉన్న బ్యాంకును రూ.20 కోట్ల లాభాలను ఆర్జించే స్థాయికి తీసుకొచ్చాం. ఇలా.. ఈ నాలుగేళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని అణిచివేస్తూ పారదర్శకంగా రైతులకు సేవలందిస్తున్నాం. సహకార రంగానికి జవసత్వాలు కలి్పంచేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.298 కోట్లు కేటాయించారు. -
‘కన్నా నీ చరిత్ర నాకు తెలుసు.. దమ్ముంటే చర్చకు రావాలి’
సాక్షి, గుంటూరు: జీడీసీసీ బ్యాంకు, ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు అన్నారు. బ్యాంకులో రూ.500కోట్ల కుంభకోణం జరిగిందని కన్నా చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే కుంభకోణం జరిగిందని నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా, బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణం జరిగిందని కన్నా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. లేకపోతే కన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ నిజాయితీపరుడో లేక నేను నిజాయితీపరుడినో చర్చికుందాం చర్చకు రావాలి. కన్నా నీ చరిత్ర అంతా నాకు తెలుసు. 90 గజాల రేకుల షెడ్డు నుంచి రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పు. రైతులను మోసం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దొంగతనం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. కన్నాకు దమ్మంటే రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దూళిపాళ్ల నరేంద్ర నుంచి రైతులకు ఇప్పించాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు..: కాపు మహిళా నేతలు -
టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా ఇష్టపడే వస్తున్నారా?
సత్తెనపల్లి: సత్తెనపల్లి టీడీపీలో ముసలం మరింత ముదరనుందా? ఇప్పటి వరకు సీటు తమదంటే తమదంటూ పావులు కదిపిన నేతలు.. ఇకపై తమ అసమ్మతి గళం వినిపించనున్నారా ? ఇప్పటికే ప్రజల్లో మెండైన సానుకూలతతో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణ ఇష్టపడే వస్తున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లోనా! అనేది స్పష్టత కొరవడింది. పెదకూరపాడు కాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కానీ కన్నా ఆశించారనేది సన్నిహితుల మాట. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ సీపీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళుతోంది. అదే సమయంలో మహానాడు ద్వారా పార్టీకి ఉత్సాహాన్ని తీసుకొద్దామనుకున్న చంద్రబాబు.. కాపీ మేనిఫెస్టోతో బొక్కబోర్లా పడ్డారు. ఈ క్రమంలో పార్టీలో చేరిన మూడు నెలల తర్వాత సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మార్పుపై పార్టీలో భిన్నమైన టాక్ వినిపిస్తోంది. నాలుగు స్తంభాలాట గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయన అకాల మరణంతో ఇన్చార్జి బాధ్యతలను అధిష్టానం ఎవరికీ అప్పగించలేదు. కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి), మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో మూడు గ్రూపులుగా విడిపోయారు. ఈ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నట్టు ఆ పార్టీ అధిష్టానం తాజాగా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివరామ్, మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆందోళనలో ఉన్నారు. దీనివల్ల గ్రూపు విభేదాలు, అసంతృప్తులు మరింత పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కన్నాకు కాపు కాసేది లేదు... తొలి నుంచి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989, 1994, 1999, 2004లలో పెదకూరపాడు నుంచి గెలిచారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో కన్నా గురి కూడా పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలపైనే ఉందని ఆయన సన్నిహితుల మాట. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అంబటి రాంబాబు తొలి నుంచి కాపులతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలుస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి ఓటమిపాలైన నిమ్మకాయల రాజనారాయణ యాదవ్, ఆయనపై గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి (2004లోనూ గెలుపొందారు), కాపు సంఘ నేత పక్కాల సూరిబాబు వైఎస్సార్ సీపీలో చేరడంతో అధికారపార్టీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా ఉండేందుకు కన్నా కూడా విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలో టీడీపీకి నాలుగో కృష్ణుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇన్చార్జిగా బాధ్యతల అప్పగింత ఇప్పటికే వర్గపోరు పార్టీ శ్రేణుల్లో నిస్తేజం తాజాగా నాలుగు స్తంభాలాటకు అధిష్టానం ఆజ్యం కన్నాకు సత్తెనపల్లికి రావడం ఇష్టం లేదని టాక్ -
సీనియర్‌కు షాకిచ్చిన టీడీపీ లీడర్లు.. చంద్రబాబుకు వార్నింగ్!
ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే. ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకునే మరో నేత పంచన ఈ మధ్యే చేరారు. పచ్చ గూటిలో చేరగానే ఆ సీటు నాదే అంటూ ఖర్చీఫ్ వేసేశారు. అయితే అప్పటికే అక్కడున్న వాళ్ళు అధినేతకే వార్నింగ్ ఇచ్చారు. ఏమైందో ఏమో.. చంద్రబాబు ఆ నియోజకవర్గానికి వచ్చినపుడు కొత్తగా వచ్చిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ కనిపించలేదు. ఆ సంగతేంటో చూద్దాం.. ఒకప్పుడు ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్ని శాసించారు. మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని నిర్ధారించుకుని కాషాయ తీర్థం తీసుకున్నారు. అక్కడా ఇమడలేక ఈ మధ్యనే తెలుగుదేశం గూటికి చేరారు కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీలో చేరిన వెంటనే జిల్లా రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కావాలనే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ నేతలందరికీ పార్టీ ఇచ్చారు. గుంటూరు సిటీలో వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. అయితే ఆయన సొంత నియోజకవర్గం అయిన సత్తెనపల్లిపైనే కన్నా ఫోకస్ పెట్టారు. తరచు సత్తెనపల్లి వెళ్ళడం, అక్కడి నేతలతో సమావేశం కావడాన్ని అప్పటికే అక్కడ కుమ్ములాడుకుంటున్న నియోజకవర్గ నేతలు గమనించి అలర్ట్ అయ్యారు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు. కోడెల కుమారుడు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. తాజాగా మూడో కృష్ణుడు రావడంతో పాత నేతలిద్దరూ అలర్ట్ అయ్యారు. కన్నా సత్తెనపల్లి నుంచే పోటీ చేయబోతున్నారని, చంద్రబాబు తన పర్యటనలో ఈ విషయం స్పష్టం చేస్తారని ఆయన అనుచరులు నియోజకవర్గంలో హడావుడి చేయడం ఆరంభించారు. దీంతో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు మూడో కృష్ణుడికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. సత్తెనపల్లి సభలో కన్నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ఆయన అనుచరులు డప్పు కొట్టినా అక్కడ మాత్రం పూర్తి రివర్స్‌లో జరిగింది. సత్తెనపల్లికి ముందు చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించినపుడు కన్నా లక్ష్మీనారాయణ అధినేత పక్కనే ఉన్నారు. కాని సత్తెనపల్లి రోడ్‌షోలో కాని.. సభలో కాని కన్నా కనిపించలేదు. ఆ పరిసరాల్లో ఎక్కడా ఆయన జాడే లేదు. సత్తెనపల్లి సభలో చంద్రబాబుకు ఇరువైపులా కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు దర్శనమిచ్చారు. కన్నాకు సీటు ప్రకటిస్తారనని అందరూ భావిస్తే ఆయనకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం, సభలో ప్రచార రథం కింద నిలబడి ఉండటం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. సత్తెనపల్లి రోడ్‌షో, సభలో చంద్రబాబు పక్కన కన్నా లేకపోవడానికి కోడెల శివరాం, వైవీ ఆంజనేయులే కారణమని వారిద్దరి వర్గీయులు చెబుతున్నారు. నాలుగేళ్లనుంచి పార్టీని మోస్తున్న తమను పక్కకు నెట్టి.. కొత్తగా వచ్చిన కన్నాకు సీటు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని చంద్రబాబుకే నేరుగా చెప్పినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ వల్లనే చంద్రబాబు పక్కన కన్నాకు చోటు దొరకలేదని చెప్పుకుంటున్నారు. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ దక్కించుకుంటామే గాని.. కన్నాకు మాత్రం ఛాన్స్ ఇచ్చేది లేదని ఇప్పుడు వైరి వర్గాలు రెండూ ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే కన్నా వర్గీయులు మాత్రం కోడెల, వైవీ వర్గీయుల ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. చంద్రబాబు సత్తెనపల్లి పర్యటన మొత్తం కన్నా డైరెక్షన్లోనే జరిగిందంటున్నారు. మంచి రోజులు కాకపోవడంతో కన్నా సత్తెనపల్లిలో చంద్రబాబు వాహనం ఎక్కలేదని చెబుతున్నారు. త్వరలో పార్టీ అధినేతే కన్నా పేరు ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సత్తెనపల్లికి చంద్రబాబు వచ్చినపుడు అనుకున్నదొకటైతే.. జరిగింది మరొకటి. ఇక ముందు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ -
టీడీపీ మెప్పు కోసం కన్నా విమర్శలు చేస్తున్నారు: గుంటూరు మేయర్
-
బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా?
అద్దెకు వచ్చినవారు ఎప్పుడూ అదే అద్దె ఇంటిలో ఉంటారా? రాజకీయాలలో కూడా ఇలాగే అద్దె ఇళ్ల మాదిరి కొన్ని పార్టీలు ఉపయోగపడుతుంటాయి. బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అలాగే ఆ పార్టీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఆయన కూడా కాంగ్రెస్‌లో ఉంటూ గ్రూపులు మార్చడంలో కాని, ఆ తర్వాత పార్టీలు మార్చడంలో కాని ఆరితేరినవారే. తన అవసరార్ధం కన్నా బీజేపీలో చేరారు. ఆయనేదో రాష్ట్రం అంతటిని, కనీసం కాపు సామాజికవర్గంలో అయినా ప్రభావితం చేస్తారేమోనని ఆశపడి బీజేపీ భంగపడింది. చివరికి ఆయన తన దారి తాను చూసుకున్నారు. పోతూ, పోతూ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై, పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులపై నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. బీజేపీ అర్డెంట్‌గా జనసేనతో పాటు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన మనసులో మాట కావచ్చు. కాని అందుకు పార్టీ అధిష్టానం ఇష్టపడడం లేదు. బీజేపీని దారుణంగా మోసం చేసి, అవమానించిన చంద్రబాబుతో జతకట్టడానికి అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు ససేమిరా అంటున్నారు. మరోసారి ఎలాగోలా ఎమ్మెల్యేగా అయినా గెలవాలని తాపత్రయపడుతున్న కన్నా లక్ష్మీనారాయణ ,ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొత్త కూటమి ఏర్పడితే కాని అది సాధ్యం కాదని భావిస్తుండవచ్చు. కాకపోతే ఆ మాట చెప్పకుండా, బీజేపీ ఏదో అన్యాయం చేసినట్లు, తన వర్గంవారిని పదవుల నుంచి తొలగించడంపైన ఏవేవో ఆరోపణలు చేశారు. అది వేరే విషయం. కన్నా చరిత్ర చూస్తే ఒకరకంగా అదృష్టవంతుడే అని చెప్పాలి. గతంలో కావూరి సాంబశివరావు, ఎన్.జి.రంగా వంటివారి ద్వారా తొలిసారి పెదకూరపాడు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ పొందారు. అప్పట్లో ఆయన నేదురుమల్లి జనార్దనరెడ్డి వర్గానికి సన్నిహితం అయ్యారు. తొలుత చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. కాని నేదురుమల్లి మంత్రివర్గంలో స్థానం పొందారు. మొదటిసారే శాసనసభకు ఎన్నికైనా ఆయనకు ఈ అవకాశం రావడం అదృష్టమే. ఆ తర్వాత నేదురుమల్లి కోటాలో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో కూడా కొనసాగారు. 1994,99, 2004 లలో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఆయనకు పడేది కాదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. కాని 2004 నాటికి వైఎస్ వర్గానికి దగ్గరయ్యారు. వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రి పదవి పొందారు. 2009లో నియోజకవర్గాల డిలిమిటేషన్ కారణంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారి మళ్లీ గెలిచారు. అప్పటికే సీనియర్ నేతగా గుర్తింపు పొంది తిరిగి వైఎస్ మంత్రివర్గంలో తన బెర్త్ తాను పొందారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన మళ్లీ గ్రూపు మార్చుకున్నారు. రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు రోశయ్యకు, కన్నాకు గుంటూరు రాజకీయాలలో పడేది కాదు. అది వేరే అంశం. రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్ష రేసులోకి వచ్చారు. సీఎం సీటుకు కూడా పోటీపడాలని ప్రయత్నించారు. కాని అవి దక్కలేదు. 2014లో ఆయన కాంగ్రెస్‌లోనే పోటీచేసి ఓడిపోయారు. గుంటూరు రాజకీయాలలో కన్నాకు పెద్ద ప్రత్యర్దిగా ఉన్న రాయపాటి సాంబశివరావు అప్పటికే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారి ఎంపిగా గెలిచారు. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉండడంతో రాయపాటి కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని తన పలుకుబడి ఉపయోగించి ఎక్కడ తనను ఇబ్బంది పెడతారోనని సందేహించారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏమి చేయాలా అన్నదానిపై ఆలోచించి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి రావడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఇందుకు సంబంధించి ప్లెక్సీలు కూడా వెలిశాయి. కాని సడన్‌గా అమిత్ షా పోన్ చేసి బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. వారి మధ్య అప్పుడు ఏమి జరిగిందో కాని, ఆయన వైసీపీలోకి వచ్చే ఆలోచన విరమించుకుని సాకు కోసం ఆస్పత్రిలో చేరారు. బీజేపీలోకి వెళితే సేఫ్ అని ఆయన నమ్మారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, కన్నాకు మధ్య ఉప్పు, నిప్పుగా పరిస్థితి ఉండేది. కన్నా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వంగవీటి రంగాతో పాటు తనను కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కన్నా బీజేపీలో చేరితే అక్కడ జాక్ పాట్ తగిలినట్లుగా ఆయన బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. దాంతో రాష్ట్ర స్థాయి ఎలివేషన్ బాగా వచ్చింది. 2019 లో నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట వైసీపీకి చెందిన కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలే మెయిన్ టెయిన్ చేసినట్లు చెబుతారు. కాని తాను కోరిన కొన్ని పనులు జరగడం లేదని అసంతృప్తి ఉండేదట. దాంతో ఆయన క్రమంగా వైసీపీకి దూరంగా ఉండడం ఆరంభించారు. అంతలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లును తీసుకు రావడం, అమరావతి పేరుతో ఒక కృత్రిమ ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహించడం వంటి ఘట్టాలు జరిగాయి. ఈ అమరావతి వ్యవహారంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త దగ్గరయ్యారు. తిరుపతిలో జరిగిన ఒక సభలో చంద్రబాబుతో కలిసి చేతులు ఎత్తారు. ఇది ఒకరకంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గతంలో శాసనసభలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ఇలా కలుస్తారని ఊహించగలరా? అంతేకాదు.. గతంలో టీడీపీలో ఉండి, తదుపరి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో ఈయన సన్నిహితంగా కనిపించేవారు. అమరావతిలో ఏమైనా ప్రయోజనమో, లేక రాజకీయ బందమో తెలియదు కాని టీడీపీతో దగ్గరవుతున్న సంకేతాలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే 2019లో పార్టీ పంపించిన డబ్బు పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బీజేపీ అధినాయకత్వానికి కన్నా పై క్రమేపి విశ్వాసం తగ్గింది. ఆ క్రమంలో ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినా, అది పెద్ద విషయం ఏమీ కాదనే చెప్పాలి. అయినా కన్నా బీజేపీపై కన్నా, పక్కచూపులే ఎక్కువగా చూస్తున్నారన్న ప్రచారం జరిగేది. దానికితోడు కన్నా తనతో పాటు జిల్లాల పార్టీ అధ్యక్షులు కొందరు తనకు సన్నిహితులైనవారిని కూడా బీజేపీ నుంచి బయటకు తీసుకువెళతారమోనన్న అనుమానంతో కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వారిని తొలగించారు. అది కన్నాకు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈలోగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈయనను కలిసి రాజకీయాలు చర్చించారు. జనసేనలోకి వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేయాలని కన్నా భావించారు కాని, పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి వెనుకాడారట. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతను జనసేనలో చేర్చుకుంటే ఇబ్బంది వస్తుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నా బహుశా టీడీపీలో చేరడానికి మానసికంగా సన్నద్దమయ్యే బీజేపీని వీడారని భావిస్తున్నారు. కన్నా అనుచరులు టీడీపీలోకి వెళదామని సూచించారట. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లవద్దని చెప్పారట. మరి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ఇలా తన పార్టీలోకి వద్దామనుకున్నవారిని చేర్చుకుంటే ఎలా ఫీల్ అవుతారో తెలియదు. జనసేన కార్యకర్తలనే తీవ్రంగా అవమానించిన నటుడు బాలకృష్ణ ఎదుట కూర్చున్న వ్యక్తికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చేమో!. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా దూషించిన కన్నా ఇప్పుడు ఆయనలో తన భవిష్యత్తు చూసుకుంటున్నారట దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి మరోసారి నిర్దారణ అవుతుంది. దీని వల్ల కన్నా లక్ష్మీనారాయణకు గౌరవం పెరుగుతుందని చెప్పలేకపోయినా, ఎన్నికల ఫలితాన్ని బట్టి చూసుకోవచ్చులే అని ఆయన సరిపెట్టుకుని ఉంటారు.అందుకే కన్నా అద్దె ఇంటి వంటి బీజేపీని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. కాకపోతే కన్నాకు కొత్త ఇంటి కోసం వెదుకుతూ చివరికి తన ఒకప్పటి రాజకీయ శత్రువు ఇల్లే శరణ్యం అవడమే ఆయన దయనీయ స్థితికి అద్దం పడుతోందని అనుకోవచ్చు! - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా
ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా -
మాటకు మాట
-
Kanna Lakshminarayana vs GVL Narasimha Rao: మాటకు మాట
-
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్
-
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. జీవీఎల్ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు. కన్నాకు బీజేపీ సముచిత స్థానం కల్పిందన్నారు. సోము వీర్రాజుపై ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘అధిష్టానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడుస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఎంపీగా నా బాధ్యతకు లోబడే నేను పని చేశా’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. కాగా, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించిన కన్నా.. సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయని, సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయని ఫైర్ అయ్యారు. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్‌పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం -
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా
సాక్షి, గుంటూరు: ఏపీలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించారు. కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయి. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్‌పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. కాగా, గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. సోము వల్లే పార్టీ ఎదగడం లేదని విమర్శించారు. తన వర్గానికి చెందినవారికి పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని గతంలో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కన్నా ధిక్కార స్వరం దేనికి సంకేతం..?
-
పరువు నష్టం కేసులో రాయపాటి, కన్నా రాజీ
గుంటూరు లీగల్: పరువు నష్టం కేసులో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావులు రాజీ అయ్యారు. మంగళవారం నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇందుకు వేదికైంది. 2010లో రాయపాటి సాంబశివరావు పలు ఆరోపణలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణను విమర్శించారు. అవి తన పరువుకు నష్టం కలిగించాయంటూ కన్నా కోర్టులో పరువు నష్టం దావా చేశారు. పరిహారంగా రూ.కోటి చెల్లించడంతోపాటు భవిష్యత్‌లో మళ్లీ ఏవిధమైన ఆరోపణలు చేయకుండా ఉండేలా పర్మినెంట్ ఇంజెంక్షన్ ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. ఇప్పటికే కన్నా తరఫున సాక్ష్యాలు కోర్టుకు సమర్పించగా.. ప్రస్తుతం రాయపాటి తరఫున సాక్ష్యాలు సమర్పించే దశలో కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్జి ఇరు పార్టీలను మంగళవారం కోర్టుకు పిలిపించి, వారి న్యాయవాదుల సమక్షంలో రాజీ చర్చలు జరిపారు. తాను చేసిన ఆరోపణలను ఉపసహరించుకుంటున్నట్టు రాయపాటి చెప్పగా, దానికి కన్నా అంగీకరించారు. ఇరువర్గాల వారు స్నేహ పూర్వకంగా కేసు రాజీ పడేందుకు అంగీకరించి కోర్టులో ఉమ్మడి మెమో దాఖలు చేశారు. దీంతో కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
సోము వీర్రాజు.. కన్నాలా వ్యవహరించకు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ లేదు.. మతం గురించి మాట్లాడే సోము వీర్రాజు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడరు అంటూ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బీజేపీలో రెండు వర్గాలు ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాగా.. మరొకటి టీడీపీ బీజేపీ అంటూ ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రముఖులు విశాఖలో సమావేశం కావడం సంతోషకరమైన విషయంగా భావించాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని ఆశించాం. కానీ మూస ధోరణిలో మతం గురించి చర్చించారు. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు రథయాత్ర చేస్తామన్నారు.. అది ఎందు కోసం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై ప్రజలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ ఎందుకు ఇప్పటి వరకు విచారణ ప్రారంభించ లేదు’ అన్నారు ‘ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు.. మరొకరు చంద్రబాబు నాయుడు పంపిన బీజేపీ నాయకులు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబు అజెండా చదివి పదవి కోల్పోయారు. ఇప్పుడు బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల వలలలో మీరు పడొద్దు. రాముడు అందరి దేవుడు. ఆయనని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. గతంలో అద్వానీ ప్రతి పక్షంలో రథయాత్ర చేస్తే అందరూ సహకరించారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉండగా రథయాత్ర ఎందుకోసం చేయాలి. మీరు పద్దేనిమిది నెలల్లో ఏపీ కోసం కేంద్రం నుంచి ఏం ప్రాజెక్టులు తీసుకువచ్చారో.. రథయాత్ర ప్రారంభించడానికి ముందు ఆలోచించండి. మేనిఫెస్టో అంశాలపై ఆత్మ విమర్శ చేసుకోండి’ అన్నారు. (చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!) ‘సీఎం జగన్ పాలనలో దేవాలయాల విషయంపై రాజీ పడే పరిస్థితి లేదు. నిందితులపై చర్యలు కఠినంగా వుంటాయి. చంద్రబాబు హయాంలో దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మీరు గుర్తించరా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్న విషయం గమనించండి’ అని కోరారు. -
రాజధానిపై బీజేపీది ఆరు నాలుకల ధోరణి
తాడికొండ: రాజధాని అంశంపై బీజేపీది ఆరు నాల్కల ధోరణి అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గతంలో బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ మాటేమిటని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 76వ రోజు దీక్షలో పలువురు దళిత సంఘాల నాయకులు ప్రసంగించారు. రాజధాని అంశంపై గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఒకటి మాట్లాడితే, ఇప్పుడు సోము వీర్రాజు ఇంకొకటి మాట్లాడుతున్నాడని, ఇదివరకే జీవీఎల్ నరసింహారావు ఒకటి మాట్లాడగా, కేంద్ర ప్రభుత్వం కోర్టుకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని అఫిడవిట్ సమర్పించిందని గుర్తు చేశారు. రాజధానికి వచ్చిన సోము వీర్రాజు 76 రోజులుగా పోరాటం చేస్తున్న పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలపై మాట్లాడకుండా రాజధాని రైతుల కోసం ప్రేమ ఒలకబోయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజధాని పేదలకు రావాల్సిన 50 వేల ఇళ్ల స్థలాలు, మూడు రాజధానుల కోసం చేస్తున్న దీక్షలు జయప్రదం కావాలని కోరుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాంతిహోమం నిర్వహించారు. పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల బిల్లులను ఆమోదించవద్దంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ‘కన్నా’ రాసిన లేఖపై పార్టీ ముఖ్యులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా, తెలుగుదేశం పార్టీ లైన్లో ఈ లేఖ ఉందని.. ఇది రాసేటప్పుడు ఎవ్వరినీ కూడా సంప్రదించలేదని ఇద్దరు ముఖ్యనేతలు ‘కన్నా’ వద్ద తీవ్ర అభ్యంతరం చేసినట్లు సమాచారం. టీడీపీ నేతలు లేఖ రాసిన కొద్దిసేపటికే ‘కన్నా’ కూడా రాయడం ఏమిటని ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని కేంద్రంలో పార్టీ ముఖ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు దీనిపై ఆరా తీసినట్లు తెలిసింది. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి భిన్నంగా ‘కన్నా’ లేఖ ఉందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. బిజినెస్ రూల్స్ ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సాధారణంగా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుందని.. కానీ, ‘కన్నా’ లేఖవల్ల పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు ముఖ్యనేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. కన్నా లేఖపై అవసరమైతే కేంద్ర పార్టీ పెద్దలు గవర్నర్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఉందని ఒక ముఖ్యనేత చెప్పారు. -
పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా?
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ' ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?' అంటూ ఎద్దేవా చేశారు. -
కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి
-
‘కన్నా’ కోడలు అనుమానాస్పద మృతి
హైదరాబాద్/రైలుపేట (గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య నల్లపు రెడ్డి సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్‌లోని విల్లా నంబర్–28లో అద్దెకుండే పవన్ రెడ్డి ఇంట్లో విందు చేసుకుంటున్న సమయంలో డ్యాన్స్ చేస్తూ ఆమె స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. రాయదుర్గం సీఐ ఎస్.రవీందర్ కథనం ప్రకారం.. సుహారికకు ఫణీంద్రతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గచ్చిబౌలిలోని హిల్రిడ్జ్ విల్లా నంబర్ 11లో ఉంటున్నారు. సుహారిక తల్లి మల్లిసాగరిక కూడా వీరితో ఉంటున్నారు. ఫణీంద్ర, సుహారికలకు సంతానంలేదు. కాగా, సుహారిక చెల్లి నిహారిక భర్త ప్రవీణ్‌రెడ్డికి బంజారాహిల్స్‌కు చెందిన వివేక్, విహాస్, పవన్‌రెడ్డిలు స్నేహితులు. వీరంతా తరచూ పార్టీలు చేసుకుంటారు. విందులో డ్యాన్స్ చేస్తూ.. కాగా, గురువారం ఉ.7.30 గంటలకు వీరంతా పవన్‌రెడ్డి ఇంట్లో పార్టీ ప్లాన్ చేసుకున్నారు. సుహారిక భర్త ఫణీంద్రకు వీలుపడక సుహారిక మాత్రమే పార్టీకి వెళ్లారు. అప్పటి నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు విరామం లేకుండా డ్యాన్స్ చేయడంతో సుహారిక స్పృహ తప్పి పడిపోయారు. అక్కడికి సమీపంలో ఏఐజీ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. అరగంట పాటు వైద్యులు చికిత్స అందించినా ఆమె స్పందించకపోవడంతో చివరికి చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే, సా.5.30 గంటల ప్రాంతంలో రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వైద్యులతో మాట్లాడారు. అంతేకాక.. విందులో పాల్గొన్న వారందరినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమార్తె మృతిపై అనుమానం లేదని సుహారిక తల్లి మల్లిసాగరిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్యాన్స్ చేయడంవల్లే స్పృహ తప్పి పడిపోయారని, ఆమె మరణంపై ఏ అనుమానాలు లేవని భర్త ఫణీంద్ర కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయి ఉండొచ్చని తెలిపారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే సుహారిక మృతికి అసలు కారణాలు తెలుస్తాయని సీఐ ఎస్.రవీందర్ తెలిపారు. ఆమె మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నేడు ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు పంపనున్నారు. అయితే, సుహారిక మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. అంత ఉదయం ఎందుకు పార్టీ చేసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కన్నా లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. -
అప్పుడు కన్నా ఎందుకు మాట్లాడలేదు?
సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోతే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 40 దేవాలయాలు కూల్చేసినపుడు కూడా కన్నా మాట్లాడలేదని, బాబు ఇచ్చిన డబ్బులకి అమ్ముడు పోయి మౌనంగా ఉండిపోయారన్నారు. బుధవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ ఆస్తులని అమ్మాలని సంతకాలు కూడా చేశారు. భాను ప్రకాష్ రెడ్డి విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదు. అప్పట్లో నేను బీజేపీలో ఉండి దేవాలయాలు పడగొట్టే అంశాన్ని అడ్డుకుంటే నన్ను అరెస్ట్ చేశారు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. ( ‘ఆనాడు భూముల విక్రయ కమిటీలో బీజేపీ వారు లేరా) మీరు అమ్మాలనుకున్న ఆస్తులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపితే నిరాహార దీక్ష చేస్తారా? దేవాలయాల డబ్బులు తీసుకుని వెళ్లి ఇమామ్‌లకి, పాస్టర్లలకి ఇస్తున్నారన్న దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. టీటీడీ ఆస్తుల గురించి ఫిబ్రవరిలో చర్చించాం అంతే. డబ్బులకి అమ్ముడు పోయి ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని మీరిలా మాట్లాడటం సబబు కాదు. పవన్ కళ్యాణ్ బూట్లు వేసుకుని పూజలు చేస్తారు, చేతిలో దేవుడి పటం ఉంటుంది. వీళ్ళు కూడా టీటీడీ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం') భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వండి: మల్లాది విజయవాడ : టీటీడీ ఆస్తుల అమ్మకం సమయంలో టీడీపీతో జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని, అప్పుడు వారెవరూ దీని గురించి నోరు విప్పలేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న సమయంలో బీజేపీలో ఉన్నారని తెలిపారు. భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. జనసేనలో ఉన్న నాగబాబు గాడ్సేని భుజాన వేసుకుని మాట్లాడారని, ఆయనకి దేవాలయాల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. -
డబ్బులకి అమ్ముడు పోయి మౌనంగా ఉండిపోయారు..