
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాజధాని పేరుతో బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ కూడా రాష్ట్ర ఖజానాను దోచేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు డబ్బులు లేవంటునే విలాసాలు చేస్తూ రూ. 1.30 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. రాజధాని పేరుతో బలవంతంగా 33వేల ఎకరాలు లాక్కొన్న చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment