సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు ఆస్కారంలేని రీతిలో సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్కాబ్ చైర్‌పర్సన్ మల్లెల ఝాన్సీ స్పష్టంచేశారు. సహకార రంగంలో రూ.5వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ ఇటీవలే టీడీపీ పంచన చేరిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడంలో వాస్తవంలేదన్నారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో సవాల్ చేశారు. అందులో ఝాన్సీ ఏం పేర్కొన్నారంటే...
♦ చంద్రబాబు ప్రాపకం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదు. కాకినాడ డీసీసీబీ పరిధిలోని గండేపల్లి సొసైటీలో రైతుల పేరిటే రూ.22 కోట్ల బినామీ రుణాలు తీసుకుని దారిమళ్లించారు. ఇదంతా 2017–18, 2018–19లలో అప్పటి
సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి చేశారు. ఈ అక్రమాలు వెలికితీసింది మా ప్రభుత్వ హయాంలోనే. సొసైటీలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణతో పాటు బాధ్యులైన బ్యాంకు సిబ్బందిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడమేకాక అప్పటి గండేపల్లి మేనేజర్ ఎ.గణపతి, ఆర్.శ్యామలను సస్పెండ్ చేశాం.
♦ కృష్ణా డీసీసీబీ పరిధిలోని పెడన సొసైటీలో ఒక మహిళ 1.80 ఎకరాల వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాల భూమిగా చూపి 2018–19లో రుణం తీసుకోగా, వడ్డీతో సహా రుణ మొత్తాన్ని రాబట్టేందుకు లీగల్‌గా అన్ని చర్యలు తీసుకున్నాం.
♦ విశాఖపట్నం డీసీసీబీకి చెందిన రూ.4 కోట్లు సిక్కిం బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఆ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3 కోట్లు రాబట్టాం. మిగిలిన మొత్తం కోసం
బ్యాంకు హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది.
♦ ఇక గుంటూరు డీసీసీబీలో రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందంటూ మాజీమంత్రి ‘కన్నా’ చేసిన ఆరోపణలో పసలేదు. ఈ బ్యాంకులో డ్వాక్రా సంఘాలకు ఇచి్చన రూ.600 కోట్ల రుణాలలో రూ.470 కోట్లు ఔట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. అలాంటప్పుడు రూ.500 కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలి.
♦ వినుకొండ బ్రాంచిలో డ్వాక్రా రుణాలు రూ.1.40 కోట్లు దుర్వినియోగం కాగా.. యానిమేటర్‌గా ఉన్న తన తల్లి, మేనమామతో కలిసి బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఈ అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించాం. పక్కదారి పట్టిన రూ.1.40 కోట్లు తిరిగి బ్యాంకుకి కట్టించడమే కాక విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న మేనేజర్‌ని సస్పెండ్ చేశాం.
♦ ఏలూరు డీసీసీబీ పరిధిలో టీ.నరసాపురం, చింతలపూడి, కామవరపుకోట, రంగాపురం, సరిపల్లి సొసైటీల్లో నిధులు మళ్లినట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఇప్పటికే చింతలపూడి సొసైటీ సెక్రటరీతో పాటు సొసైటీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేశాం.
♦ వైఎస్సార్ జిల్లా డీసీసీబీలో ఎలాంటిæ అవినీతి జరగలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.20 కోట్ల వరకు పేరుకుపోయిన నష్టాలు (ఎక్యుమలేటెడ్ లాసెస్) ఉన్న బ్యాంకును రూ.20 కోట్ల లాభాలను ఆర్జించే స్థాయికి తీసుకొచ్చాం. ఇలా.. ఈ నాలుగేళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని అణిచివేస్తూ పారదర్శకంగా రైతులకు సేవలందిస్తున్నాం. సహకార రంగానికి జవసత్వాలు కలి్పంచేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.298 కోట్లు కేటాయించారు.
ఆ అక్రమాలన్నీ బాబు హయాంలోనే ‘కన్నా’..
Published Mon, Jun 19 2023 3:59 AM | Last Updated on Mon, Jun 19 2023 8:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment