
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ' ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?' అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment