
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ని గెలిపిస్తే మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకి తీసుకువెళతారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. ‘‘లీకేష్, పోర్టు ఏమైనా, పకోడి పొట్లం అనుకుంటున్నావా, తెలంగాణకు తీసుకెళ్లడానికి? మీ నాయనతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా నీ తెలివికి జడుసుకుంటున్నారు. రాత్రికి దేవాన్ష్ జాగ్రఫీ పుస్తకంలో మ్యాప్ చూడు.. కేఏ పాల్ ఒక పక్క, నువ్వు ఒక పక్క రాష్ట్రాన్ని భలే తగులుకున్నారు’ అని ట్విట్టర్‌లో కన్నా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment