
కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకుని ఆ డబ్బును మంత్రి లోకేష్‌కు చేరవేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీతాల ఆన్‌లైన్ ప్రక్రియలో రూ.250 కోట్లు అవినీతి జరిగిందని తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. లక్షా 30 వేల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేశారని కన్నా ధ్వజమెత్తారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిట్టి ఇప్పడు వారితోనే పొత్తు పెంటుకుంటారా అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ది పేరుతో సేకరించిన విరాళాలు ఎక్కడికిపోయాయని.. ఎన్జీవోల ఆహ్మానంతో అమెరికా వెళ్లిన చంద్రబాబు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment