సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఆయన...జైట్లీ మరణవార్త వినగానే హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జైట్లీ లేని లోటు దేశానికి తీర్చలేనిది. నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం. అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్నారు. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.’ అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
I am deeply shocked to learn about the demise of Shri Arun Jaitley,a long time dear friend and one of my closest associates. His death is an irreparable loss to the nation and a personal loss to me. I have no words to express my grief.
— VicePresidentOfIndia (@VPSecretariat) August 24, 2019
మరోవైపు జైట్లీ మరణంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నాయకులు తిరుపతిలోని పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ పయనం అయ్యారు.
చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం
Comments
Please login to add a commentAdd a comment