
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో ఐదు ప్రశ్నలు సంధించారు. కన్నా ఇప్పటివరకు చంద్రబాబును వంద ప్రశ్నలు వేశారు. అనంతపురంలో పంట కుంట తవ్వకాల్లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై సీబీఐ విచారణకు సిద్దమా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన చంద్రబాబుపై ప్రశ్నల పరంపర కొనసాగిస్తూ.. ‘‘నెల్లూరు జిల్లాలో సెజ్‌ల పేరుతో భూకేటాయింపులు జరిపి పరిశ్రమలు స్థాపించకపోవటంతో హైకోర్టు చివాట్లు పెట్టడం వాస్తవం కాదా?.
రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న రాయితీలతో రాష్ట్రాన్ని నష్టం కలిగించటం లేదా?. సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందకపోగా నాసిరకం వస్తువులు ఇచ్చి మీ జేబులు నింపుకుంటున్న విషయం నిజం కాదా?. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి మీరు దోచుకుంటున్న మాట వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment