
నిజంగా బలముంటే ఎందుకు ఓడిపోయారు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్వార్థపరులే వివాదాలు సృష్టిస్తున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దుయ్యబట్టారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణకు నిజంగా బలముంటే గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణ మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
కన్నా లక్ష్మీనారాయణ బుధవారం బీజేపీలో చేరారు. ఆయన చేరికతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి బలం పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.