'సీఎం మార్పు ఉండదు, నేను ఆ రేసులో లేను'
'సీఎం మార్పు ఉండదు, నేను ఆ రేసులో లేను'
Published Thu, Nov 14 2013 3:40 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
'రాష్ట్రంలో ఎలాంటి మార్పులు ఉండవు. నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేను. నాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగమే ఈ ఊహాగానాలు' అని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యలు చేశారు. విభజన ప్రక్రియ సులువుగా జరిగేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి కన్నాకు పగ్గాలు అప్పగించనున్నారనే రాజకీయ రూమర్లకు కన్నాతెరదించారు. సీమాంధ్రలో బలమైన కాపు ఓటు బ్యాంక్ కోసం కన్నాకు ముఖ్యమంత్రి పదవిని హైకమాండ్ కట్టబెట్టే అవకాశాలున్నాయని ఇటీవల ఊహాగానాలు వెలువడ్డాయి.
తనను సోనియా ఆహ్వానించలేదని... రాష్ట్రంలోని పరిస్థితులు వివరించడానికే తాను అధినేత్రి అపాయింట్ మెంట్ తీసుకున్నాను అని కన్నా తెలిపారు. రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని తాను కోరాను, కాని విభజనపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు అని సోనియా చెప్పినట్టు కన్నా తెలిపారు. ఇటీవల సోనియాగాంధీతో కన్నా సమావేశమైన సంగతి తెలిసిందే. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement