భారత దేశాన్ని సోనియా ఇటలీగా మార్చారు: కొణతాల
విశాఖపట్నం: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ నిప్పులు చెరిగారు. యూపీఏ ప్రభుత్వ హయంలో కొందరిపై కేసులు పెట్టి, మరికొందర్ని భయపెట్టి ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగిందని కొణతాల అన్నారు. పదేళ్ల యూపీఏ హాయంలో సోనియా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు.
భారత దేశాన్ని సోనియా ఇటలీగా మార్చారని కొణతాల విమర్శించారు. సీఎం హోదాలో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అంగీకరించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, అందుకు సహకరించిన ఇతర పార్టీల నేతలు ఇప్పుడు ఏవిధంగా పార్టీ పెట్టి ప్రజల వద్దకు వస్తారని ఆయన నిలదీశారు. ఎన్ని పార్టీలు వచ్చినా.. మరిన్ని పార్టీలు పెట్టించినా ప్రజలు వైఎస్ జగన్‌నే గెలిపిస్తారని కొణతాల అన్నారు.