Konatala Rama Krishna
-
అధికారముందని మిడిసిపడొద్దు: కొణతాల
సాక్షి, హైదరాబాద్: చేతిలో అధికారముందని ముఖ్యమంత్రి చంద్రబాబు మిడిసి పడుతున్నారని, నియంతలాగా పాలించిన వారు ఎందరో చరిత్రలో కలిసి పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యానికి పాతర వేసి ఆటవిక పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, సీనియర్ నేత అంబటి రాంబాబుపై పట్ట పగలే దాడి చేయడం వంటి సంఘటనలు బీహార్, యూపీ తరహా మాఫియా రాజకీయాలను తలపిస్తున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లాలో శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గ పరిధిలోని మహిళా ఎంపీటీసీల పట్ల టీడీపీ గుండాలు దురుసుగా వ్యవహరించి ఎత్తుకెళ్లారని, రాజకీయాల్లోకి తామెందుకు వచ్చామా అని ఆ మహిళలు బాధపడేలా చంద్రబాబు పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఈ చర్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అడుగడుగునా పోలీసులు, ప్రభుత్వాధికారులు టీడీపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని, వారి సమక్షంలోనే జెడ్పీటీసీలను ఎత్తుకెళ్లడాలు, దౌర్జన్యాలకు దిగడాలు జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులు, అధికారులకు టీడీపీ యూనిఫాంను తొడిగించి పనులు చేయించుకుంటే సరిపోతుందని అన్నారు. -
వైఎస్ స్వర్ణయుగం సాధిద్దాం
జగన్‌తోనే సాధ్యమన్న కొణతాల కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలోకి 400 మంది మాజీ కార్పొరేటర్ పట్నాయక్ ఆధ్వర్యంలో చేరిక విశాఖపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్రానికి మంచి రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంతోనే సాధ్యమని మాజీ మంత్రి, ఆ పార్టీ రాజ కీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. మాజీ కార్పొరేటర్, నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పి.ఎల్.ఎన్.పట్నాయక్ పార్టీలో చేరిన సందర్భంగా తాటిచెట్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ స్వర్ణయుగం రావాలంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని అన్నివర్గాల వారు నమ్ముతున్నారన్నారు. రాష్ట్ర విభజన జరగడానికి చంద్రబాబే కారణమన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. విశిష్ట అతిథి ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ మాట్లాడుతూ సుస్థిర పరిపాలన అందించే సత్తా జగన్ మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. అనకాపల్లి లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే జగన్ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం పి.ఎల్.ఎన్.పట్నాయక్, ఆళ్ల నరసింగరావు, రమేష్‌లకు కొణతాల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి, గండి బాబ్జీ, జి.వి.రవిరాజు, బీసీసెల్ కన్వీనర్ పక్కి దివాకర్, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల బీసీ సెల్ కో-ఆర్డినేటర్ గండ్రెడ్డి రమాదేవి, రవి, స్థానిక నాయకులు ఆళ్ల శ్రీనివాసరావు, సూరాబత్తుల తిరుపతిరావు, చొక్కాకుల రామకృష్ణ, గుడ్ల భాస్కరరెడ్డి, ముత్యం సూర్యారావు, పెదిరెడ్డి వెంకటరావు, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాసరావు, బి.మహేష్, నీలకంఠం, చిన్నలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 400 మంది పార్టీలో చేరిక జీవీఎంసీ 31 నుంచి 35 వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది పి.ఎల్.ఎన్.పట్నాయక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. -
భారత దేశాన్ని సోనియా ఇటలీగా మార్చారు: కొణతాల
విశాఖపట్నం: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ నిప్పులు చెరిగారు. యూపీఏ ప్రభుత్వ హయంలో కొందరిపై కేసులు పెట్టి, మరికొందర్ని భయపెట్టి ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగిందని కొణతాల అన్నారు. పదేళ్ల యూపీఏ హాయంలో సోనియా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. భారత దేశాన్ని సోనియా ఇటలీగా మార్చారని కొణతాల విమర్శించారు. సీఎం హోదాలో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అంగీకరించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, అందుకు సహకరించిన ఇతర పార్టీల నేతలు ఇప్పుడు ఏవిధంగా పార్టీ పెట్టి ప్రజల వద్దకు వస్తారని ఆయన నిలదీశారు. ఎన్ని పార్టీలు వచ్చినా.. మరిన్ని పార్టీలు పెట్టించినా ప్రజలు వైఎస్ జగన్నే గెలిపిస్తారని కొణతాల అన్నారు. -
టి.బిల్లుతో తలవంపులు
ప్రజాస్వామ్య విలువలకు సోనియా తిలోదకాలు మాఫియా పోకడలతో విభజనకు యత్నాలు పార్లమెంటు ఘటనలపై కొణతాల ధ్వజం అనకాపల్లి, న్యూస్‌లైన్ : సోనియాగాంధీ మాఫియా నాయకురాలిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. తె లంగాణ విభజన బిల్లు విషయంలో లోక్‌సభలో జరిగిన ఘటనలను ఉటంకిస్తూ కొణతాల స్థానిక విలేకర్లతో గురువారం మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య విలువలు కలిగిన భారత్ పార్లమెంట్‌ను మరుభూమిగా దిగజార్చిన ఘనత సోనియాదేనని ఎద్దేవా చే శారు. మెజారిటీ లేకపోయినప్పటికీ కక్ష సాధిం పు చర్యలా రాష్ట్రాన్ని విడగొట్టే చర్యలకు పూనుకున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ సైతం తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉందనిపేర్కొన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పందన కలగలేదన్నారు. రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ ఆర్టికల్ 3 పై దేశవ్యాప్త చర్చ జరగాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్ని పార్టీల అగ్రనేతలతో మాట్లాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఊసరవెల్లిలా వ్యవహరిస్తూ రోజుకోమాట మాట్లాడుతున్నారని విమర్శించా రు. గతంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బోర్డులు నియమించాలని కేంద్రం నిర్ణయిస్తే తన పదవికి ఎక్కడ ఎసరు తగులుతుందోనని కిరణ్ ఆ నిర్ణయాలకు అడ్డుపలికారని, దాని ఫలితమే నేటి తెలంగాణ రావణ కాష్టమని వివరించా రు. ఓటాన్ బడ్జెట్ ద్వారా నీటిపారుదల శాఖకు సంబంధించి 23 వేల కోట్ల రూపాయల బిల్లులపై సీఎం సం తకం చేశారని ఆ పార్టీకే చెందిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరో పిస్తున్న సంగతి అందరూ గమనించాలన్నారు. -
ముఖ్యమంత్రి మోసగిస్తున్నారు!: కొణతాల రామకృష్ణ
విభజన విషయంలో ప్రజలను మభ్యపెడుతున్నారు వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ ధ్వజం కిరణ్, చంద్రబాబు విభజనకు కృషి చేస్తున్నారు సీఎం చేయాల్సిందంతాచేసి ఇప్పుడు సదస్సులంటున్నారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి అఫిడవిట్లు ఎందుకివ్వలేదు? రాజీనామాలతో సంక్షోభం సృష్టిస్తే విభజన ఆగిపోయేది సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహరాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. జనవరి 23 తర్వాత మేధోమథన సదస్సు నిర్వహించి సీఎం ఏం చర్చిస్తారని ప్రశ్నించారు. చేయాల్సిదంతా చేసి రాష్ట్రం విడిపోయాక సదస్సులు, చర్చలు నిర్వహించడం కొత్త పార్టీ కోసమేనా? అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు యూపీఏ ప్రభుత్వం తిలోదకాలిస్తోం దని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాకే విభజన ప్రారంభమవుతుందని 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రిగా చిదంబరం చెప్పారు. 2013 జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పడూ ఇదే విషయాన్ని దిగ్విజయ్ స్పష్టంచేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం తర్వాత కూడా అసెంబ్లీకి రెండు పర్యాయాలు బిల్లు వస్తుందని కేంద్రమంత్రులు, సీఎం స్వయంగా తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో సీఎం స్థాయి వ్యక్తి కూడా ప్రజలను నిట్టనిలువునా మోసగిస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంకోసం సభా నిబంధన 77, 78 కింద మా పార్టీ నోటీసులు ఇచ్చినా సభా నాయకుడిగా ఉన్న కిరణ్ ముందుకు రాలేదు. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు కూడా స్పందించలేదు. విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు కూడా వీరిద్దరూ పలాయనం చిత్తగించారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని అనుమానం రాకుండా అమలు చేయడం కోసం వీరిద్దరూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు’’ అని కొణతాల ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు వాటిని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇవ్వాల్సి వస్తోందని ఆగిపోయారా? అసలు మీ వైఖరేంటని నిలదీశారు. సమైక్య తీర్మానం చేసినంత మాత్రాన విభజనను కేంద్రం నిలుపుదల చేస్తుందని తాము చెప్పడంలేదని, అయితే ప్రజల అభిప్రాయాన్ని సభ్యసమాజానికి తెలియజేసే అవకాశం దీని ద్వారా వస్తుందని వివరించారు. వైఎస్సార్సీపీపై బురద చల్లడమే వారి లక్ష్యం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కలసి నిందారోపణలు చేస్తున్నాయని కొణతాల విమర్శించారు. ‘‘2013 జూలై 30న రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ప్రకటించకముందే జూలై 25న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే దానికి వక్రభాష్యం చెప్పారు. గతంలో చిదంబరం ప్రకటన తర్వాత పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి, రాజకీయ సంక్షోభం సృష్టిస్తే అప్పట్లో విభజన ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడూ అదే మాదిరిగా చేసుంటే విభజన ఆగిపోయేది కదా? తీర్మానం వస్తుందంటూ ఇన్నాళ్లు సీఎం కిరణ్ మోసగించారు. ఇప్పుడు సభలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ పట్టుబడితే దానికీ వక్రభాష్యం చెబుతూ విచిత్రమైన వాదనలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. విభజన బిల్లుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చర్చించాలని కిరణ్ చెప్పటం ఎంతవరకు సమంజసమన్నారు. విద్యుత్‌రంగానికి సంబంధించి సీఎం అన్ని తప్పులే చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘‘విభజన జరిగితే విద్యుత్ విషయంలో తెలంగాణకు లోటు ఏర్పడుతుందని సీఎం చెబుతున్నారు. విద్యుత్ ప్రాజెక్టులు సీమాంధ్రలో ఉన్నప్పటికీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) ప్రకారం తెలంగాణకు విద్యుత్ వెళ్తుంది. దీనివల్ల ఆంధ్ర, రాయలసీమకే 9% లోటు ఏర్పడుతుంది’’ అని వివరించారు. విభజన బిల్లుకు శాసనసభలో సవరణలు, క్లాజ్లు పెడతామంటూ, ఓటింగ్ అంటూ సీఎం కిరణ్ ప్రజలను మోసగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు శాసనసభకు ఉండే అధికారాలు, హక్కులు తెలిసీ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో విభజనను అడ్డుకోవాలంటే రాజకీయ సంక్షోభమే ఏకైక మార్గమన్నారు. -
ఘనంగా కొణతాల జన్మదిన వేడుకలు
అనకాపల్లి , న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కొణతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు శనివారం అనకాపల్లిలో ఘనంగా జరిగాయి. 57వ జన్మదిన సూచికగా కొణతాల క్యాంపు కార్యాలయం వద్ద 57 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) కట్ చేశారు. పేదలకు చీరలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొణతాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పట్టణ మెయిన్‌రోడ్‌ను విస్తరించిన ఘనత కొణతాలకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు కొణతాలేనని చెప్పారు. వైయస్ వెంట ఉండి, ఆయన మరణాంతరం జగన్‌కు అండగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు (జానీ) మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వైఎస్సార్ సీసీ అఖండ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు కొణతాల జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ ఆస్పత్రిలోను, వర్తక సంఘం ప్రసూతి ఆస్పత్రిలోను కొణతాల బాలసుబ్రహ్మణ్యం రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. విజయరామరాజుపేటలో పలకా రవి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ జరిగింది. గవరపాలెంలో కాండ్రేగుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంచిపెట్టారు. తుమ్మపాలలో డి.వి.వి. గోపాలరాజు ఆధ్వర్యంలో వంద మంది పేదలకు బియ్యం పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్లి సూరిబాబు, మంత్రి సత్తిబాబు, పిళ్లా హర శ్రీనివాసరావు, పిళ్లా చంద్రశేఖర్, మలసాల కిషోర్, చిన్ని వల్లభ నారాయణరావు, నార్నపిని వెంకటరావు, సేనాపతి గంగునాయుడు, ఆడారి అచ్చియ్యనాయుడు, బొడ్డేడ శివ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యతాశక్తి జగన్
=సమైక్యాంధ్ర బహిరంగ సభలో కొణతాల =వైఎస్ లేకనే ఆంధ్రకు ఈ అన్యాయం =జగన్‌కు భయపడి కేంద్రం విభజన కుట్ర =జననేతకు అండగా నిలవాలని పిలుపు అరకు/అరకు రూరల్, న్యూస్‌లైన్: ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఏకైక వ్యక్తి, శక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. ఇక్కడి గిరిజన మ్యూజియం ముఖద్వారం ఎదురుగా అరకు నియోజకవర్గ సమన్వయకర్తలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి దొన్నుదొరల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సమైక్యాంధ్ర బహిరంగ సభ మంగళవారం నిర్వహించారు. సభలో కొణతాల మాట్లాడుతూ, మహానేత వైఎస్ అనంతర పరిస్థితులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని చెప్పారు. ఆయన లేకపోవడంతోనే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజన సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభంజనానికి భయపడే విభజనకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గిరిజన బెటాలియన్ ఏర్పాటుకు వైఎస్ సుముఖత వ్యక్తం చేసి 300 మందికి ఉద్యోగాలు ఇప్పించారని చెప్పారు. జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారని తెలిపారు. కాఫీ సాగు చేస్తున్న గిరిరైతులు బాగుపడడంలేదు కానీ దాని వల్ల కేంద్ర మంత్రి జైరాం రమేష్ లబ్ధిపొందుతున్నారని చెప్పారు. మరో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విశాఖ రాజధాని చేయాలని చెబుతున్నారని, ప్రజలకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే వైఎస్సార్ విధానాలు అమలవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొండ కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చుతూ ఉంటే, ఏపీలో మాత్రం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందని చెప్పారు. పెందుర్తి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు. అంతకు ముందు ఎన్టీఆర్ గ్రౌండ్నుండి భారీ ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. హుకుంపేట మండలం శోభకోట సర్పంచ్ ప్రధాని కనకాలతో పాటు నలుగురు వార్డు సభ్యులు పార్టీలో చేరారు. కొణతాల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ నాయకుడు పీవీజీ కుమార్, యువజన విభాగం కన్వీనర్అదీప్రాజు, ఆరు మండలాల నుంచి పలువురు సర్పంచ్‌లు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. -
దిగ్విజయ్‌వి శుద్ధ అబద్ధాలు:కొణతాల
వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పడం శుద్ధ అబద్ధమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 2009 డిసెంబర్ 9న రాష్ట్రాన్ని చీల్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నపుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడనే లేదని, అలాంటపుడు తమ పార్టీ విభజనకు అంగీకరించిందని చెప్పడం దిగ్విజయ్‌కే చెల్లిందని విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కొణతాల విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి పోదని దిగ్విజయ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని, తెలుగువారు కలిసి ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన విషయాలను ఇప్పుడు కాంగ్రెస్ తిరగదోడటంలేదా అని ప్రశ్నించారు. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటుకు శాసనసభ తీర్మానం చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం తీర్మానం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 2004, 2009లోనూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేంద్రానికి అమృత భాండాన్ని అప్పగిస్తే ఇపుడు అధిష్టానవర్గం బలవంతంగా తెలుగు ప్రజల చేత విషాన్ని మింగించేందుకు కంకణం కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యం పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే విభజన... ‘‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును తమకు మిత్రుడని దిగ్విజయ్ చెబుతున్నారు. తొలి నుంచి మేం కూడా అదే చెబుతున్నాం. బాబు కనుసన్నల్లోనే విభజన ప్రక్రియ జరుగుతోంది. తనపై సీబీఐ కేసులు రాకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయిన చంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌కు సహకరించారు’’ అని కొణతాల ఆరోపించారు. బాబు ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన భుజాలపై మోస్తున్నారని, కేవలం టీడీపీ దయాదాక్షిణ్యాలపైనే కిరణ్ మనుగడ సాగిస్తున్నారని పేర్కొన్నారు. కిరణ్, బాబు ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తూ విభజనకు మార్గం సుగమం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘తొలి ఎస్సార్సీలో విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని పేర్కొంటూ మాయావతి అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఎందుకు పక్కన పెట్టారు? ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయించలేదు’’ అని ప్రశ్నించారు. తమ పార్టీ తొలి నుంచీ సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఇపుడు కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోందని, రాష్ట్ర విభజనను కోరుకుంటున్నవారే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన అన్యాయంగా చేస్తున్నారని, సమన్యాయం జరగలేదని అంటున్న చంద్రబాబు.. విభజన ప్రక్రియను ఆపేయాలనే ఒక్క మాట కూడా మాట్లాడ్డంలేదని ధ్వజమెత్తారు. బిల్లు తనకు చేరడానికి రాష్ట్రపతి జనవరి 23వ తేదీ వరకూ గడువు ఇచ్చారు కనుక శాసనసభ్యులు అర్థం చేసుకోవడానికి కనీసం వారికి ఒక నెల గడువిచ్చి, సంక్రాంతి తర్వాత అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి బిల్లుపై చర్చించాలని కొణతాల డిమాండ్ చేశారు. -
'ఛత్తీస్‌గఢ్ విభజనపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదా?'
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెనక్కివెళ్లే ప్రసక్తే లేదనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సీఎంగా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ విభజనపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదా? అంటూ కొణతాల ప్రశ్నించారు. 2009 డిసెంబర్ 9న చిదంబరం చేసిన తెలంగాణ ప్రకటన సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించలేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో, ఎఫ్‌డీఐ ఓటింగ్ సమయంలో ములాఖత్‌లు జరిపి టీడీపీ నేతలు కాంగ్రెస్‌ను గట్టెక్కించారని చెప్పారు. సీబీఐ అరెస్ట్‌లకు జడిసి టీడీపీ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన సహాయంవల్లే ఇన్ని ఇబ్బందుల్లోనూ ఈ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అంటున్నారని, విభజన నిర్ణయం రాజకీయ లబ్ధికోసమే తప్ప... ప్రజలు కోసం తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్న చంద్రబాబు జీవోఎంకు ఈ విషయం ఎందుకు నివేదించలేదని కొణతాల ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీకి ప్రజల్లో ఉన్న ప్రభంజనం తట్టుకోలేకే జగన్‌పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని కొణతాల రామకృష్ణ అన్నారు. -
జగన్ కృషివల్లే దేశవ్యాప్త చర్చ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పట్ల కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గమైన చర్యలపై జాతీయస్థాయిలో చర్చ జరిగే పరిస్థితులు తీసుకురావడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సఫలీకృతులయ్యారని ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను దుర్వినియోగపరుస్తూ రాజకీయలబ్ధి కోసం రాష్ట్రాలను బలహీనపరుస్తున్న కేంద్రం చర్యలను వివరించి, విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతును జగన్ కూడగట్టగలిగారని తెలిపారు. జగన్ కృషి వల్లే నేడు మెజారిటీ పార్టీలు విభజనను వ్యతిరేకిస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాఖ్యను ఛిన్నాభిన్నం చేసే విభజన ప్రక్రియను నిలుపుదల చేయాల్సిన ఆవశ్యకతను జగన్ అన్ని పార్టీలకు వివరించారని చెప్పారు. భవిష్యత్తులోనూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వారు రాష్ట్రాలను విభజిస్తూ, రాష్ట్ర నాయకత్వాలను బలహీనపరుస్తారని, తద్వారా దేశం అభద్రతలోకి వెళ్లే ప్రమాదముందని తెలియజేశారన్నా రు. ఆర్టికల్-3ను సవరించి పార్లమెంటు, అసెంబ్లీలో మూడిం ట రెండొంతుల మెజారిటీ ఉంటే విభజన ప్రక్రియ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని, దీనిపై అన్ని పార్టీల్ని సమాయత్తపరిచి ఒక జాతీయ అంశంగా ప్రాధాన్యం సంతరించుకునే లా చేయడంలో జగన్ విజయవంతమయ్యారని తెలిపారు. విభజనకు సహకరిస్తున్న అజ్ఞాతపుత్రుడు, సీఎం సోనియాగాంధీకి అజ్ఞాతపుత్రుడుగా మారిన చంద్రబాబు రాష్ట్రవిభజనకు అన్నిరకాలుగా సహకరిస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు. రోజూ ప్రెస్‌మీట్ పెట్టి ‘రెండుకోతులు- పిల్లి పంచాయితీ’ ‘కొబ్బరిచిప్పలు’ ‘ఇద్దరు కొడుకులు’ అంటూ ఏవేవో మాట్లాడుతున్న చంద్రబాబు... 75 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు విభజనను ఆపమని ఒక్క మాటచెప్పట్లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన బాబు సమైక్యంగా ఉంచమని ఒక్క లేఖ కూడా రాయట్లేదన్నారు. విభజనను త్వరితగతిన పూర్తిచేయడం కోసం కాంగ్రెస్‌కు అడుగడుగు నా సహకరిస్తున్నారన్నారు. మరోవైపు సీఎం కిరణ్ వారానికొక ప్రెస్‌మీట్ పెట్టి దొంగ ఏడుపులు తప్పితే విభజనను అడ్డుకోవడానికి చేసిందేంటని ప్రశ్నించారు. ఇప్పటికీ అసెం బ్లీలో ఓటింగ్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. విభజనకు దోహదపడి తర్వాత కొత్త పార్టీపెడితే చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని కిరణ్‌ను హెచ్చరించారు. -
ప్రధాని, జీవోఎంకు 8067 ఈ-మెయిల్స్
-
ముమ్మాటికీ సమైక్యమే
విభజన కోసమే మంత్రుల బృందం... జీవోఎంను మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్ర హోంశాఖకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ లేఖను విడుదల చేసిన కొణతాల, మైసూరారెడ్డి సమైక్యాంధ్రను కోరుకునేవారంతా జీవోఎంను గుర్తించకుండా వ్యతిరేకించాలని పిలుపు సీఎం, చంద్రబాబు, సీమాంధ్ర మంత్రులు లోపాయికారీగా విభజనకే సహకరిస్తున్నారు బాబు చెప్పినందుకే అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలన్న వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన జగన్ సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుకునే వారందరూ జీవోఎంను గుర్తించకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జీవోఎంను వ్యతిరేకించడంతో పాటు విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాసిన లేఖను వారు ఈ సందర్భంగా విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై సలహాలు, సూచనలు చేయాల్సిందిగా 2013 అక్టోబర్ 30వ తేదీన హోంశాఖ నుంచి వచ్చిన లేఖకు సమాధానంగా జగన్ ఈ లేఖ రాశారని నేతలు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ తొలి నుంచీ కోరుతోందని, కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేయడం, సలహాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం అనేది విభజన ప్రక్రియలో మరో ముందడుగుగా తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. అందుకే జీవోఎంను తాము వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు సహా సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులందరూ పైకి ఒక రకంగా మాట్లాడుతూ లోపాయికారీగా విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్, బాబు.. ఇద్దరూ సోనియాగాంధీ నిర్ణయాన్ని బలపరుస్తూ విభజనకు దోహదపడుతున్నారన్నారు. విభజన విషయంలో అఖిలపక్షం వేయాలని చంద్రబాబు కూడా డిమాండ్ చేశారని, ఆయన మాట మేరకు కేంద్రం ఇప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేయ సంకల్పించిందని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న కిరణ్ ఇదే ఆఖరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అవుతుందేమోనని చెప్పడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా పోరాటం సాగిస్తామని ఓవైపు చెబుతూ మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని కొణతాల, మైసూరారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని, ఈ పోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారా? అన్న ఒక ప్రశ్నకు.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మైసూరారెడ్డి చెప్పారు. తాము ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కోరతామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం ఈ విధంగా ఉంది... అయ్యా, ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన వివిధ సమస్యలపై మా పార్టీ సలహాలు, సూచనలు కోరుతూ 2013 అక్టోబర్ 30వ తేదీన మీరు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకించాలనేది మా పార్టీ విధానం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. అందువల్ల రాష్ట్ర విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా మా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3వ తేదీన తీసుకున్న నిర్ణయం మాకు ఏమాత్రం సమ్మతం కాదు. రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు గత మూడు నెలలుగా విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ రోడ్లపై ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా, వాస్తవాన్ని విస్మరించి విభజన అనే దారుణమైన అన్యాయానికి ఒడిగట్టడానికే సిద్ధమై ముందుకు వెళుతోంది. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటైంది కూడా రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్దేశంతోనే కనుక దానిని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నేపథ్యంలో సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. కృతజ్ఞతలతో... మీ వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్‌కు నేడు రాష్ట్రపతి అపాయింట్మెంట్! వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. ప్రణబ్ సోమవారం హైదరాబాద్‌కు వస్తున్న విషయం విదితమే. హైదరాబాద్‌లో కలవడానికి తమకు సమయం కేటాయించాల్సిందిగా జగన్ ఇటీవల ఒక లేఖ ద్వారా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్న రాష్ట్రపతిని 9 గంటల తరువాత కలుసుకోవాల్సిందిగా ఆయన కార్యాలయ సిబ్బంది వర్తమానం పంపినట్లు తెలిసింది. -
జిఓఎంను వ్యతిరేకిస్తున్నాం : వైఎస్ఆర్ సిపి
హైదరాబాద్: రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)ను వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ రాజకీయవ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణతాల రామకృష్ణ, మైసూరా రెడ్డి ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలు కూడా జిఓఎంను వ్యతిరేకించి సమైక్య ఉద్యమం కోసం కలసిరావాలని పిలుపు ఇచ్చారు. జిఓఎం తరపున కేంద్ర హొం శాఖ అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని తమ పార్టీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖ అందిన తరువాత తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి జిఓఎంను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తమ పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖను మీడియాకు చూపించారు. జీఓఎం తమకు సమ్మతి కాదని చెప్పారు. జీఓఎం విభజనకు ముందడుగు మాత్రమేనని వారు అన్నారు. విభజన కోసం వేసే ఏ అడుగుకు తాము సహకరించం అని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నది మాత్రమే తమ డిమాండ్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా 8067 ఈ మెయిల్స్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 8067 పంచాయతీలు ఇమెయిల్స్ పంపినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రభుత్వం ఈ ఇమెయిల్స్‌కు స్పందిస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. అలా స్పందించకపోతే ఆ ప్రభుత్వం కళ్లు మూసుకొని నిర్ణయాలు తీసుకుంటుందని భావించాలన్నారు. విభజనకు వ్యతిరేకంగా 75 శాతం జనాభా రోడ్డుపై పోరాటం చేస్తుంటే పట్టనట్లుగా కేంద్ర వ్యవహరిస్తోందన్నారు. తాము ఎక్కడకు వెళ్లినా సమైక్యవాదాన్నే కోరుకుంటామని చెప్పారు. రాష్ట్ర సమైక్యతకు ప్రజలు కృషిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు రాష్ట్రాన్ని విభజించేలా ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆఖరి రాష్ట్ర అవతరణ దినోత్సవం అని నిరాశ నిస్పృహలు వ్యక్తం చేయడం చూస్తుంటే, ఆయన రాష్ట్ర విభజనకు స్పష్టమవుతోందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల చర్యలు రాష్ట్రాన్ని విభజించే విధంగా ఉన్నాయని విమర్శించారు. పార్టీ తరపున రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. తుపాను వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని వారికి తెలియజేస్తామని చెప్పారు. బాధితులకు తగిన సహాయం చేయమని విజ్ఞప్తి చేస్తామన్నారు. నల్లొండ జిల్లాలో వైఎస్ విజయమ్మను ప్రజలు అడ్డుకోలేదని, అది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిందన్నారు. రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం విజయమ్మను వెనక్కి పంపిచండం ఏమిటని వారు ప్రశ్నించారు. -
జిఓఎంను బహిష్కరిస్తున్నాం : వైఎస్ఆర్ సిపి
-
చంద్రబాబు చెప్పినట్లే విభజన
రాష్ట్రాన్ని విడదీయడానికి ఆయన చెప్పిన పద్ధతులనే కేంద్రం పాటిస్తోంది వైఎస్సార్ సీపీ నాయకుడు కొణతాల ధ్వజం అఖిలపక్షం పెట్టాలని అక్టోబర్ 7న చంద్రబాబు అడిగారు.. వీరు పెట్టారు సమన్యాయమంటూ ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చోగానే జీవోఎం ఏర్పాటు చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో టీడీపీ అధినేత మాట్లాడాకే విభజన నిర్ణయం రాష్ట్రంలోనే ఉన్న తెలంగాణకు విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో సీఎం జవాబు చెప్పాలి వరద బాధిత రైతులకు కేంద్ర సాయం కోసం జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ కోరారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం తమ పార్టీని ఇరుకున పెట్టేందుకే అంటూ బాబు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ‘‘బాబు మర్చిపోయారేమోగానీ, అక్టోబర్ ఏడో తేదీన ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటూ స్పష్టంగా ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆయన అఖిలపక్ష సమావేశం అన్నాకే ఈ రోజు సమావేశం పెట్టారు. సమన్యాయం చేయాలని ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చున్నాకే విభజన తరువాత ఏర్పడబోయే సమస్యల పరిష్కారం కోసం కేంద్రం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు 7వ తేదీన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటే 8వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడాకే రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయింది. ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లి వచ్చాకే కేంద్ర మంత్రివర్గం రాష్ట్రవిభజన నిర్ణయానికి ఆమోదం తెలిపింది’’ అని కొణతాల వివరించారు. శుక్ర వారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు ఢిల్లీ దీక్ష తరువాత ఆ పార్టీ నేతలే తమ అధినేత దీక్ష విజయవంతమైందని ప్రకటించుకుంటూ.. ఆ దీక్షకు కేంద్రం తలవంచే విభజన సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం వేశారని చెప్పుకున్నారని గుర్తు చేశారు. జులై 30న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తెలంగాణ అనుకూల ప్రకటన తీసుకున్న తరువాత కూడా చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. కొత్త రాజధాని నిర్మానానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కూడా డిమాండ్ చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబు పైకి మాట్లాడేది ఒక రకంగా ఉంటుందని, చేసేది మరో రకంగా ఉంటుందని కొణతాల తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరి సహకారంతోనే విభజన ప్రక్రియ వేగంగా జరుగుతుండడం దురదృష్టకరంగా అభివర్ణించారు. విజయమ్మ యాత్రను అడ్డుకుంది ప్రజలు కాదు, పోలీసులే.. గతంలో వరంగల్ జిల్లా ఓదార్పుయాత్రకు బయలుదేరిన జగన్మోహన్రెడ్డిని అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు కూడా తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లనీయకుండా చేయడం ద్వారా అప్పటి ఘటనను పునరావృత్తం చేసిందని కొణతాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయమ్మ పర్యటనను అడ్డుకున్నది ప్రజలు కాదని, పోలీసులేనని గుర్తు చేశారు. వరద వల్ల న ష్టపోయిన రైతుల పరామర్శకు వెళ్లిన విజయమ్మను ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆదరించారని, దీంతో జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను, పోలీసులను అడ్డంపెట్టుకొని ఆమెను నల్లగొండ జిల్లా ప్రజల దగ్గరకు వెళ్లకుండా చేశారన్నారు. విజయమ్మ వెంట ఉన్న పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తాను గట్టి సమైక్యవాదినని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే పోలీసుయంత్రాంగం ఈ సరికే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్న రీతిలో వ్యవహరించడం.. ఆయన మంత్రివర్గంలో పనిచేసే మంత్రులే రెచ్చగొట్టడం వంటి ఘటనలు బాధాకరమన్నారు. ఇదే సమయంలో అదే ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన చేస్తుంటే ఎలాంటి ఆటంకాలూ లేకుండా పూర్తి వెసులుబాటు కల్పించారని అన్నారు. వైఎస్సార్ సీపీ అంటే ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు.. విజయమ్మను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా చేయడాన్ని బట్టే.. ప్రభుత్వ పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతలా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చని కొణతాల అన్నారు. రాష్ట్రంలోనే ఉన్న ఒక ప్రాంతానికి విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో స్పష్టంగా జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు శోచనీయమని.. ఈ రకంగా ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సినముఖ్యమంత్రి వేరొక పార్టీ గౌరవాధ్యక్షురాలికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియకు ముందే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తిరగడానికి వీలులేదన్నట్టు నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి.. ఈ సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొ నసాగే హక్కులేదని ధ్వజమెత్తారు. రక్షణ కల్పించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన మంత్రివర్గంలోని మంత్రులను నియంత్రించుకోలేరు.. తన చేతిలో ఉన్న విభజన ప్రక్రియను ఆపడం ఆయనకు చేతకాదని సీఎంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ కోరారు.. వరదలలో నష్టపోయిన రైతులకు కేంద్ర సాయం కోరేందుకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ కోరారని కొణతాల చెప్పారు. రాష్ట్రపతి నుంచి వచ్చే అపాయింట్మెంట్ను బట్టి ఆయనను వీలుంటే హైదరాబాద్‌లో లేదంటే ఢిల్లీలో కలుస్తారన్నారు. రైతులను ఆదుకునే అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను వారి దృష్టికి తీసుకువస్తారన్నారు. విభజన ప్రక్రియకు సంబంధించి 11 అంశాలపై జీవోఏంకు సూచనలు చేయాలంటూ కేంద్రం రాసిన లేఖ శుక్రవారం పార్టీ కార్యాలయానికి అందిందని చెప్పారు. దానిపై పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ పార్టీ మొదట నుంచీ సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటుందని.. కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేసినప్పడు దానిని సైమన్ కమీషన్‌తో పోల్చుతూ, బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించామని గుర్తు చేశారు. తమ పార్టీ సమైక్యవాద వైఖరికి, కేంద్రం లేఖకు పొసగదని అనిపిస్తోందన్నారు. ఏది ఏమైనా లేఖపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
'సమైక్యనినాద బలం ఢిల్లీకి చూపిన శంఖారావం'
హైదరాబాద్: హైదరాబాద్‌లో నిన్న జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభ సమైక్యవాద నినాద బలాన్ని ఢిల్లీకి చూపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతికూల వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా సమైక్య శంఖారావానికి వచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుజాతి ఐక్యతకు వైఎస్ జగన్ చేస్తోన్న పోరాటానికి లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలిపారన్నారు. ఆఖరి నిమిషం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య పోరాటం ఆగదని చెప్పారు. గాంధేయ మార్గంలో రాష్ట్ర సమైక్యతకు పోరాడతామన్నారు. సమైక్య నినాదం ఎంత బలంగా ఉందో శంఖారావం సభతో ఢిల్లీకి తెలిసిందని చెప్పారు. విభజనపై ఇకనైనా ఢిల్లీ పెద్దలు పునరాలోచించుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే కొందరు తెలంగాణ నేతలు హాజరుకాలేదని చెప్పారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కొణతాల డిమాండ్ చేశారు. వర్షాలతో చాలా జిల్లాలు నష్టపోయాయి. లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. కోస్తాలో ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రైతులు, ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పునరావాస ఏర్పాట్లతో పాటు పంట నష్టపరిహారంపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. -
'సమైక్యనినాద బలం ఢిల్లీకి చూపిన శంఖారావం'
-
తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరు: కొణతాల
-
తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరు: కొణతాల
హైదరాబాద్: సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. తెలుగు జాతిని విడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ సంక్షోభం తీసుకురావడం ద్వారానే విభజనను అడ్డుకోగలమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టినపుడే రాష్ట్ర విభజన ఆగుతుందన్నారు. విభజనకు పూర్తిగా ఫుల్ స్టాఫ్ పెట్టాల్సిన అవసరముందన్నారు. తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య జరుగుతున్న పోరాటంలో తెలుగు ప్రజలదే విజయమని వ్యాఖ్యానించారు. విభజనపై ప్రజలను మభ్యపెడుతూ సీఎం కిరణ్ మోసం చేస్తున్నారని కొణతాల ఆరోపించారు. విభజన సాఫీగా జరిగిపోవడానికి సీఎం సహకరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తీర్మానం, బిల్లుపై గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని చెప్పారు. -
విభజనతో రాష్ట్రానికి శాశ్వత నష్టం: కొణతాల
విభజన జరిగితే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేయడానికి శనివారం సమైక్య శంఖారావం సభను యథావిధిగా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని శుక్రవారం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ సమీక్షించింది. సవూవేశం అనంతరం పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డిలతో కలిసి కొణతాల మీడియాతో మాట్లాడారు. సమైక్య శంఖారావం ద్వారా ప్రజల మనోభావాలను ఢిల్లీకి తెలియపరుస్తామని, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని, సభను వాయిదా వేయలేకపోతున్నామని కొణతాల చెప్పారు. విభజనను 60 శాతంవుందిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కేంద్రం పునరాలోచన చేయకపోవడం సరికాదన్నారు. నవంబర్ 15లోగా విభజన బిల్లు రూపొందిస్తామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పడం దారుణమని, ఓట్లు, సీట్లు లెక్కలతో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయన్నారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పీఠం కదిలేలా, విభజనకు సహకరించే ఆ రెండు పార్టీలకు కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం పూరించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయుక చర్యల్లో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొంటున్నాయని కొణతాల చెప్పారు. వర్షబాధిత ప్రాంతాల్లో పరిస్థితిని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గంటగంటకూ సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశించారన్నారు. అధికారుల సహాయ సహకారాలతో బాధితు లను పునారావాస కేంద్రాలకు తరలించాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పార్టీ శ్రేణులు సభ జరిగే రోజు కూడా యథావిధిగా అవే పనుల్లో కొనసాగాలని జగన్ సూచించినట్టు కొణతాల చెప్పారు. మిగతా వారు మాత్రమే సభకు రానున్నారని ఆయున చెప్పారు. సాయంత్రం కూడా సమీక్ష: సమైక్య శంఖారావానికి వరద బాధిత ప్రాంతాల నుంచి తరలి వస్తున్న పార్టీ నేతలతో వారు జిల్లాల నుంచి బయల్దేరే ముందు కూడా శుక్రవారం సాయంత్రం జగన్ ఆయా జిల్లాల్లో వరద గురించిన తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని కొణతాల చెప్పారు. హైదరాబాద్ సభకు బయల్దేరకుండా జిల్లాల్లోనే ఉన్న కొందరు నేతలను స్థానికంగా సహాయ కార్యక్రమాలను చేపట్టాలని జగన్ సూచించారని ఆయన వివరించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులకు శని, ఆదివారాల్లో ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా జగన్ వారిని కోరినట్టు కొణతాల తెలిపారు. -
సమైక్య ముసుగులో సీఎం కిరణ్ మోసం
కుర్చీ కాపాడుకోడానికే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదం ముసుగులో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనను సజావుగా న డిపించడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వత్తాసు పలుకుతూ సీఎం ఓ అస్త్రంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. విభజన పక్రియ సజావుగా సాగిపోవడానికి ప్రజాప్రతినిధులతో రాజీనామాలు ఇవ్వనీయకుండా, రాజకీయ సంక్షోభం రానీయకుండా సీఎం అడ్డుపడుతున్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభలో తీర్మానానికి కిరణ్ సర్కారు ప్రయత్నించడంలేదని ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రం ముందుకు వెళుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా తాపీగా కూర్చున్నారని విమర్శించారు. సోనియాను ఎదిరిస్తుంటే సీఎం పదవీత్యాగం చేస్తారని గతంలో చాలామంది భావించారని, కానీ ఇపుడు ఆయన నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. సమైక్యవాదాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్న కిరణ్ చరిత్రహీనులుగా మిగులుతారన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేసే పరిస్థితి లేకుండా చేసి సోనియాగాంధీ ప్రజాస్వామ్యాన్ని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభకు హరికృష్ణ చేసిన రాజీనామాను, మంత్రి విశ్వరూప్ చేసిన రాజీనామాను ఆమోదించినా, మిగతా మంత్రుల రాజీనామాలు, వైఎస్సార్ సీపీ రాజీనామాలు ఆమోదించకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీకి మసి పూయాలని చూస్తున్నారన్నారు. రాజీనామాలపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్ర ముసుగులో ఒక మాదిరిగా.. ముసుగు తీసి మరొకలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సేవియర్ ఆఫ్ కాంగ్రెస్ (రక్షకుడు)గా చంద్రబాబు మారారని ఎద్దేవా చేశారు. సోనియా నేతృత్వంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పని చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై సీబీఐ కేసులు లేకుండా, సమైక్యాంధ్రకు జగన్ సీఎం కాకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. -
ఢిల్లీ కదిలేలా సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పీఠం కదిలేలా సమైక్య శంఖారావాన్ని పూరిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేద్దామని సమైక్యవాదులకు ఆయన పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని కొణతాల పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుజాతిని రక్షించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాల్సిన అవసరముందని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే విభజన ఆగుతుందని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని, అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు విభజన లేఖను ఉపసంహరించుకోవాలని కొణతాల కోరారు. సోనియా డెరైక్షన్‌లో కాంగ్రెస్, టీడీపీ.. రాష్ట్రంలో సుమారు 80 రోజులకుపైగా ఉద్యమం జరుగుతున్నప్పటికి కూడా.. ఆందోళన కార్యక్రమాలను మరింత పెంచేలాగానే కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తున్నారని కొణతాల అన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అడ్డుకుంటామంటూనే, మరోపక్క విభజన అనివార్యమంటూ అందుకు కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రానికి అందించేందుకు జీవోఎం(మంత్రుల బృందానికి)కు ప్రతిపాదనలు పంపుతున్నారని దుయ్యబట్టారు. తాము మొదటి నుంచీ చెబుతున్నట్లుగా.. సోనియాగాంధీ డెరైక్షన్‌లో రాష్ట్రంలోని కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పథకం ప్రకారం ముందుకెళ్తున్నారన్నారు. వారి డ్రామాలు ఒక్కొక్కటిగా రుజువవుతున్నాయని పేర్కొన్నారు. సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి.. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుజాతి సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమైందని కొణతాల అన్నారు. 1969, 72లో వచ్చిన ఉద్యమాల తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలు సోదరభావంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటికీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా అనే పరిస్థితిలో కూడా నాడు వైఎస్ చేపట్టిన కార్యక్రమాల వల్ల అభివృద్ధి కుంటుపడలేదన్నారు. జీఎస్టీలో రూ.8 లక్షల కోట్లతో దేశంలోనే మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని వెల్లడించారు. దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత అభివృద్ధి కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ హక్కు మాదిరిగా తిండి, గూడు, ఆరోగ్యం ఇలా ప్రతిదీ సంతృప్తికర స్థాయిలో పథకాలు అందించారని వివరించారు. అభివృద్ధితో వేర్పాటువాదాన్ని మరిపించగలిగారన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం ఏర్పడిన తమ పార్టీకి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే దృఢమైన విశ్వాసం ఉందని చెప్పారు. ప్రజల ఆలోచనకు విరుద్ధమైన నిర్ణయం.. రాష్ట్రాన్ని విభజించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల ఆకాంక్షకు పూర్తి విరుద్ధమైనదని కొణతాల వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజించడం దారుణమన్నారు. ఈ విషయమై గతంలో కేంద్ర హోంమంత్రిగా ఎల్కే అద్వానీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘ఆగస్టు 1, 2000న పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిగా ఎల్కే అద్వానీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అక్కడి అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. అంతేకాదు 26-2-2002న 377 నిబంధన కింద తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఆలె నరేంద్ర అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు’ అని వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మీడియాకు అందజేశారు. డిసెంబర్ 9, 2009న కేంద్రహోంమంత్రిగా చిదంబరం మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పిన ప్రకటనను కూడా యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. -
యూటర్న్ తీసుకున్నది కాంగ్రెస్సే : కొణతాల రామకృష్ణ
ధ్వజమెత్తిన కొణతాల రామకృష్ణ రెండో ఎస్సార్సీ వేయాలని 2002లో సీడబ్ల్యూసీ తీర్మానం 2009 డిసెంబర్లో రాష్ట్ర విభజన ప్రకటన.. తర్వాత విరమణ విభజన వల్ల సమస్యలు వస్తాయని మేం చెప్తూనే ఉన్నాం రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా పట్టించుకోని కేంద్రం రోజుకో మాట చెబుతూ గందరగోళపరుస్తున్న నేతలు విభజనకు మార్గం సుగమం చేస్తున్న సీఎం, చంద్రబాబు ‘సైమన్ గోబ్యాక్’లా ‘జీవోఎం గోబ్యాక్’ అని నినదించాలి తుపాన్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ‘యూ’టర్న్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రాల విభజన విషయంలో రెండో ఎస్సార్సీ పెట్టాలని 2002లో సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగానే 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే 2009 డిసెంబర్లో చిదంబరం ఒకేసారి యూ టర్న్ తీసుకొని రాష్ట్ర విభజన ప్రకటన చేశారు. జూలై 30న మళ్లీ సీడబ్ల్యూసీ తీర్మానం ద్వారా యూ టర్న్ తీసుకుంది’’ అని వివరించారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే పలుమార్లు యూ టర్న్ తీసుకొని ఇతరపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘2009లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో విభజన అంశంపై చాలా కూలంకషంగా వివరించారు. అందుకే రోశయ్య కమిటీని వేశారు. అందులో తొమ్మిది అంశాలపై క్షుణ్నంగా పరిశీలన జరగాలని చెప్పారు. అయితే వీటన్నింటినీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది’’ అని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు స్పష్టత లేదంటూ దిగ్విజయ్‌సింగ్ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. విభజన వల్ల రాష్ట్రంలో సమస్యలు వస్తాయని, సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ చాలా స్పష్టంగా పలుమార్లు నివేదించడంతో పాటు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చోద్యం చూస్తున్న కేంద్రం ఉద్యమాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని కొణతాల దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు రోజుకొక మాట చెబుతూ, ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ ఈనెల 3న కేంద్ర కేబినేట్ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తామని చెబుతుంటే, కేంద్రహోంమంత్రి షిండే మాత్రం అబ్బేలేదు.. జీవోఎం సిఫార్సు వచ్చాక డ్రాప్టు బిల్లు తయారుచేసి, కేబినెట్లో పెట్టాక రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవడానికి పంపిస్తామని చెబుతున్నారు. మరోవైపు ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో మాట్లాడుతూ... దీనికి కాలపరిమితి లేదంటారు. రాష్ట్ర విభజన ఎన్నికల ముందా, ఆ తర్వాతనా, ఎప్పుడనేది చెప్పలేమంటారు’’ ఇలా పూటకొక మాటతో ఢిల్లీ నేతలు ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోకముందే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. మార్గం సుగమం చేస్తున్న బాబు విభజన మరింత వేగవంతం చేయడానికిగాను కేంద్రానికి సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు పూర్తిగా సహకరిస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు. బాబు దీక్ష వల్లే కేంద్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఏర్పాటు చేసిందన్న ప్రచారాన్ని ఆక్షేపించారు. రాష్ట్రం విడిపోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించడానికి జీవోఎం పనిచేస్తుందని చెప్పారు. ఒక వ్యక్తిని కత్తితోనా లేక ఉరివేసి చంపాలా అనే విధంగా జీఓఎంను వేస్తే.. అది తమ ప్రతిభ అని టీడీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు సహకారంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింద ని ఆరోపించారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన జీవోఎంను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సైమన్ కమిషన్ లాంటి జీఓఎంను గోబ్యాక్ అనాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజాస్వామాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఆనాడు బ్రిటిష్ వారు ప్రయత్నించిన మాదిరిగానే ఇప్పుడు సోనియా కనుసన్నల్లో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను నిలువునా చీల్చే కార్యక్రమం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాలకే సీఎం పరిమితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో భరోసా ఇస్తున్నట్లుగా వారానికి ఒకసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారే తప్ప విభజనను ఆపేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోవడంలేదని కొణతాల విమర్శించారు. ఆయన మాట్లాడిన ప్రతిసారీ కేంద్రం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోందని గుర్తుచేశారు. ప్రజల కోసం తన పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి గడిచిన నాలుగేళ్లుగా ఎంత దారుణంగా పరిపాలన చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. సుమారు రూ.32వేల కోట్లు విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం వేశారని, ఆర్టీసీ చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 ఇలా సంక్షేమ పథకాలన్నింటినీ నీరుగార్చారని దుయ్యబట్టారు. రెండు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోయినా తాను ప్రజల కోసమే పదవిలో ఉన్నాననడం హాస్యాస్పదమన్నారు. సోనియా ఆదేశాలమేరకు పనిచేస్తున్న కిరణ్ ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తనకు ఏం హామీ ఇచ్చిందో సీఎం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విభజన తీర్మానంపై ఓటింగ్ ఉండబోదని స్వయంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తుపాన్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి ఫైలిన్ తుపాన్ వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా వెళ్లి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కొణతాల పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని తమ పార్టీ కోరుతోందని తెలిపారు. -
'హైదరాబాద్ వేదికగా 19న సమైక్య శంఖారావం'
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సమైక్య శంఖారావం’ సభను ఈనెల 19 తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ప్రకటించారు. ఈ సభకు సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌ను అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి నిర్మించుకున్నారు. ఇక్కడ సభలు పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నందున విభజన వల్ల తలెత్తే నష్టాలను, సమైక్యం వల్ల కలిగే లాభాలను వివరించేందుకే ఇక్కడ సభ నిర్వహిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా, ప్రజల పక్షాన ఉన్న వారిగా అందరికీ వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. అంతేకాని మరేఇతర విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాదు’’ అని కొణతాల స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అందరూ సహకరించాలని, వేర్పాటువాదం కోరుకునే వ్యక్తులు సోదరభావంతో అర్థం చేసుకోవాలని విన్నవించారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయపార్టీగా సమైక్య ఆవశ్యకత గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, అందుకు హైదరాబాద్ సముచిత ప్రాంతంగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం వల్లే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. మాను కోట ఘటన పునారావృతమవుతుందన్న కొందరు నేతల వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా... అదంతా కృత్రిమమైనదన్నారు. అందులో పాల్గొన్నది ప్రజాశక్తులు కాదని, అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కావాలనే వెనకుండి చేయించిదని పేర్కొన్నారు. అదే విధంగా సమైక్య శంఖారావం బస్సుయాత్ర సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలకు కొందరు కావాలనే విపరీత అర్థాలు తీస్తూ, వక్రీకరిస్తున్నారని కొణతాల అన్నారు. ‘‘హైదరాబాద్ దేశంలో అంతర్భాగమే. ఇదేమీ పాకిస్థాన్ మాదిరి వేరే దేశం కాదు. మన రాజధాని అయిన హైదరాబాద్‌కు స్వేచ్ఛగా వెళ్లడానికి వీల్లేదని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ఇది మన రాజధాని అనే సందర్భంలో అన్నారే తప్ప ఈ వ్యాఖ్యలను వక్రీకరించడం తగదు’’ అని కోరారు. విభజన కోరుకునేవారు సభలు పెట్టుకోవచ్చు రాష్ట్రాన్ని విభజించాలని వాదిస్తున్న కేసీఆర్, ఇతర తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంతంలో కూడా సభలు పెట్టుకోవచ్చని కొణతాల చెప్పారు. విభజన, సమైక్య వాదనలు విన్న తర్వాత ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారన్నారు. -
అక్టోబర్ 19న సమైక్య శంఖారావం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు
-
షర్మిల మాటల్ని వక్రీకరించొద్దు: కొణతాల
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ఇకపై ఉధృతం చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. రేపటి నుంచి నవంబర్ ఒకటి వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులేకాక సమైక్యవాదులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ప్రకటించినట్టుగానే సమైక్య శంఖారావం సభ ఈనెల 15-20 మధ్య హైదరాబాద్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలు రాజకీయాలకతీతంగా సభను విజయ వంతం చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇక్కడ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్వేషాలను రెచ్చ గొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. వేర్పాటు వాద పార్టీలు, వ్యక్తులు సోదర భావంతో అర్ధం చేసుకొని సహకరించాలని కోరారు. వేర్పాటు వాదులు సీమాంధ్రలో సభలు పెట్టుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదన్నారు. హైదరాబాద్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. మానుకోట ఘటనను పునరావృతమవుతుందన్న కేసీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. మానుకోట ఘటన వెనుక ఏయే శక్తులున్నాయో అందరికి తెలుసునని కొణతాల రామకృష్ణ అన్నారు. -
సోనియా డైరెక్షన్లో రాష్ట్రంలో డ్రామా : కొణతాల
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్లో రాష్ట్రంలో పెద్ద డ్రామా జరుగుతోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నఈ డ్రామాలో పాత్రదారులు, సూత్రదారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబులేనన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోడ్రన్ గిరీశంలా కనిపిస్తున్నారని విమర్శించారు. సీఎం పరిస్థితి ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకున్నట్లుందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. టీడీపీ స్మశాన వైరాగ్యంలో ఉందని అన్నారు. కాంగ్రెస్ ఆడుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ప్రజల్ని బాలుని చేసి ఆడుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే సీఎం కిరణ్ కేబినెట్‌కు రాజీనామా చేసి ఉంటే ప్రకటన ఆగి ఉండేదన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా సమైక్యవాదం ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రాకముందే సమైక్య తీర్మానాన్ని పంపించాలన్నారు. టీడీపీ భవిష్యత్ అంధకారమై వైఎస్ఆర్సీపీపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం ఇష్టం ఉంటే సీఎం, చంద్రబాబులు రాజీనామాలు చేసేవాళ్లని కొణతాల అన్నారు. -
జగన్ రాకతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు
* అందుకే అబద్ధపు ఆరోపణలు వైఎస్సార్ సీపీ నేతలు కొణతాల, సోమయాజులు ధ్వజం * విజయమ్మ ఫోన్ చేశారని సోనియా మీకు చెప్పారా? * చంద్రబాబు అవినీతి, మార్గదర్శి అక్రమాలు జేపీకి కనిపించలేదా? * టీడీపీ, కాంగ్రెస్‌ల క్షుద్ర రాజకీయాల్లో ఆయన పావుగా మారారు * జగన్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమని సుష్మాస్వరాజే అన్నారు * డీల్ కుదుర్చుకునే అలవాటు చంద్రబాబు, బీజేపీలదే సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిలుపై బయటకు రావడంతో అధికార, ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అందుకనే టీడీపీ, బీజేపీలు ఆయనపై అబద్ధపు ఆరోపణలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యులు డి.ఏ.సోమయాజులు పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయనకు లభించిన అశేష ప్రజాదరణను చూసి కొందరికి చాలా బాధ కలిగి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కూడా జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయ క్రీడలో పావుగా మారి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్‌కు బెయిలు వచ్చిన రోజు రాత్రి 12 గంటలకు సోనియాగాంధీకి విజయమ్మ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారని టీడీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం వారికెవరు చెప్పారు? కాల్ డేటా జాబితా ఏమైనా సంపాదించారా...? పోనీ గత రెండేళ్లుగా చంద్రబాబుతో కుమ్మకై్క రాజకీయాలు చేస్తున్నందు వల్ల సోనియాగాంధీయే వాళ్లకు ఈ విషయం చెప్పారా?’ అని వారు సూటిగా ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయింది కనుకే బెయిల్ ఇచ్చారు టీడీపీకి ఎందుకీ దుస్థితి...? ఎందుకిలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు నిలదీశారు. ‘సీబీఐ జాయింట్ డెరైక్టర్ లకీష్మనారాయణను మేమే బదిలీ చేయించినట్లు... ఆయన ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నట్లు చెబుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’ అని మండిపడ్డారు. ‘లకీష్మనారాయణ సీబీఐ జేడీగా ఉండగా జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఐదు సందర్భాల్లో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు కనుక బెయిల్‌ను మంజూరు చేయవద్దని కోర్టుకు నివేదించారు. వారి న్యాయవాది అశోక్భాన్కూడా ఇదే విషయం చెప్పారు. దర్యాప్తు పూర్తి కాలేదనే ఒకే ఒక కారణంతో వారు జగన్ బెయిల్‌ను అడ్డుకుంటూ వచ్చారు. ఇపుడు దర్యాప్తు పూర్తయింది కనుక జగన్‌కు కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ కోసం జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినపుడు... దర్యాప్తు ముగియలేదని, సమయం కావాలని సీబీఐ కోరింది. వారి అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు నాలుగు నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ గడువును పాటించకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది కాబట్టి... అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు అనుగుణంగా సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. దర్యాప్తు పూర్తయిందని చెప్పింది. దర్యాప్తు ముగిసినందున కోర్టు జగన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అసలు విషయం ఇదయితే... ఏమాత్రం బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉన్నా జగన్ గురించి ఇలా మాట్లాడరు’ అని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసులని బీజేపీ అగ్రనేతలే అన్నారుగా..? ‘జగన్ గతేడాది అక్టోబర్ 5న బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు 2013 మార్చి లోపుగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. మార్చి తరువాత బెయిల్ పిటిషన్ వేస్తే.. 70 శాతం పూర్తయిన దర్యాప్తులో రూ.1,030 కోట్ల మేర పెట్టుబడుల విషయాన్ని తేల్చామని సీబీఐ చెప్పటంతో మరో 4 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడంతో బెయిల్ లభించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు? ఎందుకింత దుష్ర్పచారం? ఎందుకిన్ని అబద్ధాలు?’ అని కొణతాల, సోమయాజులు నిలదీశారు. సోనియాతో కుమ్మక్కు అయినందునే జగన్‌కు బెయిల్ వచ్చిందని బీజేపీ నేత నిర్మలా సీతారామన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘జగన్‌పై కేసులు మోపినపుడు బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ స్వయంగా ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని.. జగన్‌ను వెంటాడి వేధించేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించిన సంగతి నిర్మలకు గుర్తు లేదా? ఆ పార్టీకే చెందిన మరో నేత అరుణ్ జైట్లీ చేసిన విమర్శలను మర్చి పోయారా?’ అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. బాబు అవినీతి, ఈనాడుపై కేసుల గురించి మాట్లాడరేం? ‘బీజేపీ నేతలు 1998లో చంద్రబాబుపై వంద ఆరోపణలతో ప్రకటించిన చార్జిషీటును ఆ తరువాత జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ అధినేత మద్దతు కావాల్సి రావడంతో దాన్ని తుంగలో తొక్కిన ఘనత ఆ పార్టీదే. అలా లాలూచీ పడే అలవాట్లు వారికే ఉన్నాయి. బహుశా ఈ విషయం నిర్మలా సీతారామన్‌కు తెలియదేమో?’ అని కొణతాల, సోమయాజులు ఎద్దేవా చేశారు. సుపరిపాలన, పారదర్శకత అని చెబుతూ అవినీతిపై పోరాటం చేస్తున్నానని చెప్పుకునే జయప్రకాష్ నారాయణ్ తీరు మరీ విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిపై పోరుకు బదులు జగన్‌పై జేపీ వ్యక్తిగత పోరాటానికి దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై జేపీ ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. మార్గదర్శి-ఈనాడు సంస్థలపై కేసుల విషయంలో ఎందుకు స్పందించరని నిలదీశారు. నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడ్డ రోజున చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కేసులు కూడా అలాంటివేనని ఆయన్ను కూడా ఉరితీయాలన్నారని ఇపుడు జయప్రకాష్ కూడా జగన్ కేసులు నిర్భయ కేసుల్లాంటివేనని మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఏమనుకోవాలన్నారు. బాబు స్టే తెచ్చుకున్నప్పుడు జేపీ మాట్లాడలేదేం? జగన్ కేసులను జేపీ చెప్పినట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలా చేస్తే తొమ్మిది నెలలకే కేసు పూర్తయ్యేదని, జగన్‌కు 16 నెలల పాటు జైల్లో ఉండే అగత్యం తప్పేదని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై హైకోర్టు విచారణకు ఆదేశిస్తే వాటిపై ఆయన స్టే తెచ్చుకున్నపుడు జేపీ ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. ఐఏంజీ, ఎమ్మార్ కుంభకోణాల్లో బాబు చేసిన నిర్వాకంపై దర్యాప్తు జరిపించాలని జేపీ ఎందుకు డిమాండ్ చేయరని అడిగారు. జగన్‌కు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లలో కలిపి చేసిన ఆరోపణల మొత్తం రూ.1,200 కోట్లు మాత్రమేనని, అవి కూడా పెట్టుబడుల రూపంలో వచ్చినవేనన్నారు. కానీ బాబు చేసిన ఒక్క ఐఎంజీ వ్యవహారంలోనే రూ. 1,200 కోట్ల అవినీతి దాగుందని పేర్కొన్నారు. ఈనాడు-మార్గదర్శి సంస్థలపై ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ఫిర్యాదుతో దర్యాప్తు జరిగితే ఇది వ్యాపార సంస్థలను భయపెట్టే చర్యగా నాడు జేపీ వ్యాఖ్యానించడాన్ని వారు గుర్తు చేశారు. ‘లెసైన్సు లేకుండా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించడం తప్పు అని రిజర్వు బ్యాంకు నోటీసులు జారీ చేస్తే... ఈనాడుపై జరుగుతున్న రాద్ధాంతం అంతా అంశాల్ని బట్టి కాకుండా చాలా వ్యక్తిగతంగానూ, క్షణికంగానూ అనిపిస్తోందని జేపీ ఆరోజు చెప్పారు. డిపాజిటర్లు ఎవరూ ఫిర్యాదు చేయక పోయినా ఈ కేసును ఎందుకు సృష్టించి పెంచుతున్నారని ఆనాడు జయప్రకాష్ చెప్పారు. మరి ఈ విషయం జగన్‌కు వర్తించదా? జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా? మరి కేసులు ఎందుకు పెట్టినట్లు?’ అని ప్రశ్నించారు. మార్గదర్శి అక్రమాలను సమర్థిస్తూ జేపీ మాట్లాడిన పత్రికా క్లిప్పింగ్‌లను వారు ప్రదర్శించారు. అవినీతి పోరులో జేపీకి చిత్తశుద్ధి ఉంటే అన్నింటిపై విచారణ జరపాల్సింగా కోరాలన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలను కూడా విమర్శించిన ఘనత జేపీదని వ్యాఖ్యానించారు. -
షర్మిల శంఖారావం రాష్ట్ర సమైక్యత కోసమే: కొణతాల రామకృష్ణ
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని తమ పార్టీ అనేక పర్యాయాలు లేఖలు, ప్రకటనల ద్వారా అర్ధించిన ప్పటికీ ప్రజలకు అన్యాయం చేసైనా సీట్లు, ఓట్లు పొందాలని కాంగ్రెస్, టీడీపీలు తెగబడిన నేపథ్యంలో, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటాన్ని తావుు వురింత ఉధృతం చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తున్నట్టు వైఎస్సార్సీపీ రాజకీయు వ్యవహారాల కమిటీ సవున్వయుకర్త కొణతాల రావుకృష్ణ చెప్పారు. అందుకే,.. ప్రజల పక్షాన గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృ త్వంలో పార్టీ నేతలందరం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ఇతర పార్టీల అధినేతలకు రాష్ట్ర ప్రజల ఆందోళనను, తాజా పరిస్థితిని వివరించామని చెప్పా రు. స్టేక్హోల్డర్లు అందరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం రావణకాష్టంగా తయూరవుతుందని కూడా తెలిపామన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయసాధన కోసమే తావుు కృషిచేస్తావుని, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా, దాన్ని గట్టిగా వ్యతిరేకించడంలో పార్టీ ముందు వరుసలో ఉంటుందని అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సమైక్యతను కాపాడటమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు షర్మిల ‘సమైక్య శంఖారావం’ పేరుతో బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, ఆప్యాయతలు సమైక్య రాష్ట్రం లోనే సాధ్యం అన్న భావాలకు అనుగుణంగానే పార్టీ ఉద్యమం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు న్యాయుం చేయూలని తమ పార్టీ ప్లీనరీ నుంచి నేటి వరకు అనేక పర్యాయాలు తమ లేఖల్లో, ప్రకటనల్లో అర్థించినా కాంగ్రెస్, టీడీపీలు వూత్రం ఓట్లు, సీట్లకోసమే తెగించాయున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తోకపార్టీగా వ్యవహరిస్తున్నది టీడీపీ వూత్రమేనని కొణతాల విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది టీడీపీ సాయంతో కాదా? అని ఆపార్టీ అధినేత చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ తోక పార్టీ అని ప్రజలకు తెలుసు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నుంచి రెండు సార్లు గట్టెక్కించి, నాలుగున్నర ఏళ్లుగా కాంగ్రెస్‌కు అన్ని విధాలా సహకరిస్తూ తోకపార్టీగా వ్యవహరిస్తున్నది టీడీపీనే అన్నది ప్రజలందరికీ తెలుసునని, చంద్రబాబు ఆలోచనలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయాలు ఒకటేనని కొణతాల విమర్శించా రు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత నిందలు వేస్తారు. సాగునీటి సమస్య, ప్రస్తుత సంక్షోభాలు వైఎస్ వల్లే వచ్చాయంటారు. రాజశేఖరరెడ్డి పరిపాలన ఏ విధంగా సాగిందో ప్రజలకు తెలియదనుకుంటున్నారా?’ అని బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భావించిన వైఎస్.., ఇరిగేషన్, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ప్రాంతీయ భేదం లేకుండా ఒక సంతృప్త స్థారుులో సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో దురదృష్టం కొద్దీ కాంగ్రెస్,.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఆటలాడుతోందని, ప్రధాన ప్రతిపక్షం అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సవుస్యలుండగా, వాటి కి పరిష్కారం చూపకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. వైఎస్‌పై నిందలు వేస్తున్న చంద్రబాబు తానేం చేశారో గుర్తుచేసుకోవాలన్నారు. ‘రాష్ట్రాన్ని విభజించాలంటూ 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేఖ ఇచ్చారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సీఎంగా రోశయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఆ తర్వాత ప్రధానికి లేఖలు రాశారు. కేంద్ర హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చెప్పారు.’ రాష్ట్రాన్ని విభజించాలంటూ, ఇలా అనేక సందర్భాల్లో చెప్పారే కానీ, విభజనతో తలెత్తే సమస్యలను ఎప్పుడూ ప్రస్తావించలేకపోయారని కొణతాల వివుర్శించారు. ప్రజల దారే నాదారి అంటున్న చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విభజిస్తే రెండు ప్రాంతాలకూ నష్టమే ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ తీసుకున్న ఏక పక్ష నిర్ణయాల వల్ల రెండు ప్రాంతాలకూ నష్టమేనని కొణతాల అన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించు అనే స్వభావంతో వ్యవహరిస్తోందని, కొణతాల దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించి పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామంటోందని, అదే ప్రాణహిత-చేవెళ్లను ప్రస్తావించకపోవడం చూస్తే వారి ఆలోచన ఏంటో తెలుస్తోందన్నారు. రెండు ప్రాజెక్టులకూ జాతీయ హోదా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని కొణతాల విమర్శించారు. -
బాబూ! రాజీనామాలు చేసి ముందుకు రండి: కొణతాల
-
బాబూ! రాజీనామాలు చేసి ముందుకు రండి: కొణతాల
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినవారు రాజీనామాలు చేసి ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ పిలుపు ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు సమస్యకు పరిష్కార మార్గం చూసిస్తారని అందరూ ఎదురు చూస్తుంటే ఆయన దివంగ మహానేత డాక్టర్ వైఎస్‌ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. ఊకదంపుడు ఉపన్యాసం చేసినట్లు తెలిపారు. ఓట్ల రాజకీయాలు చేస్తున్నరని విమర్శించారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతగా రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేసే ఆలోచన వారికి లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోలేదన్నారు. అందరితో సంప్రదించి, అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకొని ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విభజించాలన్నారు. ప్రజల సమస్యలను వదిలిపెట్టి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం మంచిదికాదన్నారు. సమస్యలను పరిష్కరించలేనప్పుడు, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని తాము ముందు నుంచి చెబుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సమస్యలు కూడా తమకు ముఖ్యమే అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినట్టే సీమాంధ్ర సెంటిమెంట్‌ను కూడా గౌరవిస్తున్నట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు. -
పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది: విజయమ్మ
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందని, నెలరోజులుగా ఉద్యమం జరుగుతూ ఉన్నా, రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోతున్నా కేంద్రం నుంచిగానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ ఒక్క మాట కూడా రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల పట్ల జగన్ చాలా బాధపడ్డారని, విభజన చేస్తున్నారని తెలిసి వైఎస్ కలలుగన్న రాష్ట్రం ఇలా అయిందేమిటని కలత చెందారని ఆమె అన్నారు. శుక్రవారం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు విభజనను నివారించాలని జగన్ దీక్ష చేస్తానన్నపుడు తాను నివారించినా వినలేదని ఆమె అన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న జగన్‌ను చూడటానికి వెళితే అనుమతించలేదని, చివరకు శోభా నాగిరెడ్డి తదితరులు ఇక్కడే ధర్నా చేస్తామని హెచ్చరించిన తరువాత తనను మాత్రమే లోపలికి పంపారని ఆమె వివరించారు. జగన్ కోసం ఎక్కడా దుందుడుకు చర్యలకు పాల్పడరాదని, నిరసనలు శాంతియుతంగానే తెలపాలని విజయమ్మ అందరికీ విజ్ఞప్తి చేశారు. ‘మనం ప్రజల కోసం పోరాడుతున్నాం.. ప్రజల పక్షాన నిలబడుతున్నాం. కనుక ప్రజల కోసం బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది కనుక దీక్ష విరమించాలని జగన్‌ను కోరతా...’ అని విజయమ్మ అన్నారు. జగన్‌కు, రాష్ట్రానికి అంతా మేలు జరగాలని దేవుడిని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. ఆమెతో పాటుగా మీడియా సమావేశంలో పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు కొణతాల రామకృష్ణ, భూమా శోభానాగిరెడ్డి పాల్గొన్నారు. -
మహానేతపై నిందలు తగదు: కొణతాల
-
మహానేతపై నిందలు వేయడం తగదు: కొణతాల
రాష్ట్ర విభజనకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బీజం వేశారని కాంగ్రెస్, టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో రోశయ్య కమిటీ విధివిధానాలు కాంగ్రెస్, టీడీపీ నేతలకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో లేని వ్యక్తిపై అభండాలు వేయడం తగదు అని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకీ డ్రామాలు కొణతాల మండిపడ్డారు. అప్పటి రోశయ్య కమిటీలో నేనూ సభ్యుడినే అని కొణతాల అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ లబ్ధి కోసం, బెయిల్ కోసం దీక్ష చేయాల్సిన అవసరం లేదు అని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి వైఖరి స్పష్టం చేయాలి ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై లేఖకు కట్టుబడి ఉంటారో.. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటారో స్పష్టం చేయాలి కొణతాల సూచించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నిందలు వేయడం తగదని కొణతాల సూచించారు. అప్పటి పరిస్థితుల్లో శాసనసభ్యులు నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేరవేయడం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణ విషయంపై రాజశేఖరరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని.. అందుకే 2009 శాషనసభలో స్పష్టమైన ప్రకటన చేసి..రోశయ్య అధ్యక్షతన కమిటీ వేసిన విషయాన్ని మీడియా సమావేశంలో కొణతాల వెల్లడించారు. రాజకీయ లబ్ది కోసం చనిపోయిన మహానేతపై నిందలు వేయడం తగదు ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు, ప్రస్తుత పరిస్థితులకు కారణం తెలుగుదేశం పార్టీ, ఆపార్టీ అధినేత చంద్రబాబేనని అన్నారు. రాష్ట్ర విభజనకు సుముఖం అంటూ తెలుగుదేశం పలు పర్యాయాలు లేఖలు ఇవ్వడం జరిగింది అయన తెలిపారు. టీఆర్ఎస్ తోపొత్తు పెట్టుకున్నపుడు, 2012 లో కూడా లేఖ ఇచ్చిందని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ కూడా చంద్రబాబు ప్రకటన చేశారన్నారు. 4 లక్షల కోట్లతో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు తెలిపిన విషయాన్ని మీడియా ముఖంగా తెలిపారు.