తెలంగాణ ఏర్పాటు విషయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నిందలు వేయడం తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొణతాల రామకృష్ణ సూచించారు. అప్పటి పరిస్థితుల్లో శాసనసభ్యులు నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేరవేయడం జరిగిందని రామకృష్ణ తెలిపారు. తెలంగాణ విషయంపై రాజశేఖరరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని.. అందుకే 2009 శాషనసభలో స్పష్టమైన ప్రకటన చేసి..రోశయ్య అధ్యక్షతన కమిటీ వేసిన విషయాన్ని మీడియా సమావేశంలో కొణతాల వెల్లడించారు. రాజకీయ లబ్ది కోసం చనిపోయిన మహానేతపై నిందలు వేయడం తగదు ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు, ప్రస్తుత పరిస్థితులకు కారణం తెలుగుదేశం పార్టీ, ఆపార్టీ అధినేత చంద్రబాబేనని అన్నారు. రాష్ట్ర విభజనకు సుముఖం అంటూ తెలుగుదేశం పలు పర్యాయాలు లేఖలు ఇవ్వడం జరిగింది అయన తెలిపారు. టీఆర్ఎస్ తోపొత్తు పెట్టుకున్నపుడు, 2012 లో కూడా లేఖ ఇచ్చిందని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ కూడా చంద్రబాబు ప్రకటన చేశారన్నారు. 4 లక్షల కోట్లతో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు తెలిపిన విషయాన్ని మీడియా ముఖంగా తెలిపారు.