telangana issue
-
ఢిల్లీలో హై అలర్ట్
-
తెలుగు ప్రజలకు మొండిచేయి
సాక్షి, ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్ కర్గే తొలిసారిగా ప్రవేశపెట్టిన 2014-15 మధ్యంతర రైల్వే బడ్జెట్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు నిరాశను కలిగించింది. ప్రయాణికులపై ఎలాంటి భారం వెయ్యనప్పటికీ ముంబైతోపాటు రాష్ట్రంలో నివసించే తెలుగు ప్రజలకు మాత్రం ఈ బడ్జెట్‌తో పెద్దగా ఒరిగిందేమిలేదు. ఒక ముంబై-చెన్నై మార్గంలో వారికి మినహా మిగతా ప్రాంతాల్లో నివసించే తెలుగు ప్రజలందరికి ఖర్గే మొండిచేయి చూపించారు. అయితే రాష్ట్రంలోని ప్రయాణికులందరిని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం బడ్జెట్ బాగానే ఉందని రాష్ర్టవాసులందరూ చర్చించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన కార్యాలయాలు ఉన్న పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలలో తొమ్మిది ప్రీమియం (సెంట్రల్ నాలుగు, వెస్ట్రన్ ఐదు), 17 ఎక్స్‌ప్రెస్ (సెంట్రల్ ఏడు, వెస్ట్రన్ తొమ్మిది, దక్షిణ మధ్య జోన్లో ఒకటి) రైళ్లు కొత్తగా ప్రకటించారు. వీటిలో పశ్చిమ రైల్వే మార్గంలో ప్రకటించిన అనేక రైళ్లు గుజరాతీయులకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. అయితే సెంట్రల్ రైల్వే మార్గం మీదుగా ప్రకటించిన కొత్త రైళ్లు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. వీటితోపాటు మరొక కొత్త రైలు మాత్రం దక్షిణ మధ్య జోన్‌లోని నాందేడ్-ఔరంగాబాద్‌ల మధ్య ప్రకటించారు. రాష్ట్రం మీదుగా వెళ్లే ఈ రైళ్లలో రెండు ప్రీమియం, ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కర్ణాటక మీదుగా వెళ్లేవి ఉన్నాయి. ముంబై నుంచి.... రైల్వే బడ్జెట్లో మల్లికార్జున్ ఖర్గే కొత్తగా ప్రకటించిన రైళ్లలో ముంబైకి మొత్తం 10 రైళ్లు లభించాయి. వీటిలో సెంట్రల్ రైల్వే మార్గంలో ఆరు రైళ్లు, పశ్చిమ రైల్వే మార్గంలో నాలుగు రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో తెలుగు ప్రజలకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు మాత్రం ఒకే ఒక్క రైలుంది. ముంబై- చెన్నై ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అదోని, కడప, గుంతకల్ తదితర ప్రాంతాలమీదుగా వెళ్లనుంది. మిగతావాటిలో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే రైళ్లు లేవు. దీంతో ముంబైలో నివసించే తెలుగు ప్రజల్లో కొంత నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవలే ప్రారంభించిన ఎల్టీటీ-నిజామాబాద్, ఎల్టీటీ-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ల సర్వీసులైనా కనీసం పెంచుతారని భావిస్తే అది కూడా జరగలేదు. ఎల్టీటీ- నిజామాబాద్ రైలును డైలీ చేయడంతోపాటు ఠాణేలో కూడా స్టాప్ ఇవ్వాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. మరోవైపు ముంబై నుంచి హైదరాబాద్‌కు వయా నిజామాబాద్ మీదుగా మరో కొత్త రైలును ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నా అలాంటిదేమీ జరగలేదు. ఐదు ప్యాసింజర్లు... రాష్ట్రంలో ఐదు కొత్త ప్యాసింజర్ రైళ్లను ఈసారి బడ్జెట్లో ప్రకటించారు. వీటిలో ప్రధానంగా నిమచ్-హింగోళి, కరాడ్-పండర్పూర్, పుణే-మోర్గావ్, పుణే-అహ్మద్‌నగర్, పుణే-కొల్హాపూర్‌లు ఉన్నాయి. కొత్త మార్గాలు... ఈ బడ్జెట్లో పలు కొత్త రైల్వేమార్గాలను ప్రతిపాదించారు. వీటిలో రాష్ట్రానికి సంబంధించి ఆరు మార్గాల ప్రస్తావన ఉంది. వీటిలో పుణే - అహ్మద్‌నగర్ వయా కెడాగావ్ కస్తీతోపాటు పుణే - బారామతి వయా సాసవాడ్, జేజూరి, మోరేగావ్ మార్గాలున్నాయి. కరాడ్ - కడేగావ్ - ఖర్సుంది - అట్టపడి - దిగాంచి -మహుద్ - పండర్పూర్, బెతూల్ - చందూర్‌బజార్ - అమరావతి మార్గం, ఘాటనందూర్ - శ్రీగోండా రోడ్డు/దౌండ్ వయా కైజ్, మంజార్సుంబా, పటోదా, జామ్ఖేడ్ మార్గాలు ఉన్నాయి. మరోవైపు లాతూర్ రోడ్డు-కుర్దువాడి, పుణే-కొల్హాపూర్ మార్గాలను డబ్లింగ్ చేయనున్నట్టు ప్రతిపాదించారు. ప్రధానమైన కొత్త ప్రీమియం రైళ్లు... పుణే-హౌడా వయా మన్మాడ్, నాగపూర్ (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి రెండుసార్లు). ముంబై-హౌడా వయా నాగపూర్, రాయిపూర్ (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి రెండుసార్లు). నిజాముద్దీన్-మడ్గావ్ వయా వసాయి రోడ్డు (ఏసీ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు). యశ్వంత్‌పూర్-జైపూర్ వయా పుణే, వసాయి రోడ్డు (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి ఒకసారి). ప్రధానమైన కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు... ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి) ముంబై-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ వయా షోలాపూర్, బీజాపూర్ (వారానికి ఒకసారి) ముంబై-కార్మాలి ఎక్స్‌ప్రెస్ వయా రోహ (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి ఒకసారి) ఔరంగాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్,తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి) -
రెండోరోజూ ‘టీ’ రగడ
* లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం * సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు * ఉభయ సభలూ నేటికి వాయిదా * తెలంగాణపై చర్చ కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం * అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చిన మోదుగుల, సబ్బం * సభ అదుపులో లేకపోవడంతో పరిశీలించలేకపోతున్నానన్న స్పీకర్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశం వరుసగా రెండోరోజు కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఇతర అంశాలపై వివిధ పార్టీల నేతలు కూడా ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పలుమార్లు వారుుదా పడినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారానికి వారుుదా పడ్డారుు. - గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. - పార్టీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై చర్చించాలంటూ సభలో వాయిదా తీర్మానం కూడా పార్టీ ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన సబ్బం హరి, టీడీపీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. -ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే రాష్ట్ర ఎంపీలు సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు. - సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు వెల్‌లోకి వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో సీమాంధ్ర ఎంపీలు సాయిప్రతాప్, ఎం.వేణుగోపాల్‌రెడ్డిలు కూడా వెల్‌లోకి వచ్చారు. - తెలంగాణ ఎంపీలు విభజన బిల్లును వెంటనే సభ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తమిళనాడు జాలర్లపై శ్రీలంక వేధింపులకు నిరసనగా డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. అకాలీదళ్ సభ్యులు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను లేవనెత్తారు. - ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి అంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రారంభమైన మూడు నిమిషాలకే లోక్‌సభ వారుుదా పడింది. - మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ‘ఇది చివరి సమావేశం.. సభను శాంతియుతంగా సాగనివ్వండి..’ అంటూ స్పీకర్ కోరారు. సభ్యుల నినాదాల మధ్యే కొద్దిసేపు సభా కార్యక్రమాలను కొనసాగించారు. - 12.16కు అవిశ్వాస తీర్మానం నోటీసులపై మీరాకుమార్ ప్రకటన చేశారు. ‘ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మూడు నోటీసులు వచ్చాయి. ఈ తీర్మానాలకు మద్దతిచ్చేందుకు 50 మంది సభ్యులు వారి వారి స్థానాల్లో లేచి నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు నేను వీటిని అనుమతించాలో లేదో నిర్ణయించగలను. కానీ సభ అదుపులో లేదు.. అందువల్ల ఈ తీర్మానాలను పరిశీలించలేక పోతున్నాను’ అని చెప్పారు. కొద్దిసేపటికే లోక్‌సభ శుక్రవారానికి వారుుదా పడింది. - సభ అదుపులో లేనప్పటికీ కేంద్రం పలు నివేదికలను ప్రవేశపెట్టింది. మొత్తంగా రెండోరోజు లోక్‌సభ కేవలం 15 నిమిషాల పాటే కొనసాగింది. జేడీయూ ఎంపీలతో వైఎస్సార్సీపీ చర్చలు లోక్‌సభ వాయిదా అనంతరం జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డిలతో పాటు మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలు రాజ్యసభలో జేడీయూ సభానాయకుడు శివానంద్ తివారీ, ఎంపీ ఎంకే సింగ్‌లతో పార్లమెంట్ సెంట్రల్హాల్లో భేటీ అయ్యారు. వారితో విభజన బిల్లుపై చర్చించిన నేతలు బిల్లును అడ్డుకునేందుకు సహకరించాలని కోరారు. శాసనసభ బిల్లును తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేసిన జగన్.. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందని వారికి వివరించారు. రెండు ప్రాంతాలకూ శుభవార్త: జేడీ శీలం ‘నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు. తెలుగువారికి న్యాయం చేస్తుంది. తెలంగాణ వారికి శుభవార్త, సీమాంధ్ర వారికి కూడా శుభవార్త ఉంటుంది..’ అని కేంద్ర మంత్రి జేడీ శీలం వ్యాఖ్యానించారు. కిరణ్ చరిత్రకు త్వరలో ముగింపు: పొన్నం ‘టీ బిల్లును ఆపాలన్న ఆలోచన పొరపాటు. ముఖ్యమంత్రి కిరణ్ చరిత్ర త్వరలో ముగుస్తుంది. తెలుగువాడి పరువు ప్రతిష్టలను ఢిల్లీలో మంటగలిపారు..’ అని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కమల్‌నాథ్ కాంగ్రెస్ ఎంపీలను రెచ్చగొట్టారు లోక్‌సభలో గురువారం తాము అవిశ్వాసం నోటీసుపై స్పీకర్ అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సభలో గందరగోళం సృష్టించడానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎంపీలను రెచ్చగొట్టారని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాసానికి 71 మంది ఎంపీల మద్దతు కూడా ఉందని, అవిశ్వాసానికి అనుమతిస్తే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలేదని వారు పేర్కొన్నారు. ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణరావు పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలోనూ గందరగోళం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలతో మూడు నిమిషాలకే వాయిదాపడింది. సమైక్యాంధ్ర నినాదాల మధ్య తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగా.. మళ్లీ గందరగోళం నెలకొంది. ఆరు నిమిషాల తరువాత సభాపతి మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని చెబుతూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రారంభమైన ఒక నిమిషానికే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ ప్రకటించారు. రాజ్యసభలోనూ తమిళ జాలర్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏఐడీఎంకే, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. వివిధ అంశాలపై ఎస్పీ, వామపక్షాలు, అకాలీదళ్ సభ్యులు నిరసన వ్యక్తం చేసినా గందరగోళంలో ఏమీ విన్పించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతో పాటు పలు కుంభకోణాలను బీజేపీ సభ్యులు లేవనెత్తారు. సభలో గందరగోళంపై అసహనంగా కన్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సీట్లో నుంచి లేచి పక్కకు వెళ్లారు. ఆందోళన చేస్తున్న సభ్యులకు ఏవో సైగలు చేస్తూ, ఎద్దేవా చేస్తున్నట్టుగా కన్పించారు. -
సైకిల్ పంక్చర్
తెలంగాణ అంశంపై టీడీపీ అనుసరిస్తున్న రెండు కళ్ల విధానంతో జిల్లాలో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోగా.. మరో ఎమ్మెల్యే సైతం వారి దారిలో వెళుతున్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు గులాబీ గూటికి చేరాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే సీటు ఖరారు కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆదివారం మంతనాలు జరిపిన ఆయన.. టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. సాక్షి, నిజామాబాద్/నిజాంసాగర్, న్యూస్‌లైన్ మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరితో విసిగి వేసారిపోయిన ఆ పార్టీ నాయకులు పార్టీలు మారుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ప్రజాభీష్టం మేరకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు టీడీపీకి గుడ్ బై చెప్పి, గులాబీ గూటికి చేరారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే సైతం టీడీపీని వీడతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడుతోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు బుజ్జగించడంతో ఆయన తెలుగు దేశం పార్టీలోనే కొనసాగారు. ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి తెలంగాణ ఏర్పాటకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో చంద్రబాబు పూటకో మాట మార్చుతుండడంతో టీడీపీకి చెందిన ఈ ప్రాంతంలోని నాయకులు ఇబ్బం ది పడుతున్నారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు వచ్చాయి. ఇందుకు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ. కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు జిల్లాలో కార్యరూపం దాల్చలేదు. ఒకటీ రెండు గ్రామా ల్లో మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చి నేతలు చేతులు దులుపుకున్నారు. ఇటీవల జరిగిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించలేదు. వేదికపై ఉన్న నేతలకంటే సమావేశానికి హాజరైన కార్యకర్తల సంఖ్య తక్కువగా ఉందంటే ఆ పార్టీ క్యాడర్‌ను ఏమేరకు కోల్పోయిందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ ఉండదని.. తెలంగాణ రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరిన సమయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖ రి ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారిం ది. ఇంకా ఆ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్ ఉండదని భావిస్తున్న పలువురు నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే అంశంపై జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మూడు రోజులపాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. వారు టీఆర్ఎస్లో చేరడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జుక్కల్ టికెట్టు ఇస్తామంటేనే టీఆర్ఎస్లో చేరాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయమై హన్మంత్ సింధే ఆదివారం హైదరాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశమై మంతనాలు జరిపా రు. అనంతరం టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. త్వరలో జుక్కల్‌లో బహిరంగ సభ నిర్వహించి, కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. మరో ఇద్దరు.. టీడీపీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి నిట్టు వేణుగోపాల్‌రావు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా టీడీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. జిల్లా కోటకు బీటలు టీడీపీకి ఒకప్పుడు జిల్లా కంచుకోటగా ఉండే ది. 2009 ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకుగాను ఐదింటిని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. పోచారం, గంప, తాజాగా సింధే పార్టీని వీడారు. జిల్లా లో ఇప్పటికీ నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలు లేరు. దీనికి జుక్కల్ జత కలుస్తోంది. ఎల్లారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలకు నాలుగేళ్లుగా ఇన్చార్జిలను ఖరారు చేయలేని పరిస్థితి ఉంది. ఎల్లారెడ్డి నియోకవర్గ ఇన్చార్జి పదవిని ఇస్తామంటూ అధినేత బుజ్జగించినా కూడా తీసుకునేందుకు నేతలెవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితి టీడీపీని కలవర పరుస్తోంది. -
వైయస్సార్సీపి సమైక్య ఉద్యమ కార్యాచరణ
-
రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి: డీజీపీ
-
తెలంగాణ తకరారుతో దిగజారిన ఇండియా స్థానం
'డూయింగ్ బిజినెస్ 2014' పేరిట వరల్డ్ బ్యాంకు రూపొందించిన దేశాల బిజినెస్ ఇండెక్స్ జాబితాలో భారత్ 134వ స్థానానికి జారిపోయింది. గత ఏడాది 131వ స్థానంలో ఉన్న ఇండియా మరో 3 స్థానాలు జారిపోవడానికి అనేక కారణాలలో తెలంగాణా అంశం కూడా ఒకటని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పొరుగున ఉన్న చిన్న దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే ఇండియా వెనకపడిపోవడం, సువిశాలమైన భారత ఉపఖండం వ్యాపారానికి ప్రతికూలం అన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడటం మరింత ఆందోళనకరమైన అంశాలు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన తర్వాత తెలంగాణ అంశం తిరిగి పేట్రేగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడింది. రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోయాయి. అంతర్జాతీయంగా హైద్రాబాదుకి ఉన్న బ్రాండ్ నేమ్ మసకబారడం ప్రారంభించింది. బిబిసి, రాయిటర్స్, ఎ.ఎఫ్.పి, ఐ.ఎ.ఎన్.ఎస్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్ధలతో పాటు వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ది గార్డియన్ లాంటి వార్తా పత్రికలు కూడా తెలంగాణ అంశం వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీసిన వైనం మీద కథనాలు ప్రచురించడం ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్ధలను ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి. తెలంగాణా అంశం కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అది దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసింది, దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం చేస్తున్న డిమాండ్లకి మళ్లీ ప్రాణం పోసింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది. కాబట్టి, దేశంలోని వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చేసిన ముఖ్యాంశాలలో ఒకటిగా నిలిచింది. రూపాయి విలువ పతనం వల్ల ఇన్పుట్ వ్యయం పెరగడం, డిమాండ్ బలహీనంగా ఉండడం, రుణాలు ఒక పట్టాన దొరక్కపోవడం, అధిక వడ్డీరేట్లు.... ఫలితంగా వృద్ధి ప్రభావితం కావడం వంటి అంశాలకు ఒక రాజకీయ, సామాజిక కారణంగా కూడా తెలంగాణ అంశం జోడయ్యింది. ఇక దేశంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లే అవినీతి, లంచగొండితనం, లెక్కకు తేలని కుంభకోణాలు ఇండియా పతనానికి మరింత మూలమయ్యాయి. భారత కార్పొరేట్లలో వ్యాపారం మీద విశ్వాసం క్షీణించి, ఇటీవల బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 49 పాయింట్లకు పడిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ నిరాశావహమైన బిజినెస్ వాతావరణం వల్ల, 189 దేశాల 'డూయింగ్ బిజినెస్ 2014' జాబితాలో మనం 134 స్థానానికి దిగజారవలసి వచ్చింది. -
‘తెలంగాణ’తో ముందస్తు ఎన్నికలు: శరద్ పవార్
ముంబై: తెలంగాణ అంశంపై తాజాగా తలెత్తుతున్న పరిణామాల కారణంగా రానున్న రోజుల్లో పలువురు లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అన్నారు. ‘ఎకనామిక్ టైమ్స్’ దినపత్రికతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, 2014 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో పోటీచేసి, రాజ్యసభకు వెళతానని అన్నారు. తెలంగాణ అంశం రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపగలదని, తనకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నారని చెప్పారు. వారు రాజీనామాలు చేసినట్లయితే, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. -
మూడు రోజులు హస్తినలో మకాం.. టీ కాంగ్రెస్ నేతల నిర్ణయం
టీ కాంగ్రె స్ నేతల నిర్ణయం... సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే వారు ఢిల్లీకి వెళుతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాంవేసి కేంద్రం, హైకమాండ్‌లోని పెద్దలందరినీ కలవాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు సహా దాదాపు 90 మంది వరకు హస్తినకు వెళుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు శనివారం తెలిపాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌షిండే, ఆంటోనీ, వీరప్పమొయిలీ, గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్‌తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ కలిసేందుకు నిర్ణయించారు. ఇటీ వలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి వెళతారా? లేదా? అనేది పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పెద్దలను కోరనున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భయాందోళనలను పారదోలేందుకు తగిన భరోసా కూడా కేంద్రం తరఫున ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు తొందరగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా ఒత్తిడి చేయడానికే ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు. -
తెలంగాణ విభజనపై చర్చ
-
ఓకన్నేసి ఉంచుదాం!
ఢిల్లీకి టీఆర్ఎస్ నేతల బృందం కేసీఆర్ నివాసంలో భేటీలో నిర్ణయం బృందంలో మందా, వివేక్, కేకే దసరాలోపే కరీంనగర్లో సభ! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్రం స్థాయిలో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి పార్టీకి చెందిన ఎంపీలను, మాజీ ఎంపీలను ఢిల్లీకి పంపాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కదలికలను బట్టి కార్యాచరణకు దిగాలనే యోచనతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు శుక్రవారం పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నివాసంలో సమావేశమయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఢిల్లీలోనే ఉండటంతో తెలంగాణకు వ్యతిరేకంగా ఏమన్నా అడుగులు పడతాయేమోనని ఈ సమావేశంలో కొందరు నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రమంత్రులను, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవటానికి వీలుగా ఢిల్లీ వర్గాలతో సంబంధాలు గల వారితో ఒక బృందం బయలుదేరి వెళ్లాలని నిర్ణయించారు. ఈ బృందంలో ఎంపీలు మందా జగన్నాధం, జి.వివేక్, మాజీ ఎంపీలు కె.కేశవరావు, ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్ తదితరులుంటారని తెలిసింది. ఇదిలావుంటే.. తెలంగాణ జేఏసీ ఈ నెల 29న నిర్వహించబోయే సకలజన భేరి కోసం ఈ నెల 25న టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. కరీంనగర్లో దసరా లోపల భారీ బహిరంగసభను నిర్వహించాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నారు. అయితే దీనిపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయం జరగలేదని పార్టీ నేతలు వెల్లడించారు. కేసీఆర్‌తో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు కేకే, కడియం శ్రీహరి, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సహనాన్ని పరీక్షించొద్దు: హరీష్‌రావు సామరస్యపూరిత వాతావరణంలో రాష్ట్రం ఏర్పాటుకావాలనే ఉద్దేశంతో సహనంగా ఉన్నామని, దీనిని చేతకానితనంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావించొద్దని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకులు టి.హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ విభజన నిర్ణయం జరిగిపోయిందని, సీఎం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఆపలేరని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం ఇష్టం లేకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో హరీష్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు కె.హరీశ్వర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సీమాంధ్ర జిల్లాల్లో కృత్రిమ సమైక్య ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి సీఎం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడని హరీష్ విమర్శించారు. తెలంగాణ కోసం సకలజనుల సమ్మె జరుగుతున్నప్పుడు రెండ్రోజులకోసారి ప్రెస్ మీట్లు పెట్టి రైతులకు కరెంటు రావడం లేదని, విద్యా సంవత్సరం పోతోందని, ఉద్యోగ ప్రకటనలు చేయలేకపోతున్నామని, ఆర్టీసీ నష్టపోతోందని చెప్పాడంటూ పాత వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. తెలంగాణలో రచ్చబండలు పెట్టి పింఛన్లు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ‘ఇప్పుడు సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం జరుగుతుంటే ఆర్టీసీ నష్టపోవడం లేదా? విద్యార్థులకు విద్యా సంవత్సరం పాడు కావడం లేదా? చీకట్లో గ్రామాలు ఇబ్బందులు పడటం లేదా?’ అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమం బలహీనపడకుండా ఉండటానికే 14 లక్షల రేషన్‌కార్డులను, 7 లక్షల పింఛన్లను పంపిణీ చేయకుండా సీఎం నిలిపేశాడని విమర్శించారు. సబ్‌ప్లాన్ నిధులను ఏడాదిలో ఖర్చుచేయాల్సి ఉండగా ఆరునెలలు పూర్తయినా ఇప్పటిదాకా 10 శాతం కూడా ఖర్చుచేయలేదన్నారు. జీహెచ్ఎంసీలో రాత్రిరాత్రికి రాత్రే 35 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం వెనుకు సీమాంధ్ర సంపన్నుల కుట్ర ఉందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌రెడ్డి చెప్పారు. -
సీమాంధ్రలో చిచ్చు పెట్టారు: చంద్రబాబు
సాక్షి,విజయవాడ: తెలంగాణ సమస్యను పరిష్కరించమంటే కాంగ్రెస్ నేతలు సీమాంధ్రలో చిచ్చుపెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టును కూడా వాళ్లు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర పేరుతో కృష్ణా జిల్లాలో ఆఖరురోజు గంపలగూడెం, తిరువూరు మండలాల్లో బాబు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా తిరువూరు, ఎర్రమాడుల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు, సీట్లు కోసం తెలంగాణపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుందన్నారు. టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను కలుపుకొని లాలూచీ రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలుగుజాతి రామలక్ష్మణుల్లా కలిసి ఉండాలని తెలుగుదేశం కోరితే వాలీ,సుగ్రీవుల లాగా విడదీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూ, ఆ అనుబంధాన్ని తెంచేస్తోందని విమర్శించారు. సీఎం కిరణ్ సోనియా వద్దకు పోయి మీ ఇష్టం వచ్చినట్లు చేయమని చెబుతారని, ఇక్కడకు వచ్చి సన్నాయి నొక్కుళ్లు నొక్కుతారని అన్నారు, ఆయన రేపో ఎల్లుండో సమైక్యాంధ్రప్రదేశ్ అనే పార్టీ పెడతారంటున్నారని విమర్శించారు. ఇండియా దివాళా తీసిందని అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ పేర్కొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలమయమైందని, రూ.5 ల క్షల కోట్లు దోచుకున్నారని, సోనియా అల్లుడూ దోచేసుకున్నారని అన్నారు. కాగా, ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బస్సుయాత్రకు కార్యకర్తలు కరువవడంతోపాటు, పశ్చిమగోదావరి జిల్లా నేతల నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం రాత్రితో తూతూ మంత్రంగా ముగించారు. ఈ బస్సుయాత్రలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎవరైనా నినాదాలు చేస్తే వారిపై పోలీసులు, చంద్రబాబు ప్రైవేటు సైన్యం మూకుమ్మడిగా దాడిచేసి వారి ఒళ్లు హూనం చేయడం గమనార్హం. -
'చంద్రబాబు తన అభిప్రాయం స్పష్టం చేసి యాత్ర చెయ్యాలి'
-
సా...గుతున్న ‘తెలంగాణ’.. రగులుతున్న సీమాంధ్ర
రాష్ట్ర విభజనపై నిర్ణయం ప్రకటించి నేటికి నెల సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించి నేటికి సరిగ్గా నెల రోజులు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అలాగే, విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో మొదలైన ఉద్యమం కూడా ఒక్క అడుగు వెనక్కితగ్గడంలేదు. రాజధాని హైదరాబాద్‌లో పోటాపోటీ ఆందోళనలు, సీమాంధ్రలో సకలజనుల సమ్మెతో రాష్ట్ర అగ్నిగుండంలా మారుతున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇంకా నోరుమెదపడం లేదు. ఎన్నికల వరకు విభజన అంశాన్ని నెట్టుకురావాలన్నదే కాంగ్రెస్ పెద్దల ఎత్తుగడగా కనిపిస్తోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. డిసెంబర్9 ప్రకటన నుంచి వివాదాస్పదమే... తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తదనంతరం రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో కేంద్రం డిసెంబర్ 23న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. తరువాత 2010 జనవరిలో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఏడాదిపాటు రాష్ట్రంలో పర్యటించి అందరి అభిప్రాయాలను సేకరించిన ఈ కమిటీ 2010 డిసెంబర్ ఆఖర్లో కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఆరు పరిష్కార మార్గాలను సూచించిన కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే అత్యుత్తమ మార్గమని అభిప్రాయపడింది. ఆ తరువాత 2011 జనవరిలో చిదంబరం మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అన్ని పార్టీలు అభిప్రాయాలను పంపాలని కోరారు. నాటి నుంచి మళ్లీ విభజన అంశాన్ని నాన్చుతూ రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ 2012 వరకు విభజన ఊసే ఎత్తలేదు. ఉపఎన్నికల్లో పరాభవం....విభజనపై నిర్ణయం! రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడం హైకమాండ్ పెద్దలు తెలంగాణ అంశంపై పునరాలోచనలో పడేలా చేసింది. అందుకే డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విభజనపై ఇదే ఆఖరు సమావేశమని, నిర్ణయమే తరువాయి అని ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టడం, విభజనపై ఎవరి వాదన వారు విన్పిస్తూ ఒత్తిడి తేవడంతో మళ్లీ ఏం చేయాలో బోధపడని హైకమాండ్ మరో ఆరు నెలల వరకు తెలంగాణ ఊసే ఎత్తలేదు. ఈ మధ్యకాలంలో సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో కాంగ్రెస్‌కు పరాభవం ఎదురు కావడంతో సీమాంధ్రలో ఏం చేసినా పార్టీ బాగుపడే అవకాశాల్లేవని కాంగ్రెస్ అధిష్టానం నిర్ధారణకు వచ్చింది. దీంతో విభజన దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే గతనెల 12న కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను పిలిపించి విభజనపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఆ తరువాత జూలై 26న మళ్లీ వాళ్లను ఢిల్లీకి పిలిపించి విభజన సమాచారాన్ని ఇవ్వడంతోపాటు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామనే పత్రాలపై ముగ్గురు నేతల సంతకాలను తీసుకుంది. ఆ తరువాత జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసింది. అదేరోజు యూపీఏ భాగస్వామ్యపక్షాలను సమావేశపరిచి విభజనపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ ప్రక్రియ ఇక ఆగదని, పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నాయని భావించిన తరుణంలో సీమాంధ్రలో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనలు మొదల య్యాయి. అదే సమయంలో తెలంగాణ నుంచీ విభజన ప్రక్రియను వేగవంతం చేయాలనే ఒత్తిళ్లు హైకమాండ్‌కు తాకుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట మేరకు ముందుకు పోవడమా? లేక వెనక్కు తగ్గడమా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్న కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ సమస్యను నాన్చివేసే దిశగా ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇలా 2009 డిసెంబర్ 9 మొదలు ఇప్పటి ఏకే ఆంటోనీ కమిటీ వరకు మొత్తం మూడున్నరేళ్ల ఎనిమిది నెలలుగా విభజనపై తప్పటడుగులు వేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తన మార్క్ రాజకీయాలతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి, ప్రజలను దిక్కుతోచని స్థితిలో పడేసింది. -
కిందపడ్డ నాదే గెలుపు అంటున్న టిడిపి.
-
నరం లేని కాంగ్రెస్ నాలుక
-
మహానేతపై నిందలు తగదు: కొణతాల
-
మహానేతపై నిందలు వేయడం తగదు: కొణతాల
రాష్ట్ర విభజనకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బీజం వేశారని కాంగ్రెస్, టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో రోశయ్య కమిటీ విధివిధానాలు కాంగ్రెస్, టీడీపీ నేతలకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో లేని వ్యక్తిపై అభండాలు వేయడం తగదు అని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకీ డ్రామాలు కొణతాల మండిపడ్డారు. అప్పటి రోశయ్య కమిటీలో నేనూ సభ్యుడినే అని కొణతాల అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ లబ్ధి కోసం, బెయిల్ కోసం దీక్ష చేయాల్సిన అవసరం లేదు అని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి వైఖరి స్పష్టం చేయాలి ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై లేఖకు కట్టుబడి ఉంటారో.. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటారో స్పష్టం చేయాలి కొణతాల సూచించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నిందలు వేయడం తగదని కొణతాల సూచించారు. అప్పటి పరిస్థితుల్లో శాసనసభ్యులు నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేరవేయడం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణ విషయంపై రాజశేఖరరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని.. అందుకే 2009 శాషనసభలో స్పష్టమైన ప్రకటన చేసి..రోశయ్య అధ్యక్షతన కమిటీ వేసిన విషయాన్ని మీడియా సమావేశంలో కొణతాల వెల్లడించారు. రాజకీయ లబ్ది కోసం చనిపోయిన మహానేతపై నిందలు వేయడం తగదు ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు, ప్రస్తుత పరిస్థితులకు కారణం తెలుగుదేశం పార్టీ, ఆపార్టీ అధినేత చంద్రబాబేనని అన్నారు. రాష్ట్ర విభజనకు సుముఖం అంటూ తెలుగుదేశం పలు పర్యాయాలు లేఖలు ఇవ్వడం జరిగింది అయన తెలిపారు. టీఆర్ఎస్ తోపొత్తు పెట్టుకున్నపుడు, 2012 లో కూడా లేఖ ఇచ్చిందని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ కూడా చంద్రబాబు ప్రకటన చేశారన్నారు. 4 లక్షల కోట్లతో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు తెలిపిన విషయాన్ని మీడియా ముఖంగా తెలిపారు. -
విభజన సమస్యలపై చర్చించేందుకు ప్రయత్నాలు చేశాం
-
రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో వినిపించని ‘తెలంగాణం’
సాక్షి, హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన సందేశాల్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై ఆ ప్రాంత కాంగ్రెస్‌నేతల్లో పలురకాల అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వామ్యపక్షాల ఏక గ్రీవ తీర్మానాలతో ప్రత్యేక రాష్ట్రంపై గంపెడాశలు పెట్టుకున్న నేతలను ఇప్పుడీ పరిణామం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనట్లు రాజ్యసభలో ఆర్థికమంత్రి పి.చిదంబరం ఇటీవలే స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. కేంద్ర న్యాయశాఖ ఇందుకు సంబంధించిన నోట్‌ను ప్రిపేర్ చేస్తున్నట్లు చెప్పారు. గత వారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకుంటారని అంతా ఎదురుచూశారు. అయితే న్యాయశాఖనుంచి నోట్ రూపొందకపోవడంతో ఆ కేబినెట్లో తెలంగాణ అంశాన్ని చేర్చలేదన్నట్లు వార్తలు వచ్చాయి. ఈనెల 17న కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్యపక్షాలు తెలంగాణపై చేసిన తీర్మానంతో సీమాంధ్ర ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్యమం ఉధృతమై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిణామం గా మారింది. సీమాంధ్ర ఉద్యమసెగలతో పార్లమెంటు సమావేశాలు కూడా ముందుకు సాగడం లేదు. యూపీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహారభద్రతా బిల్లుపై చర్చ కూడా నిలిచిపోయింది. తెలంగాణ అంశంపై సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్యపక్షాల సమన్వయ కమిటీ స్పష్టతలేని నిర్ణయం వల్లనేఇలాంటి పరిస్థితులు వచ్చాయని కాంగ్రెస్‌లోని సీమాంధ్ర నేతలతో సహా అన్ని విపక్షాలు మండిపడుతున్నాయి. స్పష్టత వచ్చేవరకు తొందరపాటు వద్దని సూచనలు వచ్చాయి. ఈ తరుణంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు తెలంగాణ ప్రక్రియను ఆపాలని సీమాంధ్ర నేతలనుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో రాష్ట్రపతి, ప్రధాని తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో తెలంగాణ నేతల్లో మరింతగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చారు. అప్పట్లో లోక్‌సభలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన ప్రణబ్‌ముఖర్జీ చేసిన ఉపన్యాసంలో తెలంగాణ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు సీడబ్ల్యూసీ తీర్మానం, దానికి యూపీఏ భాగస్వామ్య పక్షాల ఆమోదం లభించి నా రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో ఆ అంశం లేకపోవడం వెనుక కారణమేమై ఉంటుందన్న చర్చసాగుతోంది. సీమాంధ్ర లో ఉద్యమం, రాష్ట్రం లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న తరుణంలో తెలంగాణపైతాత్సారం చేయాలన్న ఉద్దేశమేమైనా ఉండొచ్చని కొందరు నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో తెలంగాణ అం శాన్ని చేరిస్తే అది ఉద్యమాన్ని మరింతగా పెంచి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుందేమోనన్న ఉద్దేశంతోనే చేర్చి ఉండకపోవచ్చన్న అభిప్రాయం కొందరు తెలంగాణ నేతలు వినిపిస్తున్నారు. అయితే సాధారణ ఎన్నికలకు ఎంతో సమయం లేని తరుణంలో తెలంగాణ ప్రక్రియ ఆలస్యమైతే చివరి నిమిషంలో పూర్తిగా నిలిచిపోతుందేమోనన్న భయం కూడా మరికొందరిలో ఏర్పడుతోంది. సీమాంధ్ర నేతలు మాత్రం తమ ఒత్తిడి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఒకింత వెనక్కు తగ్గుతోందని, ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో చేర్చకపోవ డానికి కారణమిదే కావచ్చని చెబుతున్నారు. -
ఫాంహౌస్‌లో ఏం చేస్తున్నావ్ కేసీఆర్?: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రకటనపై దేశ రాజధానిలో పెద్దఎత్తున మంతనాలు సాగుతున్న తరుణంలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఫాం హౌస్‌లో కూర్చుని ఏం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ పార్టీని పదేపదే విమర్శించినంత మాత్రాన తెలంగాణ వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ - టీఆర్ఎస్లకు మధ్య ఉన్న ‘బంధం’ ఏమిటో చెప్పాలని నిలదీశారు. బీజేపీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎన్.రామచంద్రరావు తదితరులు బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే పార్లమెంటుకు వెళ్లి తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టాలని సవాల్ చేశారు. -
ఉచిత విద్యుత్ పథకం అమలు కొనసాగేనా ?
తెలంగాణలో ఒక ఏడాదికి అవసరమయ్యే ఉచిత విద్యుత్ -11,460 మిలియన్ యూనిట్లు.. అంటే రోజుకుసగటున 31.40 ఎంయూలు తెలంగాణలో మొత్తం ఉత్పాదక సామర్థ్యం రోజుకు-75 ఎంయూలు వేసవి, రబీ సీజన్లో మొత్తం విద్యుత్ డిమాండ్ 150-160 ఎంయూలు అంటే రబీ సీజన్లో 75 నుంచి 80 ఎంయూల విద్యుత్ మార్కెట్లో కొనాల్సిందే ఒక్క రోజుకే రూ. 42 కోట్ల నుంచి రూ. 51 కోట్లు వెచ్చించాలి ఈ లెక్కన నాలుగు నెలల రబీ సీజన్‌కే రూ. 5,100 కోట్లు-రూ. 6,120 కోట్లు ఖర్చు చేయాలి ఏడాది అంతా అంటే రూ. 10 వేల కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఈ భారమంతా ప్రభుత్వమే భరిస్తుందా..? లేదా రైతులపైనే మోపుతుందా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకం అమలు చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ లోటును ఎదుర్కొనే తెలంగాణ ప్రాంతంలో ఈ పథకం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉచిత విద్యుత్ కనెక్షన్లు 31,75,512 ఉండగా.. అందులో ఒక్క తెలంగాణలోనే 18.22 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అంటే మొత్తం కనెక్షన్లలో 57.38 శాతం తెలంగాణలోనే ఉన్నాయన్న మాట. విభజన ప్రక్రియ తర్వాత ఉచిత విద్యుత్ పథకానికే తెలంగాణలో రోజుకు సగటున 31 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కుపైగా విద్యుత్ అవసరం ఏర్పడనుంది. ఇంత భారీ ఎత్తున విద్యుత్‌ను సరఫరా చేయాలంటే మార్కెట్లో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. ఇప్పటికే ప్రస్తుతం విద్యుత్ కొరత పేరుతో పరిశ్రమలకు నెలలో 18 రోజుల పాటూ కోతలు అమలవుతున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 7 గంటలు ఇస్తున్నామని చెబుతున్నా.. 2-3 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక విభజన అనంతరం... విద్యుత్ లోటు సమస్యను ఎదుర్కొనే తెలంగాణ ప్రాంతంలో ఉచిత విద్యుత్ పథకం పరిస్థితి ఏమవుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఈ పథకం అమలయ్యే అవకా శం ఉందా? విద్యుత్ లోటు పేరుతో వ్యవసాయానికి 7 గంటల సరఫరా కాస్తా మరింత తగ్గుతుందా? మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి రానుండటంతో ఆ భారాన్ని చార్జీల రూపంలో రైతులపైనే వేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్ ఆకాశంలో.. సరఫరా పాతాళంలో..: తెలంగాణలోని జెన్కోకు చెందిన థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్యం 2,282.5 మెగావా ట్లు. జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,541.8 మెగావాట్లు. సోలార్ పవర్ ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ వస్తుంది. అంటే తెలంగాణలో మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 4,825.3 మెగావాట్లు. అయితే జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తమ్మీద కేవలం థర్మల్ విద్యుత్ కేంద్రాలను (2282.5 మెగావాట్లు) తీసుకుంటే... రోజుకు 50 ఎంయూల (అంతర్గత వినియోగం పోను) మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనితో పాటు ప్రస్తుతం కేంద్ర విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 1,250 మెగావాట్లు వస్తుందనుకుంటే.. రోజుకు 25 ఎంయూల మేరకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం విద్యుత్ ఉత్పత్తి 75 ఎంయూ మేర ఉండనుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 250 ఎంయూ డిమాండ్ ఉంటుందని అంచనా. ఇందులో తెలంగాణ ప్రాంతంలో 120-125 ఎంయూ విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఇంధనశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంటే సుమారు 50 శాతం డిమాండ్ కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉండనుంది. వేసవి, రబీ సీజన్లో తెలంగాణలో డిమాండ్ ఏకంగా 150-160 ఎంయులకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన రబీ సీజన్లో 75 ఎంయూ నుంచి 85 ఎంయూ వరకూ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి రానుంది. ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ ధర సగటున 5-6 రూపాయల దాకా ఉంది. ఈ ధరతో 85 ఎంయూలు.. అంటే 8.5 కోట్ల యూనిట్లను కొనుగోలు చేయాలంటే... రోజుకు రూ.42.5 కోట్ల నుంచి రూ.51 కోట్ల మేర వెచ్చించాల్సి రానుంది. నాలుగు నెలల రబీ సీజనుకే ఏకంగా రూ.5,100 కోట్ల నుంచి రూ.6,120 కోట్ల దాకా వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ఏడాది మొత్తం లోటును పూడ్చేందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే ఈ మొత్తం రూ.10 వేల కోట్లకు చేరనుంది. ఇంత పెద్దమొత్తంలో భారాన్ని ప్రభుత్వం భరించే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఈ భారాన్ని రైతులపైనే మోపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయలేకపోతే... ఆ మేరకు పరిశ్రమలతో పాటు ఉచిత విద్యుత్ సరఫరా సమయం బాగా తగ్గుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ విద్యుత్ కొనుగోలు చేసినప్పటికీ.. సరఫరా చేసుకునేందుకు విద్యుత్ సరఫరా లైన్ల (కారిడార్) సమస్య కూడా తెలంగాణను వేధించనుంది. ఇక ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే విద్యుత్ ఉత్పత్తికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ వర్షాభావ పరిస్థితుల్లో రబీలో మాదిరే బయటి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 వేల ఎంయూలు! : ఉచిత విద్యుత్ కోసం 2012-13 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 11,460 ఎంయూల మేర విద్యుత్ సరఫరా అయ్యింది. ఇందులో సీపీడీసీఎల్ పరిధిలో 6,743 ఎంయూలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 4,747 ఎంయూలు సరఫరా అయ్యింది. సీపీడీసీఎల్ పరిధిలో తెలంగాణ జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా ఉన్నాయి. సీపీడీసీఎల్ పరిధిలో వ్యవసాయానికి 9,173 ఎం యూ విద్యుత్‌ను సరఫరా చేశారు. రాయలసీమలోని ఈ రెండు జిల్లాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్ మొత్తం (అనంతపురం జిల్లాకు 1,615 ఎం యూలు, కర్నూలుకు 815 ఎంయూలు) 2,430 ఎంయూలను మినహాయిస్తే 6,743 ఎంయూలు తెలంగాణ జిల్లాలకే సరఫరా అయ్యింది. మొత్తమ్మీద రెండు డిస్కంలను కలుపుకుంటే తెలంగాణలో వ్యవసాయానికి ఉచితం కోసం అవసరమయ్యే విద్యుత్ మొత్తం 11,460 ఎంయూలన్నమాట! అంటే రోజు కు సగటున 31.40 ఎంయూల విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేయాల్సి రానుంది. కొత్త వ్యవసాయ కనెక్షన్లు జారీ అవుతుండటంతో ఈ డిమాండ్ కాస్తా ఏటా పెరుగుతూనే ఉంటుంది. అంటే వచ్చే ఏడాదిలో కేవలం వ్యవసాయానికే 12 వేల ఎంయూలకు పైగా విద్యుత్ కేవలం వ్యవసాయానికే సరఫరా చేయాల్సి రానుంది. భవిష్యత్తులో మరింత కష్టం..: ప్రతి ఏటా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లను కొత్తగా మంజూరు చేస్తున్నారు. ఇందులో ప్రతీ ఏటా తెలంగాణ ప్రాంతంలోనే 80 వేల నుంచి 90 వేల కనె క్షన్లు మంజూరు చేస్తున్నారు. ఈ లెక్కన వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఏటా పెరుగుతూనే పోతుందన్నమాట. ఫలితంగా సరఫరా కూడా భారీగా పెరగాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వృద్ధిరేటు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున 6 నుంచి 10 శాతం పెరుగుతోంది. అయితే ఉచిత విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఈ వృద్ధిరేటు సగటున 10 శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తై వాటి నిర్వహణకు ఏకంగా 8,682.18 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. అంటే రోజుకు సగటున 208.37 ఎంయూల విద్యుత్ కేవలం ఎత్తిపోతల పథకాలకే అవసరం కానుంది. వీటికి విద్యుత్ సరఫరా అసాధ్యమే. -
మోడీ సభకు భయపడే తెలంగాణపై ప్రకటన: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నరేంద్ర మోడీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెడుతున్నారని తెలిశాకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ సాధనలో ఈ ప్రాంత ఉద్యోగులు 42 రోజుల పాటు సమ్మె చేసినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇటువైపే చూడలేదన్నారు. వందల మంది బలిదానాలు చేసుకున్నా, తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేసినా, అనేక రకాలుగా ఇతర ఉద్యమాలు జరిగినా సోనియా స్పందించలేదని విమర్శించారు. మోడీ సభ విషయం తెలిశాకే ఈ విషయంలో కాంగ్రెస్ స్పందన వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం నెలకొని ఉందన్నారు. 2009 నుంచి ఒక్కొక్క పార్టీ కనుమరుగు అవుతూనే ఉన్నాయని, 2014 నాటికి ఎన్ని పార్టీలు మిగులుతాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సోనియాగాంధీ డెరైక్షన్‌లో రాష్ట్రంలో ప్రాంతాలవారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. మోడీ నాయకత్వంలో దక్షిణాదిలో బీజేపీ మరింత బలోపేతం కాబోతుందని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు చెప్పారు. దేశ భవిష్యత్‌కు డైనమిక్ లీడర్ మోడీయేనని బండారు దత్తాత్రేయ కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగరరావు, ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు బంగారు లక్ష్మణ్ తదితరులు ప్రసంగించారు. -
కాంగ్రెస్‌ను మోస్తూ.. బీజేపీతో పొత్తా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ.. తీరా ఎన్నికల సమయానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల ఎంత మేరకు లాభిస్తుందన్న అంశంపై తెలుగు తమ్ముళ్లలో చర్చలు సాగుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకవైపు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని వ్యవహారాలు నడిపిస్తూ.. ఇప్పుడు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని నరేంద్రమోడీ జపం చేయటం వల్ల ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని నవభారత యువభేరి సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పరోక్షంగా ఎత్తిచూపారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌కు బద్ధవ్యతిరేకిగా పనిచేసిన ఎన్టీఆర్ ఆశయంతో పనిచేయాలని ఆ సభలో మోడీ చెప్పటమంటే.. పరోక్షంగా చంద్రబాబు వైఖరిని ఎత్తిచూపటంతో పాటు హెచ్చరించినట్టు టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కేసుల భయం వంటి పలు కారణాలతో చంద్రబాబు నాలుగేళ్ల నుంచి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు సీడబ్ల్యూసీ సమావేశమయ్యే ముందు కూడా చంద్రబాబు ఫోన్లో దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, ఆజాద్ తదితరులతో మాట్లాడిన విషయం కూడా ఇటీవలే హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ప్రముఖంగా వచ్చింది. ఇంతగా కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న చంద్రబాబు ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతునివ్వటానికి సైతం సిద్ధంగా ఉన్నారని ఏఐసీసీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటుంది. కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో అంతగా సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు వ్యవహారం తమ పార్టీ అగ్రనేతలకు ఎప్పటికప్పుడు సమాచారం ఉందని బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు తెంచుకోగలరా: టీడీపీ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఎంతమేర లాభం చేకూరుతుందని కమలనాథులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ఒక్కసారిగా రూట్ మార్చితే ప్రజలు ఎలా నమ్ముతారన్న ప్రశ్న నేతలను వేధిస్తోంది. ఎల్బీ స్టేడియంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో పనిచేసిన ఎన్టీఆర్‌ను ప్రశంసిస్తూ చెప్పిన మాటలు పొత్తుకు లైన్‌క్లియర్ అయినట్టుగా టీడీపీ నేతలు కొందరు అంచనాకు రాగా.. కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరిని ఆయన పరోక్షంగా ఎత్తిచూపారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే మోడీ సంకేతాల మేరకు బీజేపీతో పొత్తుకు సిద్ధం కావటం అంత సులభం కాదని, ముందు చంద్రబాబు ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలని, అంతర్గతంగా తెగతెంపులు సాధ్యం కాకపోయినా.. తెంచుకున్నట్టు ప్రజల్లో నమ్మకం కలిగించాల్సి ఉందని తెలంగాణ టీడీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నిన్నటివరకూ కాంగ్రెస్‌కు అండగా నిలిచాం కదా?:‘దివంగత వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2004 నుంచి ఆయన మరణించే వరకూ అంటే 2009 సెప్టెంబర్ 2 వరకూ కాంగ్రెస్‌తో టీడీపీ బద్ధవైరం కొనసాగించింది. ఆయన మరణించిన కొద్ది నెలల నుంచే చంద్రబాబు కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు నెరపటం ప్రారంభించారు. ఐఎంజీ, ఎమ్మార్ కుంభకోణాలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలున్న చంద్రబాబు.. ఆ కేసుల నుంచి బయటపడేందుకే ఇంత కాలం కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసం పెట్టినా.. టీడీపీ తటస్థ వైఖరి పేరుతో ఆ ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడారు. యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎఫ్‌డీఐ బిల్లు వీగిపోకుండా టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను సభకు గైర్హాజరయ్యేలా చంద్రబాబు ఆదేశించి మరీ కాంగ్రెస్‌కు సహకరించారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి నిన్నమొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు నమ్మబోరన్న భయం మాలో ఉంది’ అని టీడీపీ నేతలు చెప్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించాం కదా?:‘1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని లబ్ధిపొందాం.. అదే పార్టీతో 2004లో పొత్తు పెట్టుకుని ఓడిపోయాం. ఆ తరువాత బీజేపీపై మతతత్వ ముద్ర వేశాం.. భవిష్యత్‌లో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టంగా ప్రకటించాం, ఇపుడు మళ్లీ ఏ కారణం చెప్పి పొత్తు పెట్టుకుంటాం?’ అని రాయలసీమకు చెందిన టీడీపీ నేత ఒకరు ప్రశ్నించారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. మతతత్వ ముద్రపడిన మోడీ ప్రమాణ స్వీకారానికి బాలకృష్ణ హాజరైతే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో చంద్రబాబు చివరకు అడ్డుకున్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ విషయాలన్నీ రేపటి రోజున మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉన్నందునే బీజేపీతో పొత్తు అంశంపై నేరుగా మాట్లాడకుండా ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా వియ్యంకుడు బాలకృష్ణను మోడీ వద్దకు పంపినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు నరేంద్ర మోడీని కలిశానని బాలకృష్ణ చెప్తున్నారు. -
12న కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం: చంద్రశేఖర్‌రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై తమ నిర్ణయాన్ని సీడబ్య్లూసీ సమావేశంలో తీర్మానం చేసినా నాటినుంచి దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో సమైక్య జేవేసీ సమావేశమైంది. ఈ సమావేశంలో తమ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాన్ని ప్రకటించినట్టు జేఏసీ నాయకులు గౌరవ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం చేయనున్నట్టు చెప్పారు. 16వ తేదీన నియోజకవర్గాల కేంద్రాల్లో రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 18న కూడా కడప, రాజంపేటలలో రైల్‌రోకో, జైలు భరో వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
నరేంద్ర మోడీ బహిరంగ సభకు తాకనున్న విభజన సెగ
హైదరాబాద్/ కడప: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై తమ నిర్ణయాన్ని సీడబ్య్లూసీ సమావేశంలో తీర్మానం చేసినా నాటినుంచి దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. కేంద్రం తెలంగాణ ప్రకటనను వెలవబడటంతోనే సీమాంధ్ర ప్రాంతాలలో అందోళన వాతావారణం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణవాదులు తెచ్చినా ఒత్తిడితో కేంద్రం తలొగ్గి గత నెల జూలై 30న తెలంగాణ ప్రకటించింది. హైదరాబాద్ ను పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. హైదరాబాద్ వేదికగా తన ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టనున్నారు. ఆదివారం నాడు ఆయన ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. 'నవభారత యువభేరి' పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మోడీ సభ జరగనుంది. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో గత కొన్నిరోజులుగా వేడిక్కిన విభజన సెగతో నరేంద్ర మోడీ సమావేశానికి ఆదరణ తగ్గనున్నట్టు తెలుస్తోంది. రాయలసీమనుంచి నాయకులు గానీ, కార్యకర్తులు గానీ ర్యాలీలో పాల్గొనడానికి సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గత నెల జూలై ఒకటి, రెండు తేదీలలో తిరుపతిలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్శాహకుడు ఒకరు రాయలసీమ నాయకులను కలిశారు. బీజేపీ ర్యాలీలో సీమాంధ్ర ప్రాంతాలనుంచి దాదాపుగా 10వేల మంది పాల్గొవలసి ఉండగా, సమైక్యాంధ్ర నిరసన సెగతో 2వేలమంది వరకూ తగ్గారు. కానీ తెలంగాణ అంశంపై రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఇరుప్రాంతాల కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్ లో జరిగే బీజేపీ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో దాదాపు వారంతా తమ నాయకత్వాన్ని వదిలేసినట్టేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో తమ భవిష్యత్తు కార్యచరణ ఏమిటి అన్నదానిపై వారు వివరించేందుకు సిద్ధంగాలేరని తెలుస్తోంది. బీజేపీ నాయకులు కూడా ఆ పార్టీ కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేయలేకపోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే బీజీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నరేంద్ర మోడీ సమావేశానికి రాయలసీమనుంచి మోడీ సమావేశానికి 400 నుంచి 500 మంది కంటే హాజరుకాకపోవచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
సీఎం కిరణ్‌పై సొంత పార్టీ నేతల ఫైర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర విభజనతో తెలంగాణ ఏర్పడితే సమస్యలు వస్తాయంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అపరిపక్వ మనస్తత్వంతో కిరణ్ రాష్ట్ర విభజనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి సీఎం కట్టుబడి ఉండాల్సిందేనంటూ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హైదరాబాద్ మీట్ ది ప్రెస్‌లో సీఎం వైఖరిని ఎండగట్టారు. సీఎం వ్యాఖ్యలపై శుక్రవారం జరిగే ప్రెస్మీట్లో స్పందిస్తానని మంత్రి గీతారెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం నుంచి సమైక్యవాదం వినిపిస్తున్న ఏకైక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తూ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సంయమనం పాటిద్దాం ఎవరేం వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ప్రజలు, నాయకులు సంయమనం పాటించాలి. రాష్ట్ర ఏర్పాటు, పునర్మిర్మాణంపై దృష్టి సారిద్దాం. ఎవరో ఏదో మాట్లాడారని అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున ఏ ప్రాంతం వారికీ నష్టం ఉండదు. - సునీతా లక్ష్మారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందే! సుదీర్ఘకాలంగా నలుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఏర్పాటుకు ప్రాం తాలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకరించాలి. కిరణ్ రాష్ట్రం మొత్తానికి సీఎం అనే విషయాన్ని గుర్తించి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. - సురేశ్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్ సీఎం వ్యాఖ్యలు విడ్డూరం సీఎం కిరణ్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రిననే విషయాన్ని గ్రహించాలి. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానంటూ ప్రకటనలు ఇచ్చిన సీఎం కిరణ్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారు. నా చేతిలో ఏమీ లేదంటూనే సీమాంధ్ర ప్రతినిధిగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. - టి. నర్సారెడ్డి, ఎమ్మెల్యే, గజ్వేల్ సీఎం వ్యాఖ్యలు విడ్డూరం సీఎం కిరణ్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రిననే విషయాన్ని గ్రహించాలి. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానంటూ ప్రకటనలు ఇచ్చిన సీఎం కిరణ్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారు. నా చేతిలో ఏమీ లేదంటూనే సీమాంధ్ర ప్రతినిధిగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. - టి. నర్సారెడ్డి, ఎమ్మెల్యే, గజ్వేల్ మనోభావాలు దెబ్బతీసేలా మాటలు ముఖ్యమంత్రి కిరణ్ ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నా రు. దివంగత సీఎం వైఎస్, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హయాంలో ఇలాం టి అంశాలు ప్రస్తావనకు వచ్చి నా ఎన్నడూ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడలేదు. కిరణ్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సీమాంధ్ర ప్రతినిధిగా వ్యవహరించారు. సీఎం వైఖరిని ఖండిస్తున్నాం. - టి. నందీశ్వర్‌గౌడ్, ఎమ్మెల్యే, పటాన్చెరు సీఎం తీరు సరికాదు మూడేళ్లుగా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు. సీఎం వ్యాఖ్యలతో మా మనసు గాయపడింది. - పి. కిష్టారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్ -
సాయంత్రం సమావేశం కానున్న కేంద్ర మంత్రివర్గం
-
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చకు రావటం లేదని సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చిస్తారని ముందు అనుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు ఎదురయ్యే సమస్యల గురించి అధ్యయనం చేసేందుకు రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నలుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినందున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మంత్రివర్గంలో చర్చ జరగడం లేదని తెలిసింది. ఒక వైపు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం, మరో వైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని కాంగ్రెస్ అధినాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
డార్జిలింగ్/గువాహటి/న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన దరిమిలా గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్ పర్వతప్రాంతంలో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవధిక బంద్ బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. డార్జిలింగ్, కలింపాంగ్, మిరిక్, సుఖిపొక్రీ, కుర్సియాంగ్ తదితర పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. కేంద్రం నుంచి చేరుకున్న ఐదు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఒకవైపు బంద్ కొనసాగుతుండగా, మరోవైపు పోలీసులు పాత కేసులకు సంబంధించి అరెస్టులు సాగిస్తున్నారు. జీజేఎంలోని గూర్ఖాలాండ్ పర్సనల్ (జీఎల్పీ) విభాగానికి చెందిన 32 మందిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 143కు చేరుకుంది. డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీకి ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ఉద్యమకారులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. కర్బీ-ఆంగ్లాంగ్‌లో కర్ఫ్యూ సడలింపు అస్సాంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూను సడలించారు. కర్బీ-ఆంగ్లాంగ్, బోడోలాండ్, కామ్తాపూర్ రా ష్ట్రాల డిమాండుతో అస్సాంలో వివిధ సంస్థ లు, పార్టీల నేతృత్వంలో రెండు రోజులు కొనసాగిన బంద్‌లు బుధవారం ముగిశా యి. మరోవైపు బోడో నాయకులు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌ను కలుసుకుని, తమ డిమాండ్‌ను వినిపించారు. తమ డిమాండు పై ఉన్నతస్థాయిలో చర్చించనున్నట్లు ప్ర ధాని హామీఇచ్చారని చెప్పారు. ఈ అంశం పై బాధ్యతలను హోంమంత్రి షిండేకు అప్పగించనున్నట్లు చెప్పారన్నారు. -
అదంతా దుష్ర్పచారం : కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి సీమాంధ్రులను వెళ్లగొడతారని దుష్ర్పచారం జరుగుతోందని, అది నిజం కాదని, ఈ ప్రాంతంలో వారు స్వేచ్ఛగా జీవించవచ్చునని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం ఖైరతాబాద్ విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు కోదండరాంతో పాటు ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, హరీష్‌రావు, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని, ఈ సమయంలో హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత పేరుతో వచ్చిన రాష్ట్రాన్ని అడ్డుకోవద్దని కోరారు. విభజన కోసం ఓ ప్రత్యేక కమిటీ వేస్తారని, అందులోనే ఉద్యోగాల పంపిణీ, నీటి కేటాయింపులు రాజ్యాంగబద్ధంగా జరుగుతాయని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఎంతో ఉధృతంగా సాగిన సమయంలో కూడా హైదరాబాద్‌లో సీమాంధ్రులపై దాడులు జర గలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదని, హక్కుల రక్షణ కోసం మాత్రమేనని వారు తెలిపారు. కేవలం కొన్ని రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకే సమైక్యవాదమంటూ అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. కలిసి ఉంటామని చెప్పడం ఒక భావన అని, అందుకు అవతలి వారు అంగీకరించనప్పుడు కూడా బలవంతంగా కలిసే ఉంటామనడం అనైతిక చర్య అవుతుందని కోదండరాం అన్నారు. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు పార్లమెంట్లో సమైక్యాంధ్ర అంటూ ప్లకార్డులు పట్టుకోవడం హేయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్, రఘు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
-
చంద్రబాబుతో సిల్లీబ్రాండ్
-
లెటర్ ఇచ్చేముందు చంద్రబాబు ఆలోచించలేదు: కాపు
-
హైకమాండ్ నిర్ణయం బాధించింది : డొక్కా
-
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు భేష్: షిండే
-
ప్రధాన ప్రతిపక్షం మాత్రం సైలెంట్
-
విభజనపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు
-
ఆహార భద్రత పథకంతో గట్టెక్కాలని చూస్తున్న కాంగ్రెస్
-
టిఆర్ఎస్ను పట్టించుకోని కాంగ్రెస్
-
‘ఇప్పటికీ కాంగ్రెస్‌పై పూర్తిగా నమ్మకం లేదు’
-
తెలంగాణ ఉద్యమంలో ఏకాకైన KCR