నరేంద్ర మోడీ బహిరంగ సభకు తాకనున్న విభజన సెగ
హైదరాబాద్/ కడప: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై తమ నిర్ణయాన్ని సీడబ్య్లూసీ సమావేశంలో తీర్మానం చేసినా నాటినుంచి దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. కేంద్రం తెలంగాణ ప్రకటనను వెలవబడటంతోనే సీమాంధ్ర ప్రాంతాలలో అందోళన వాతావారణం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణవాదులు తెచ్చినా ఒత్తిడితో కేంద్రం తలొగ్గి గత నెల జూలై 30న తెలంగాణ ప్రకటించింది. హైదరాబాద్ ను పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. హైదరాబాద్ వేదికగా తన ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టనున్నారు. ఆదివారం నాడు ఆయన ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. 'నవభారత యువభేరి' పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మోడీ సభ జరగనుంది. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో గత కొన్నిరోజులుగా వేడిక్కిన విభజన సెగతో నరేంద్ర మోడీ సమావేశానికి ఆదరణ తగ్గనున్నట్టు తెలుస్తోంది. రాయలసీమనుంచి నాయకులు గానీ, కార్యకర్తులు గానీ ర్యాలీలో పాల్గొనడానికి సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గత నెల జూలై ఒకటి, రెండు తేదీలలో తిరుపతిలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్శాహకుడు ఒకరు రాయలసీమ నాయకులను కలిశారు. బీజేపీ ర్యాలీలో సీమాంధ్ర ప్రాంతాలనుంచి దాదాపుగా 10వేల మంది పాల్గొవలసి ఉండగా, సమైక్యాంధ్ర నిరసన సెగతో 2వేలమంది వరకూ తగ్గారు.
కానీ తెలంగాణ అంశంపై రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఇరుప్రాంతాల కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్ లో జరిగే బీజేపీ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో దాదాపు వారంతా తమ నాయకత్వాన్ని వదిలేసినట్టేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో తమ భవిష్యత్తు కార్యచరణ ఏమిటి అన్నదానిపై వారు వివరించేందుకు సిద్ధంగాలేరని తెలుస్తోంది. బీజేపీ నాయకులు కూడా ఆ పార్టీ కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేయలేకపోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే బీజీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నరేంద్ర మోడీ సమావేశానికి రాయలసీమనుంచి మోడీ సమావేశానికి 400 నుంచి 500 మంది కంటే హాజరుకాకపోవచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.