ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. విభజన దిశగా కేంద్రం అడుగు వేస్తుండడంతో సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను సీమాంధ్రకు తరలించారు. మరోవైపు తెలంగాణపై హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతల మంతనాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్తో సోనియా గాంధీ మంతనాలు సాగించారు. తర్వాత సోనియా గాంధీని సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, పి చిదంబరం, అహ్మద్ పటేల్ కలిశారు.