తెలంగాణ ఇస్తుందనే నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కల్గించడంలేదని ఆచార్య కోదండరామ్ అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే మరోసారి తెలంగాణ ప్రజల్ని మోస చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ వాళ్లను గ్రామాల్లోకి రానివ్వద్దని టీ.జేఏసీ తీర్మానాన్ని వాయిదా వేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ శక్తులను గెలిపించి, ద్రోహులను ఓడించాలని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. తాము చేపట్టబోయే జనచైతన్య యాత్రను వచ్చే వారం నుంచి నిర్వహిస్తామని తెలిపారు.