తెలంగాణ ఉద్యమంలో ఏకాకైన KCR | | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 4 2013 8:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

ఇప్పటికిప్పుడు తెలంగాణ ప్రకటిస్తే... అతి ఎక్కువగా బాధపడే వ్యక్తి ఎవరయ్యా అంటే... ముందుగా చెప్పుకోవాల్సిన పేరు KCR. తెలంగాణ ఉద్యమాన్ని ఇన్నాళ్లు ముందుండి నడిపిన KCR...... ప్రస్తుత పరిణామాల్లో పూర్తిగా ఏకాకయ్యారు. KCR మాటే వేదవాక్కుగా భావించిన తెలంగాణ JAC కూడా KCRని విడిచిపెట్టి ఢిల్లీలో సెటిలైంది. ప్లీజ్‌... నాతో మాట్లాడండి... నన్ను సంప్రదించండి... నా మాటలకు విలువనివ్వండి ఈ మాటలంటోంది ఎవరో కాదు... TRS అధినేత కె.చంద్రశేఖర్‌ రావు. TRS సెక్రటరీ జనరల్‌ కేశవరావు ద్వారా ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు పంపుతున్న సందేశమిది. పన్నెండేళ్ల పార్టీ చరిత్రలో ఎప్పుడూ మిగిలిన పార్టీలకంటే ఎప్పుడూ ఓ అడుగు ముందున్న KCR.... ఇప్పుడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. తన ప్రమేయం లేకుండా తెలంగాణ రాదని ఇన్నాళ్లు గట్టిగా వాదనలు వినిపించిన KCRకు ప్రస్తుత పరిణామాలు మింగుడుపడనివే. తెలంగాణ కోసం అవసరమైతే TRSను విలీనం చేసేందుకు సిద్ధమన్న ఆయన మాటల్ని ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఒకప్పుడు... KCR దర్శనం కోసం పడిగాపులుగాసిన నాయకులు మారుతున్న పరిస్థితుల్లో ఆయన వైపు కూడా చూస్తున్నట్టు లేదు. తాజా రాజకీయాలతో తెలంగాణ మొత్తం... ఉత్తేజితమవుతుంటే... ఇన్నాళ్లు ఉద్యమాన్ని నడిపిన TRSలో ఉత్సాహం ఏ మాత్రం కనిపించడం లేదు. రాయల తెలంగాణ అని ఓ వైపు ఊహాగానాలు వినిపిస్తుంటే అవననలేక, కాదనలేక మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి TRSది. కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోకపోయినా, తెలంగాణ ఏర్పడితే పార్టీ విలీనంపై చర్చిస్తామని చెప్పుకోవాల్సిన దుస్థితిలో పడిపోయింది గులాబీదళం. తాజా పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు TRS ముఖ్యనేతలు ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలపై జూలై 7న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement