టి.బిల్లుతో తలవంపులు
ప్రజాస్వామ్య విలువలకు సోనియా తిలోదకాలు
మాఫియా పోకడలతో విభజనకు యత్నాలు
పార్లమెంటు ఘటనలపై కొణతాల ధ్వజం
అనకాపల్లి, న్యూస్‌లైన్ : సోనియాగాంధీ మాఫియా నాయకురాలిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. తె లంగాణ విభజన బిల్లు విషయంలో లోక్‌సభలో జరిగిన ఘటనలను ఉటంకిస్తూ కొణతాల స్థానిక విలేకర్లతో గురువారం మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య విలువలు కలిగిన భారత్ పార్లమెంట్‌ను మరుభూమిగా దిగజార్చిన ఘనత సోనియాదేనని ఎద్దేవా చే శారు.
మెజారిటీ లేకపోయినప్పటికీ కక్ష సాధిం పు చర్యలా రాష్ట్రాన్ని విడగొట్టే చర్యలకు పూనుకున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ సైతం తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉందనిపేర్కొన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పందన కలగలేదన్నారు. రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ ఆర్టికల్ 3 పై దేశవ్యాప్త చర్చ జరగాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్ని పార్టీల అగ్రనేతలతో మాట్లాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఊసరవెల్లిలా వ్యవహరిస్తూ రోజుకోమాట మాట్లాడుతున్నారని విమర్శించా రు. గతంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బోర్డులు నియమించాలని కేంద్రం నిర్ణయిస్తే తన పదవికి ఎక్కడ ఎసరు తగులుతుందోనని కిరణ్ ఆ నిర్ణయాలకు అడ్డుపలికారని, దాని ఫలితమే నేటి తెలంగాణ రావణ కాష్టమని వివరించా రు. ఓటాన్ బడ్జెట్ ద్వారా నీటిపారుదల శాఖకు సంబంధించి 23 వేల కోట్ల రూపాయల బిల్లులపై సీఎం సం తకం చేశారని ఆ పార్టీకే చెందిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరో పిస్తున్న సంగతి అందరూ గమనించాలన్నారు.