షర్మిల శంఖారావం రాష్ట్ర సమైక్యత కోసమే: కొణతాల రామకృష్ణ | Sharmila's yatra only for State's Unity, says Konatala Rama Krishna | Sakshi
Sakshi News home page

షర్మిల శంఖారావం రాష్ట్ర సమైక్యత కోసమే: కొణతాల రామకృష్ణ

Published Mon, Sep 2 2013 3:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

షర్మిల శంఖారావం రాష్ట్ర సమైక్యత కోసమే: కొణతాల రామకృష్ణ - Sakshi

షర్మిల శంఖారావం రాష్ట్ర సమైక్యత కోసమే: కొణతాల రామకృష్ణ

రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని తమ పార్టీ అనేక పర్యాయాలు లేఖలు, ప్రకటనల ద్వారా అర్ధించిన ప్పటికీ ప్రజలకు అన్యాయం చేసైనా సీట్లు, ఓట్లు పొందాలని కాంగ్రెస్, టీడీపీలు తెగబడిన నేపథ్యంలో, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటాన్ని తావుు వురింత ఉధృతం చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని తమ పార్టీ అనేక పర్యాయాలు లేఖలు, ప్రకటనల ద్వారా  అర్ధించిన ప్పటికీ ప్రజలకు  అన్యాయం చేసైనా  సీట్లు, ఓట్లు పొందాలని కాంగ్రెస్, టీడీపీలు తెగబడిన నేపథ్యంలో, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటాన్ని తావుు వురింత ఉధృతం చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ రాజకీయు వ్యవహారాల కమిటీ సవున్వయుకర్త కొణతాల రావుకృష్ణ చెప్పారు.
 
 అందుకే,.. ప్రజల పక్షాన గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృ త్వంలో పార్టీ నేతలందరం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ఇతర పార్టీల అధినేతలకు రాష్ట్ర ప్రజల ఆందోళనను, తాజా పరిస్థితిని వివరించామని చెప్పా రు. స్టేక్‌హోల్డర్లు అందరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం రావణకాష్టంగా తయూరవుతుందని కూడా తెలిపామన్నారు. దివంగత  మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయసాధన కోసమే తావుు కృషిచేస్తావుని, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా, దాన్ని గట్టిగా వ్యతిరేకించడంలో పార్టీ ముందు వరుసలో ఉంటుందని అన్నారు.  హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సమైక్యతను కాపాడటమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు షర్మిల ‘సమైక్య శంఖారావం’ పేరుతో బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, ఆప్యాయతలు సమైక్య రాష్ట్రం లోనే సాధ్యం అన్న భావాలకు అనుగుణంగానే పార్టీ ఉద్యమం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు న్యాయుం చేయూలని తమ పార్టీ ప్లీనరీ నుంచి నేటి వరకు అనేక పర్యాయాలు తమ లేఖల్లో, ప్రకటనల్లో అర్థించినా కాంగ్రెస్, టీడీపీలు వూత్రం ఓట్లు, సీట్లకోసమే తెగించాయున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తోకపార్టీగా వ్యవహరిస్తున్నది టీడీపీ వూత్రమేనని కొణతాల విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది టీడీపీ సాయంతో కాదా? అని ఆపార్టీ అధినేత చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
 
 టీడీపీ, కాంగ్రెస్ తోక పార్టీ అని ప్రజలకు తెలుసు
 అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నుంచి రెండు సార్లు గట్టెక్కించి, నాలుగున్నర ఏళ్లుగా కాంగ్రెస్‌కు అన్ని విధాలా సహకరిస్తూ తోకపార్టీగా వ్యవహరిస్తున్నది టీడీపీనే అన్నది ప్రజలందరికీ తెలుసునని, చంద్రబాబు ఆలోచనలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  నిర్ణయాలు ఒకటేనని కొణతాల విమర్శించా రు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత నిందలు వేస్తారు. సాగునీటి సమస్య, ప్రస్తుత సంక్షోభాలు వైఎస్ వల్లే వచ్చాయంటారు. రాజశేఖరరెడ్డి పరిపాలన ఏ విధంగా సాగిందో ప్రజలకు తెలియదనుకుంటున్నారా?’ అని బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భావించిన వైఎస్.., ఇరిగేషన్, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ప్రాంతీయ భేదం లేకుండా ఒక సంతృప్త స్థారుులో సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో దురదృష్టం కొద్దీ కాంగ్రెస్,.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఆటలాడుతోందని, ప్రధాన ప్రతిపక్షం అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు.
 
 రాష్ట్రంలో ఎన్నో సవుస్యలుండగా, వాటి కి పరిష్కారం చూపకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. వైఎస్‌పై నిందలు వేస్తున్న చంద్రబాబు తానేం చేశారో గుర్తుచేసుకోవాలన్నారు. ‘రాష్ట్రాన్ని విభజించాలంటూ 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేఖ ఇచ్చారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సీఎంగా రోశయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఆ తర్వాత ప్రధానికి లేఖలు రాశారు. కేంద్ర హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చెప్పారు.’  రాష్ట్రాన్ని విభజించాలంటూ, ఇలా అనేక సందర్భాల్లో చెప్పారే కానీ, విభజనతో తలెత్తే సమస్యలను ఎప్పుడూ ప్రస్తావించలేకపోయారని కొణతాల వివుర్శించారు. ప్రజల దారే నాదారి అంటున్న చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 
 
 విభజిస్తే రెండు ప్రాంతాలకూ నష్టమే
 ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ తీసుకున్న ఏక పక్ష నిర్ణయాల వల్ల రెండు ప్రాంతాలకూ నష్టమేనని కొణతాల అన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించు అనే స్వభావంతో వ్యవహరిస్తోందని, కొణతాల దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించి పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామంటోందని, అదే ప్రాణహిత-చేవెళ్లను ప్రస్తావించకపోవడం చూస్తే వారి ఆలోచన ఏంటో తెలుస్తోందన్నారు. రెండు ప్రాజెక్టులకూ జాతీయ హోదా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని కొణతాల విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement