వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కొణతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు శనివారం అనకాపల్లిలో ఘనంగా జరిగాయి.
అనకాపల్లి , న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కొణతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు శనివారం అనకాపల్లిలో ఘనంగా జరిగాయి. 57వ జన్మదిన సూచికగా కొణతాల క్యాంపు కార్యాలయం వద్ద 57 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) కట్ చేశారు. పేదలకు చీరలు, బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పట్టణ పార్టీ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొణతాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పట్టణ మెయిన్‌రోడ్‌ను విస్తరించిన ఘనత కొణతాలకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు కొణతాలేనని చెప్పారు. వైయస్ వెంట ఉండి, ఆయన మరణాంతరం జగన్‌కు అండగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు (జానీ) మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వైఎస్సార్ సీసీ అఖండ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు కొణతాల జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ ఆస్పత్రిలోను, వర్తక సంఘం ప్రసూతి ఆస్పత్రిలోను కొణతాల బాలసుబ్రహ్మణ్యం రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. విజయరామరాజుపేటలో పలకా రవి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ జరిగింది. గవరపాలెంలో కాండ్రేగుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంచిపెట్టారు.
తుమ్మపాలలో డి.వి.వి. గోపాలరాజు ఆధ్వర్యంలో వంద మంది పేదలకు బియ్యం పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్లి సూరిబాబు, మంత్రి సత్తిబాబు, పిళ్లా హర శ్రీనివాసరావు, పిళ్లా చంద్రశేఖర్, మలసాల కిషోర్, చిన్ని వల్లభ నారాయణరావు, నార్నపిని వెంకటరావు, సేనాపతి గంగునాయుడు, ఆడారి అచ్చియ్యనాయుడు, బొడ్డేడ శివ తదితరులు పాల్గొన్నారు.