ఆస్పత్రిలో చికిత్స పొందిన పిల్లలతో తల్లిదండ్రులు
సాక్షి, కశింకోట : కశింకోటలోని హౌసింగ్ కాలనీలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో ఆహారం విషపూరితమై సుమారు 18 మంది చిన్నారులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హౌసింగ్ కాలనీలో ఒక చిన్నారికి జన్మదిన వేడుకలు జరగ్గా దానికి హాజరైన పిల్లలు కేక్ తిని, రస్నా తాగిన తర్వాత వాంతులై అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వినయ్, డి.గణేష్, డి.సాయి, డి.మనోహర్, మానశ్రీ, లేఖిని, దుర్గా, వినయ్, తదితరులు ఉన్నారు. వీరంతా రెండు నుంచి పదేళ్లలోపు వయస్సు వారే. వీరిని తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చికిత్స అందించి పంపించామని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment