childs
-
యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం!
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోగల లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన అనంతరం ఆస్పత్రికి సంబంధించిన పలు లోపాలు బయటపడ్డాయి. లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం అమర్చారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో ఆ సేఫ్టీ అలారం మోగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వార్డులో పొగలు వ్యాపించడాన్ని గమనించినవారు కేకలు వేయడంతో ప్రమాదాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. సేఫ్టీ అలారం మోగి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగేదని స్థానికులు అంటున్నారు.నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో ఎవరూ లోపలికి వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది కూడా లోనికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వారు వార్డు కిటికీ అద్దాలను పగులగొట్టి, లోపలికి చేరుకుని మంటలను అదుపు చేస్తూనే, శిశువులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు.ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ లోపల, మరొకటి వెలుపల ఉంది. ముందుగా అగ్నిమాపక సిబ్బంది బయట ఉన్న వార్డులోని నవజాత శిశువులను వెలుపలికి తీసుకువచ్చారు. ఇంతలోనే మంటలు లోపలి వార్డులోకి ప్రవేశించడంతో అక్కడున్న పిల్లలు తీవ్రంగా కాలిపోయారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు తగిన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఝాన్సీ లోక్‌సభ ఎంపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 16 మంది చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎస్ఎస్పీ సుధా సింగ్ తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
దత్తత ఇచ్చిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష వద్దు
ముంబై: అత్యాచారానికి గురైన బాధితురాలికి జన్మించిన బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్న తర్వాత ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని బాంబే హైకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డ ప్రయోజనాలను కాపాడాలని, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డీఎన్ఏ పరీక్ష నిర్వహించవద్దని పోలీసులను ఆదేశించింది. బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఈ నెల 10న తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2020లో ఓ వ్యక్తి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చింది. బిడ్డకు జన్మనిచి్చంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని జైలుకు పంపించారు. మైనర్ బాలికకు జన్మించిన బిడ్డను గుర్తుతెలియని దంపతులు దత్తత తీసుకున్నారు. నిందితుడు 2 సంవత్సరాల 10 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలి బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేశారా? అని ఆరా తీసింది. బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్నారని పోలీసులు బదులివ్వడంతో ఇక డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని ఆదేశించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. -
మనసైన మరో ప్రపంచంలోకి... ప్రకృతి అనేది మనిషికి అతి పెద్ద పాఠశాల.
జలపాతాల నుంచి పంటచేల వరకు ప్రతిదీ ఏదో ఒక పాఠం చెబుతూనే ఉంటుంది. అందుకే ప్రకృతి పిల్లలకు నచ్చిన ప్రపంచం. ‘చిల్ట్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ అంశంపై రిజు వేసిన పెయింటింగ్... పిల్లలకూ ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండే అనుబంధానికి అద్దం పడుతుంది. ఈ పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్పెషల్ స్టాంప్ కోసం ఎంపికైంది... కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు నుంచి పదకొండవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ స్టాంపుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. ఈ సంవత్సరం రిజు వేసిన పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్టాంప్ కోసం ఎంపికైంది. ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్ థీమ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ప్రకృతి కూడా గురువులాంటిదే అనే ఐడియాతో ఈ బొమ్మ వేశాను. ప్రకృతి, విద్యాప్రపంచం రెండూ కలిసిపోయి కనిపించేలా బొమ్మ వేశాను’ అంటుంది కోచిలోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రిజు. ‘రిజు పెయింటింగ్ అద్భుతమైన ఊహతో భావగర్భితంగా ఉంది’ అని జ్యూరీ ప్రశంసించింది. ‘నిజంగా చెప్పాలంటే బహుమతి వస్తుంది అనుకోలేదు. నేనే కాదు నా తల్లిదండ్రులు, టీచర్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పోటీలో పాల్గొనడంలో భాగంగా రకరకాల స్కెచ్‌లు వేశాను. అయితే అవేమీ నాకు నచ్చలేదు. ఆలోచిస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. ఆలోచిస్తున్న క్రమంలో ప్రకృతి ప్రపంచాన్ని పుస్తకంగా అనుకున్నాను. ఆ పుస్తకం తెరుచుకున్నప్పుడు ఆ దారుల్లో పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీస్తుంటారు. ఈ ఊహతో పెయింటింగ్ వేసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. నేను వేసిన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం, స్టాంప్‌లు నాన్న వృత్తిలో భాగం కావడం ఆనందంగా ఉంది ’ అంటుంది రిజు. రిజు తండ్రి రాజేష్ పరక్కాడవు పోస్ట్ ఆఫీసులో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ‘రోజూ తప్పకుండా ఏదో ఒక పెయింటింగ్ వేస్తుంటుంది రిజు. చిత్రకళకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంది. తన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం రిజూకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భవిష్యత్తు్తలో ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అంటున్నారు రిజు తండ్రి రాజేష్. బాలల దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమక్షంలో ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ స్టాంప్‌ను అధికారికంగా విడుదల చేస్తారు. -
శృంగారానికి సమ్మతి వయసు మార్చొద్దు
న్యూఢిల్లీ: శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో ‘సమ్మతి వయసు’ను తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయొ ద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. లైంగిక హింస నుంచి చిన్నారులకు రక్షణ కలి్పంచేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టం ప్రకారం.. శృంగారానికి సమ్మతి వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉంది. దీన్ని 16 ఏళ్లకు తగ్గించాలన్న వినతులు వచ్చాయి. లా కమిషన్ తన నివేదికను తాజాగా కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయసు వారంతా బాలలే. వారిపై అత్యాచారానికి, లైంగిక నేరాల కు పాల్పడితే 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించవచ్చు. -
డాక్టర్ నటన బాగుందా? మనిషి తత్వం బాగుందా?
వైద్యులు చాలా బిజీగా ఉంటారు. వృత్తిలో దిగిన తర్వాత చాలా విషయాలు మరిచిపోతారు. అయితే అంత హడావిడిలోనూ వాళ్లలో మనిషి తత్వం బయటికొస్తుంది. అపరేషన్లు, ట్రీట్ మెంట్లు.. ఇవి సరే.. హఠాత్తుగా నేనున్నానంటూ వారిలో మనిషి బయటికొస్తాడు. కాసింత సేద తీరతాడు. ఆ తత్వం గురించే కొచ్చెర్లకోట జగదీశ్ సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవం పాఠకుల కోసం. పుట్టి పావుగంట కూడా కాలేదు. బుల్లిబుల్లి సపర్యలవీ చేసి, బరువదీ తూచిన పిమ్మట అమ్మమ్మ చీరనే బొంతలా చేసుకుని మెత్తగా పడుకుంది. చూడ్డానికి తామరాకులో చుట్టిన చామంతిపూల దొంతిలా తాజాగా నవనవలాడుతోంది. గుప్పెట నోట్లోకి దోపుకుంటూ దిక్కులు చూస్తోంది. పుట్టగానే ఆకలి మొదలవుతుంది మనిషికి. నాకూ వేస్తోంది ఆకలి. కేసవ్వగానే వెళ్లి బాక్స్ బద్దలుగొట్టాలి. దీనిది మాత్రం పాలాకలి. ఓ గుక్కెడు పాలు కడుపులో పడగానే పొట్ట నిండిపోయి కంటిమీదకి కునుకొచ్చేస్తుంది. ‘బేబీని మదర్ దగ్గర పెట్టండర్రా! సర్జరీ అయిపోవచ్చింది కదా? రండి త్వరగా!’ అని మేడమ్ అరిచిన అరుపుతో దాన్ని లోపలికి తీసుకొచ్చారు. పుట్టిన వెంటనే తల్లి రొమ్ము అందించాలనేది ప్రస్తుత శాస్త్రం. దాన్ని యథాప్రకారం అమలుచెయ్యాల్సిందే. సాధారణంగా ఈ టిక్కెట్లన్నీ బానే తాగేస్తాయి పాలు. కొందరు మాత్రం ఓ.. చిరాకు పడిపోతూ ఏడుస్తుంటారు. ‘తాగుతోందా?’ రాస్తున్నది ఆపి తలెత్తి అడిగాను. ‘ఆఁ, సుబ్బరంగా తాగుతున్నాద్సార్!’ అంది రామలక్ష్మి. దగ్గరకెళ్లి చూశాను. అప్పుడే సింగారాలు మొదలైపోయాయి దానికి. చింతపిక్క రంగు పిల్ల అది. ముదురు గులాబీరంగు ఊలు తొడుగులతో పంచదార చిలకలా ఉంది చూడ్డానికి. ఆవఁదం రాసిన నెత్తిమీద అంటుకుపోయినట్టున్న బుల్లి క్యాప్, చేతులకీ కాళ్లకీ ఊలు తొడుగులతో సావాఁలమ్మ పక్కలో లుకలుకలాడుతోంది చంటిగుంట. హాస్పిటల్ గేటవతల త్రిమూర్తులు కొట్లో కొన్న సరుకే అదంతా. అవ్వడానికి అగ్గిపెట్టంత కిళ్లీబడ్డీయేగానీ త్రిమూర్తులు దగ్గర ముల్లోకాల్లోనూ దొరకనంత స్టాకుంటుంది. పిల్లల సబ్బులు, వాసన నూనెలు, పురిటి పిల్లల కోసం చవకరకం ఊలు తొడుగులు ఒకటనేవిఁటి, సమస్తమూ వేలాడదీసి ఉంటాయి. అదొక పెద్ద దందా! లోపల డెలివరీ అవ్వగానే అతగాడికి సమాచారం వచ్చేస్తుంది. వెంటనే ఇక్కడ ప్యాకేజీ రెడీ చేసి ఉంచుతాడు. సమయానికి చేతిలో డబ్బు లేదన్నవాళ్లకి అరువు బేరాలు కూడా ఇస్తాడు. కేవలం ఏసీ శబ్దం ఒక్కటే ఉండడాన దాని చప్పరింత బాగా వినబడుతోంది. కాసేపటికి తాగుడాపి లుకలుకలాడ్డం మొదలెట్టింది. వెంటనే వాళ్లమ్మ పక్కలోంచి తీసేసి బయటకు పట్టుకుపోయారు. ఎవరు నేర్పేరమ్మ ఈ విద్యలు? కడుపులో ఉండగానే మొదలవుతాయి ఈ చప్పరింతలవీ. సుమారుగా నాలుగో నెలప్పుడు ప్రారంభమై ఏడాది వరకూ కొనసాగుతుంది. ‘తల్లడిల్లేవేళా తల్లిపాడే జోల.. పాలకన్నా తీపి పాపాయికీ...’ అన్నాడు వేటూరి. నిజమేమిటో పాపాయిల్నే అడగాలి. పాల పిల్లకి ఫారెక్సు ప్రాసనదీ అయ్యాక అన్నాలు తినిపించడం మొదలెట్టేసరికి ఈ చీకుడు కాస్త మందగిస్తుంది. కొంతమంది రెండుమూడేళ్ల పిల్లలకి కూడా పాలిచ్చే తల్లులుంటారు. అదో ముచ్చట. ఎంత కత్తులూ కత్తెరలతో కడుపదీ కోసి బిడ్డను బయటికి తీసే శాస్త్రం చదువుకున్నా ఈ కుసుమ కోమలమైన పసిపిల్లల్ని చూడగానే నాలో వైద్యుడు కాస్తా వేషం తీసేసి ఆనందాతిరేకంలో మునిగిపోతాడు. కొచ్చెర్లకోట జగదీశ్ -
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు.. 59 చోట్ల సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ ‘మేఘ చక్ర’లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఏఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ ‘కార్బన్’ ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్‌లోని ఇంటర్‌పోల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎస్ఏఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ పంపిణీదారులు బాలలపై అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలను ఆన్లైన్లో ఉంచి డబ్బు సంపాదిస్తున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
చిన్నారుల మృతి కేసు: దర్యాప్తు ముమ్మరం
-
చిన్నారుల మృతి కేసు: దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: రోజ్ బిస్కెట్లు తిని పిల్లలు మృతి చెందిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ రోజ్ బిస్కెట్ల తయారీ కంపెనీలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బిస్కెట్లకు సంబంధించిన శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. బిస్కెట్లు తయారీ యూనిట్‌ని అధికారులు సీజ్ చేశారు. బిస్కెట్లు తిని పిల్లలు అస్వస్థతకు గురికావడం అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బిస్కెట్లను మార్కెట్ నుంచి వెనక్కి రప్పిస్తున్నామన్నారు.బిస్కెట్లలో లోపం ఎలా జరిగిందో అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే విషయాలు బయటపడతాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: బిస్కెట్లా?.. విష ప్రయోగమా?) ‘బిస్కెట్’ ఘటనలో మూడో చిన్నారి మృతి.. కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ మండలం చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఈ నెల 13న బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురైన మూడో చిన్నారి కూడా మృత్యువాత పడింది. ఘటన జరిగిన రోజు హుస్సేన్‌బాషా(6),తర్వాతి రోజు హుస్సేన్‌బీ(4) అనే ఇద్దరు మృతి చెందగా, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడో బాలిక జమాల్‌బీ(8) బుధవారం మరణించింది. -
‘చైనాను అధిగమించనున్న భారత్’
ఢిల్లీ: ఈ ఏడాది మొదటి రోజు (జనవరి1)న భారతదేశంలో మొత్తం 67,385 పిల్లలు జన్మించగా, ప్రపంచవ్యాప్తంగా 3,92,078 పిల్లలు పుట్టినట్లు యూనిసెఫ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను పరిశీలిస్తే త్వరలోనే భారత్దేశ జనాభా చైనాను దాటుతుందని యూనిసెఫ్ అంచనా వేసింది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల్లో జన్మించిన శిశువులు.. ప్రపంచవవ్యాప్తంగా పుట్టిన పిల్లల సంఖ్యకు సగంగా నమోదవడం గమనార్హం. చైనా(46,299), నైజిరియా(26,039), పాకిస్తాన్(6,787), ఇండోనేషియా(13,020), అమెరికా(10,452), రిపబ్లిక్ ఆఫ్ కాంగో (10, 247), ఇథియోపియా(8, 493) దేశాల్లో పిల్లలు జన్మించారని యునిసెఫ్ పేర్కొంది. అయితే ఈ ఏడాది మొదటి రోజు జన్మించిన పిల్లల సంఖ్యను గమనిస్తే.. చైనా కన్నా భారత్‌లోనే ఎక్కుగా నమోదైంది. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నివేదికను వెల్లడించిన సందర్భంలో ఇండియా జనాభా.. వచ్చే దశాబ్దకాలంలో చైనాను అధిగమిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఏటా జనవరి 1న జన్మించిన శిశువుల గణనను యూనిసెఫ్ నిర్వహిస్తుంది. 2018లో 2.5 మిలియన్ శిశువులు జన్మించి మొదటి మాసంలోనే మరణించారని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ పిల్లలంతా ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, అంటు వ్యాధులతో మృతి చెందారని వెల్లడించింది. గత మూడు దశాబ్దాలగా ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు మృతిచెందిన పిల్లల సంఖ్య సగానికి తగ్గినట్లు యూనిసెఫ్ పేర్కొంది. -
జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
సాక్షి, కశింకోట : కశింకోటలోని హౌసింగ్ కాలనీలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో ఆహారం విషపూరితమై సుమారు 18 మంది చిన్నారులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హౌసింగ్ కాలనీలో ఒక చిన్నారికి జన్మదిన వేడుకలు జరగ్గా దానికి హాజరైన పిల్లలు కేక్ తిని, రస్నా తాగిన తర్వాత వాంతులై అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వినయ్, డి.గణేష్, డి.సాయి, డి.మనోహర్, మానశ్రీ, లేఖిని, దుర్గా, వినయ్, తదితరులు ఉన్నారు. వీరంతా రెండు నుంచి పదేళ్లలోపు వయస్సు వారే. వీరిని తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చికిత్స అందించి పంపించామని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
అమ్మా..నాన్న.. ఓ సెల్‌ఫోన్!
న్యూయార్క్ : తల్లిదండ్రులు.. మీరు సెల్‌ఫోన్‌కు దగ్గరవుతున్నారా?.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయాన్ని సెల్‌ఫోన్ వాడుతూ వృథా చేస్తున్నారా?.. అయితే మీ పిల్లలు మీకు దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలు పిల్లలతో హాయిగా గడపాల్సిన సమయంలో సెల్‌ఫోన్ వాడుతూ ఉంటే పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా పిల్లలు క్రూరప్రవర్తన, చెడు ప్రవర్తనకు అలవాటుపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ప్రతిరోజు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ముఖాముఖి సంభాషణలు లేకపోవటాన్ని ‘టెక్నోఫెరెన్స్’ అని నామకరణం చేశారు. పిల్లల చెడు ప్రవర్తన నుంచి తప్పించుకోవాలని తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ను ఆశ్రయిస్తే అది వారిని మరింత నాశనం చేస్తుందంటున్నారు. రోజులో కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించటం ద్వారా వారు తల్లిదండ్రులకు మరింత దగ్గరవుతారని, వారికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ కనబరుస్తూ ఉండటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుందని అంటున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమస్యలు ఎక్కువవ్వటానికి గల ముఖ్య కారణం సెల్‌ఫోన్ వాడకమేనని పేర్కొన్నారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : అనారోగ్యం ఆ కుటుం బాన్ని వెంటాడింది. కూలీ పనులు చేస్తేనే పూటగడిచే కడు పేదరికం అనుభవిస్తున్న ఆ కుటుం బంలో భార్యభర్తలు అనారోగ్యంతో తనువు చా లించడంతో వారి ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యా రు. ఈ విషాద సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్‌లో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..తిమ్మాపూర్‌కు చెందిన కొలకాని సుజాత–లక్ష్మయ్య దంపతులు కూలీ పనులు చేస్తూ కూతుళ్లు అక్షయ(10), ఐశ్వర్య(5)ను పోషించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మయ్య అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆస్పత్రుల్లో చూపించుకున్నా వ్యాధి నయం కాలేదు. హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఖరీదైన వైద్యం అందించాలని వైద్యులు సూచించగా.. అం దకపోవడంతో లక్ష్మయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి సుజాత కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లల ను పోషించుకుంటుంది. ఆమె కూడా అనారోగ్యానికి గురై ఆదివారం మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలై తల్లి శవం వద్ద విలపించడం అందరినీ కలచివేసింది. మృతురాలి కుటుంబాన్ని ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్ పరామర్శించి ఇద్దరు ఆడ పిల్లలను మంత్రి కేటీఆర్ సాయంతో గురుకుల విద్యాలయంలో చేర్పించి ప్రయోజకులుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో నాయకులు అనిల్, సీత్యానాయక్, రవి పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఉరే సరి...
మొన్న కథువా... నిన్న ఉన్నవ్... నేడు ఇండోర్... ఇలా భారతావనిలో పసిమొగ్గలపై కూడా మృగాళ్లు లైంగిక దాడులకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధిస్తూ కేంద్రప్రభుత్వం ఆలస్యంగానైనా సరే అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 16 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణించే వరకు జైలు శిక్ష విధిస్తారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే 10 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదు ఖాయం. అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కారణంగా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పెదవాల్తేరు(విశాఖతూర్పు) : లైంగిక నేరాలకు సంబంధించిన వివరాలు సేకరించడమే కాకుండా నిందితులపై నిఘా ఉంచడంలో ప్రపంచంలో భారతదేశం 9వ దేశంగా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్టొబాగో దేశాలు ఈ విధంగా నిఘా ఉంచుతున్నాయి. లైంగిక నేరగాళ్ల వివరాలు అమెరికాలో బహిరంగంగానే అందుబాటులో ఉంచడం విశేషం. మిగిలిన దేశాలలో న్యాయ, విచారణ సంస్థలకు ఈ వివరాలు అందుబాటులో ఉంచారు. విశాఖలోనూ పలు సంఘటనలు విశాఖ జిల్లాలో కూడా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాలికలు అదృశ్యమవుతున్న కేసులు నమోదవుతూనే ఉండడం కలవరపరుస్తోంది. కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ఈవ్‌టీజింగ్ సరేసరి. గడప దాటే మహిళలకు రానురానూ భద్రత లేకుండా పోతోందని మహిళాసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మతిస్థిమితం లేని మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో బాలికలపై యాసిడ్దాడులు కూడా గతంలో జరిగాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో సత్వర న్యాయం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎన్నాళ్లనుంచో కోరుతున్నాం. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. చిన్నారులపై సైతం లైంగిక దాడులు జరగడం దారుణం. ఇటువంటి నిందితులకు ఉరి శిక్షే సరైనది. – గొండు సీతారాం, అధ్యక్షుడు, ఏపీ చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం,విశాఖపట్నం. మృగాళ్లకు ఉరే సరైన శిక్ష కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ అభినందనీయం. చిన్నపిల్లలపై సైతం లైంగిక దాడులకు పాల్పడడం సభ్యసమాజంలో ఉన్నామా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విచారణ పేరుతో కాలయాపన జరుగుతోంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే శిక్షలు విధించడం ద్వారా నేరాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. – బి.శకుంతల, పిల్లల హక్కుల కార్యకర్త, సీతమ్మధార. కేంద్ర ఆర్డినెన్స్‌తో మంచి మార్పు కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చాలాబాగుంది. నిందితులకు ఉరిశిక్ష విధించడం సరైన శిక్ష. అప్పుడే సమాజంలో మంచి మార్పు వస్తుంది. చిన్న పిల్లలపై క్రూరంగా వ్యవహరించడం అవివేకం. ఈ నేపథ్యంలో ఇటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం అభినందనీయం. ఆర్డినెన్స్ అమలులో భాగంగా బాధిత కుటుంబాలకు న్యాయంపై తమ సంస్థ పర్యవేక్షణ ఉంటుంది. అత్యాచార బాధితులకు ప్రస్తుతం కేజీహెచ్‌లో ఒన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్నాం. – జి.చిన్మయిదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా మహిళా–శిశు అభివృద్ధి సంస్థ, విశాఖపట్నం. ఆర్డినెన్స్ యథాతథంగా అమలు చేయాలి దేశంలో నిర్భయ చట్టం వచ్చిన తరువాత కూడా లైంగిక నేరాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ మంచిదే. అయితే ఈ ఆర్డినెన్స్‌ను యథాతథంగా అమలు చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. కొన్ని దేశాలలో లైంగిక నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్ష విధించాలి. – కె.పద్మ, కార్యదర్శి, మహిళా చేతన, విశాఖపట్నం -
కర్కశత్వం.. అమానవీయం..
వర్గల్(గజ్వేల్): కర్కశత్వం.. అమానవీయం.. నాలుగేళ్ల లోపు పసి పిల్లలు అని కూడా చూడ కుండా.. తమ అమానుష ప్రవర్తన బయటకు పొక్కకుండా.. పిల్లల కేకలు బయటకు వినప డకుండా.. నోట్లో గుడ్డలు కుక్కి.. శరీరంపై వాతలు పెట్టి.. ఒళ్లంతా హూనం చేసి, గిచ్చి, రక్కి, కాళ్లు, చేతులు విరిచి.. ప్రతి నిత్యం చిన్నారులకు నరకం చూపుతున్న తల్లి, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి దుశ్చర్య.. మానవత్వానికి మచ్చగా నిలుస్తోంది. ఎదురు ప్రశ్నించలేని చిన్నారులను చిత్రహింసలు చేస్తున్న ఇరువురి దుర్మార్గం గ్రామస్తుల చొరవతో ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ సమీపంలోని జాలిగామకు చెందిన మాచ పురం సురేశ్ అలియాస్ సురేందర్‌కు పెళ్లై భార్యను వదిలేశాడు. వర్గల్ మండలం తున్కిఖాల్సకు చెందిన రేణుకకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు దివ్య(4), డేవిడ్(రెండేళ్లలోపు బాబు) పుట్టిన తర్వాత భర్త వదిలేశాడు. గజ్వేల్‌లోనే కూలి పని చేసుకునే రేణుకకు, మాచపురం సురేశ్‌కు పరిచయం, ఆ క్రమంలో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరవై రోజుల నుంచి సురేశ్ వర్గల్ మండలం నాచా రంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ, ఇక్కడే రేణుక పిల్లలతో కలసి అద్దెగదిలో ఉంటు న్నారు. రేణుక, సురేశ్ ఇద్దరు దంపతులనే గ్రామస్తులు భావించారు. అయితే, రోజూ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలను వారు కొడుతున్న విషయం ఇరుగుపొరుగు గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. నోట్లో గుడ్డలు కుక్కి నోట్లో గుడ్డలు కుక్కి పిల్లలను గిల్లడం, కాళ్లు, చేతులు మెలితిప్పడం, చేతులు కట్టేసి ఇనుప పొగ గొట్టంతో శరీరంపై వాతలు పెట్టడం, చావ బాదడం లాంటి దుష్కృత్యాలు నిత్యకృత్యమైనా అరుపులు బయటకు విన్పించే ఆస్కారం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం వారి హింసకు తాళలేక దివ్య గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి అమానవీయ కృత్యాలను గమ నించారు. కాళ్లు వాచి పోయి నడవలేని స్థితిలో చిన్నారి ఉంది. దివ్య శరీరంపై వాతలు, కమిలి పోయిన గాయాలు, ముఖంపై రక్కిన గాయాలు చూసి చలించి పోయారు. ఆకలితో అల్లాడుతున్న చిన్నారిని చేరదీసి అన్నం పెట్టారు. చిన్న పిల్లాడి ఛాతిపై కమిలిన గాయం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలతో విలవిల్లా డుతున్న చిన్నారులను చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆసుపత్రికి తరలిం చారు. చిన్నారులను చిత్ర హింసలకు గురి చేసిన వైనం తెలిసి గజ్వేల్ సీడీపీఓ వెంకట్రాజమ్మ, జిల్లా బాలల సంక్షేమ అధికారులు రాజు, శంకర్ నాచారం సందర్శిం చారు. వెంకట్రాజమ్మ ఫిర్యాదు మేరకు సురేశ్, రేణుకలపై కేసు నమోదు చేశామని గౌరారం ఎస్సై ప్రసాద్ తెలిపారు. చిన్నారులను సం రక్షణ కోసం చిల్డ్రన్ హోమ్‌కు తర లించను న్నట్లు వెంకట్రాజమ్మ తెలిపారు. -
అలరించిన నృత్యోత్సవం
నంద్యాల: నంది నృత్యోత్సవంలో భాగంగా చిన్నారులు రెండోరోజు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. జాతీయ స్థాయిలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో సాయి నృత్య అకాడమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంది నృత్యోత్సవం రెండో రోజైన ఆదివారం ప్రదర్శనలు అదరగొట్టాయి. కవితాకర్(కోల్‌కత), మాలవిక(చెన్నై) భరతనాట్యం, తరుణి(భద్రం), దీపారెడ్డి(అనంతపురం), కూచిపూడి, సౌందర్య(శ్రీకాకుళం), లక్ష్మిప్రసూన శిష్యబృందం (హైదరాబాద్), ముసుమారి ఆర్ట్స్ అకాడమి(హైదరాబాద్) విద్యార్థులు తరంగ నృత్యం, మాలవిక(చెన్నై), రాజరాజేశ్వరి అష్టకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. వందమంది కళాకారులకు ప్రశంసా పత్రాలు, పతకాలు, శాలువాలు, నంది విగ్రహంతో పాటు బిరుదుతో సాయి నాట్యాకాడమి అధ్యక్షుడు సురేష్ సన్మానించారు. కార్యక్రమంలో మునుకూట్ల సాంబశివ, రాదిక, అనిల్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అనాథ పిల్లల కోసం ‘ఊయల’
కర్నూలు(హాస్పిటల్): అనాథ పిల్లల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. గురువారం ఆమె ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగాన్ని సందర్శించారు. పీఐసీయులో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను భారంగా భావించేవారు వారిని ఆసుపత్రిలోని ఊయలలో పడుకోబెట్టి వెళ్లవచ్చన్నారు. వారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. ఎస్‌ఎన్‌సీయూలో సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. చిన్నపిల్లల విభాగానికి అదనంగా 10 ఏసీలు, 40 పడకలు అవసరం ఉందన్నారు. మందుల కొరత తీవ్రంగా ఉందని, ఈ విషయాలను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు లేకుండా మాతాశిశు భవనాన్ని ఎందుకు ప్రారంభించారని, దీనిపై ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తానన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ అరుణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ఏఆర్ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. -
జట్టు కట్టి.. ఉట్టి కొట్టి
శ్రీకృష్ణాష్టమి వేడుకలు జిల్లాలో గురువారం వైభవంగా జరిగాయి. చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషధారణల్లో అలరించారు. పలు ప్రాంతాల్లో యువతీ, యువకులు ఉట్లు కొట్టి సంబురాలు జరుపుకున్నారు. -
శిక్షణపై పట్టింపేదీ..?
ఆదిలాబాద్ టౌన్ : చిన్నారులు, విద్యార్థులకు నూలిపురుగుల నివారణ కోసం ఈనెల 10న పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలు వేయనున్నారు. దీనిపై వైద్యాధికారులకు, మండల విద్యాధికారులకు, ఐసీడీఎస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో శిక్షణను శనివారం ఏర్పాటు చేయగా ఎవరూ అసక్తి కనబర్చనట్లు కనిపించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. కేవలం ఆరుగురు మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సమావేశం ప్రారంభం కాలేదు. ఉదయమే వచ్చిన వారు మిగితవారి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికి పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది హాజరు కాలేదు. శిక్షణ నామమాత్రమైంది. ఇంకా నూలిపురుగుల కార్యక్రమం ఏలా సాగుతుందో వేచి చూడల్సిందే! -
బిడ్డలను అమ్ముకున్న అన్నదాత