![CBI raids 59 locations across 21 states in operations - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/09/25/cbi.jpg.webp?itok=Oxzx2kDq)
న్యూఢిల్లీ: ఆపరేషన్ ‘మేఘ చక్ర’లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్‌ఏఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ ‘కార్బన్’ ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్‌లోని ఇంటర్‌పోల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎస్‌ఏఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ పంపిణీదారులు బాలలపై అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలను ఆన్‌లైన్‌లో ఉంచి డబ్బు సంపాదిస్తున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment